Tirumala: అది ఆత్మహత్యా?ప్రమాదమా?
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tirumala: అది ఆత్మహత్యా?ప్రమాదమా?

తిరుపతి: తిరుమలలోని దుకాణాల వద్ద నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతిచెందిన వ్యక్తి మల్లిరెడ్డిగా గుర్తించిన పోలీసులు.. అతడు ప్రమాదం వల్లే మరణించాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడానికి ముందు మల్లిరెడ్డి మొబైల్‌ను తన తమ్ముడికి ఇచ్చినట్లు.. అందులో సెల్ఫీ వీడియో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో మృతుని భార్యతో పాటు పలువురిని విచారిస్తున్నారు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధమైన విషయం తెలిసిందే. తొలుత ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించినా.. మల్లిరెడ్డి మృతిపై పోలీసులకు వచ్చిన అనుమానంతో లోతుగా దర్యాప్తును చేపట్టారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని