మాకు మమత ఉన్నారు..మరి మీకు..?
close

తాజా వార్తలు

Published : 18/03/2021 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాకు మమత ఉన్నారు..మరి మీకు..?

కోల్‌కతా: పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో అది కాస్త వేడెక్కింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మోదీ విమర్శలు చేయగా.. తృణమూల్ నేత డెరెక్ ఓబ్రీన్ అదే స్థాయిలో వాటిని తిప్పికొట్టారు. మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ భాజపాను ప్రశ్నించారు. 

‘ప్రధానికి ఓకే ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? మాకు మమతా బెనర్జీ ఉన్నారు. మీరెందుకు ఆ పేరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఏ పేరు చెబితే..బీ, సీ తిరుగుబాటు చేస్తారు’ అని మీ అభ్యర్థి పేరు చెప్పాలంటూ భాజపాకు సవాలు విసిరారు. బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్, ఇటీవల ఆ పార్టీలో చేరిన సినీ నటుడు మిథున్ చక్రవర్తి, తృణమూల్ నుంచి వచ్చిన పలువురు నేతలు..ఇలా వీరందరిలో సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా, గురువారం మోదీ పురూలియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొని మమతపై విరుచుకుపడ్డారు. మమత ఆట మొదలైందని పదే పదే చెబుతున్నారని, భాజపా మాత్రం అభివృద్ధి మొదలైందని అంటోందన్నారు. ఆటకు ముగింపు మొదలైందని, అభివృద్ధికి ఆరంభం మొదలైందంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని