తిరుపతిలో అర్ధరాత్రి నుంచే టోకెన్ల జారీ
close

తాజా వార్తలు

Updated : 24/12/2020 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతిలో అర్ధరాత్రి నుంచే టోకెన్ల జారీ

తిరుమల : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీని తితిదే అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రారంభించింది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది తిరుపతి ప్రజలకు మాత్రమే సర్వదర్శనానికి దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే జారీ చేసింది. గత ఏడాది వరకూ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించిన తితిదే ఈ సారి సాంప్రదాయాన్ని మార్చింది. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా తితిదే భక్తులకు జారీ చేసింది. ఈ క్రమంలో డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకూ రోజుకు 10 వేల మంది చొప్పున మొత్తం లక్ష మందికి సర్వ దర్శన టికెట్లు ఇస్తోంది. 

ఈ మేరకు సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభించింది. ఇందుకోసం తిరుపతిలోని ఐదు కేంద్రాల్లో 50 కౌంటర్లు ఏర్పాటు చేసింది. టోకెన్ల కోసం భక్తులు రాత్రి నుంచే భక్తులు క్యూలైన్ల వద్ద పడిగాపులు కాశారు. కొన్ని చోట్ల ఉదయం ఐదు గంటల వరకూ టోకెన్ల క్యూలైన్లోకి భక్తులను అనుమతించకపోవడంతో రోడ్లపైనే కూర్చుండిపోయారు. నగరపాలక సంస్థ కార్యాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, బైరాగిపట్టెడ రామానాయుడి పాఠశాల, వైకుంఠపురం నూతన కూరగాయల మార్కెట్‌ టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద అర్ధరాత్రి నుంచి భక్తులు బారులుదీరారు. చలిలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వ దర్శనం కలిపి వైకుంఠ ద్వారం నుంచి మొత్తం మూడు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తితిదే అవకాశం కల్పిస్తోంది. డిసెంబరు 25, 26, 27వ తేదీలకు సంబంధించిన టికెట్లు జారీ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. 

తగిన జాగ్రత్తలు తీసుకున్నాం : జవహర్‌రెడ్డి
కరోనా దృష్ట్యా సర్వ దర్శన టోకెన్ల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. స్థానికులకే దర్శనం పరిమితం చేశామని, ఇతర ప్రాంతాల ప్రజలెవరూ తిరుపతికి రావొద్దని ఆయన కోరారు. 

 

ఇవీ చదవండి..
తిరుమలేశా.. కరుణించవా?

‘శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కరోనాకు రోల్‌ మోడల్‌’Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని