తిరుపతిలో శ్రీవారి భక్తుల నిరసన
close

తాజా వార్తలు

Published : 23/12/2020 13:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతిలో శ్రీవారి భక్తుల నిరసన

తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని కోరుతూ తిరుపతి గరుడ కూడలిలో భక్తులు ఆందోళనకు దిగారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గరుడ కూడలిలో బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న తితిదే.. ఈ నెల 24 వరకూ సర్వదర్శన టోకెన్లు జారీ చేసి మూడు రోజులు ముందుగానే టోకెన్లు ఇచ్చే కేంద్రాలను మూసివేసింది. ముందస్తు ప్రకటన లేకుండా సర్వదర్శన టోకెన్లను జారీ చేయడాన్ని భక్తులు తప్పుపడుతున్నారు. శ్రీవారి మాల వేసుకొని పాదయాత్రగా దూరప్రాంతాల నుంచి వచ్చిన తమకు శ్రీవారిని దర్శించుకోకుండా వెనుదిరగాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తితిదే ధర్మకర్తల మండలి జోక్యం చేసుకుని సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..
‘మమతను చూసైనా జగన్‌ కళ్లు తెరవాలి’

తూర్పుగోదావరిలో వేడెక్కిన రాజకీయం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని