close

తాజా వార్తలు

Published : 17/09/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుపతి ఎంపీ కన్నుమూత

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి ఎంపీ, వైకాపా నేత బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల దుర్గాప్రసాద్‌కు కరోనా పరీక్ష చేయగా నెగెటివ్‌గా తేలినట్లు సమాచారం. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం భీమవరం.

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో 26 ఏళ్ల వయసులోనే దుర్గాప్రసాద్‌ రాజకీయాల్లో చేరారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఆయన ఎన్నికయ్యారు. 1985 -89, 1994-99, 1999- 2004, 2009-2014 మధ్య కాలంలో ఆయన ఎమ్మెల్యేగా సేవలందించారు. 1996-98 మధ్య తెదేపా ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. సుదీర్ఘకాలం దుర్గాప్రసాద్‌ తెదేపాలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలిచిన అనంతరం తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి కృషి చేశారు. ప్రధానంగా తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. 

ఉపరాష్ట్రపతి, ప్రధాని, సీఎం సంతాపం
ఎంపీ దుర్గాప్రసాద్‌ మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. ఎంపీ మృతిపై వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్కువ వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి అనేక ప్రజాఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. అనువజ్ఞుడైన నేతగా రాష్ట్రాభివృద్ధికి దుర్గాప్రసాద్‌ తనవంతు కృషిచేశారని ప్రధాని అన్నారు. ఎంపీ‌ కుటుంబసభ్యులకు మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్‌ మృతి విషయాన్ని తెలుసుకుని ఆయన కుమారుడితో సీఎం జగన్‌ ఫోన్‌లో‌ మాట్లాడారు. సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే
 భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు దుర్గాప్రసాద్‌ మృతికి సంతాపం తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.