తిరుపతిలో శ్రీవారి భక్తుల ఆందోళన 
close

తాజా వార్తలు

Updated : 20/12/2020 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతిలో శ్రీవారి భక్తుల ఆందోళన 

తిరుపతి : తిరుపతిలోని విష్ణు నివాసం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. సర్వదర్శనం టోకెన్ల జారీ విషయమై భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 24వ తేదీ దర్శనం టోకెన్లు ముందస్తుగా ఇవ్వడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం కోసం నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలంటూ వారు తితిదే అధికారులను ప్రశ్నించారు. చిన్నపిల్లలు, వృద్ధులతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు నాలుగు రోజుల తర్వాత దర్శన అవకాశం కల్పిస్తారా అని నిలదీశారు. తితిదే నిఘా అధికారులు, పోలీసులు భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా భక్తులు ఆందోళన విరమించకపోవడంతో అధికారులు రేపటి టోకెన్లను మరో మూడు వేలు అదనంగా ఇచ్చారు.

అయితే అప్పటికే 24 తేదీ టోకెన్లు తీసుకున్న భక్తులు ఇదేం తీరు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ఆందోళనపై తితిదే స్పందించింది. రోజువారీ పరిమితి దాటడంతో 24వ తేదీ టోకెన్లు ఇస్తున్నామని పేర్కొంది. 21, 22, 23 తేదీల సర్వ దర్శనం టోకెన్లను తితిదే ముందుగానే జారీ చేసినట్లు వివరించింది. భక్తులను వెనక్కి పంపకూడదనే ఉద్దేశంతోనే టోకెన్లు ముందస్తుగా జారీ చేసినట్లు తితిదే అధికారులు చెబుతున్నారు.  

ఇదీ చదవండీ..
స్థానికులకే వైకుంఠ సర్వదర్శన టోకెన్లు 
 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని