
తాజా వార్తలు
నకిలీ వార్తల పరిశ్రమను సృష్టించారు: టీఎంసీ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఎంసీ, ప్రతిపక్ష భాజపా మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. భాజపా నకిలీ వార్తలు ప్రచారం చేస్తోందంటూ టీఎంసీ తాజాగా ఆ పార్టీపై విరుచుకుపడింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ కకోలీ ఘోష్ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు.
‘విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల్లో విభజన సృష్టించి భాజపా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఒక పెద్ద భవనంలో యువకులను రంగంలోకి దిగి వారు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఎక్కువ నకిలీ వార్తలు వారి పరిశ్రమలో తయారైనవే. బెంగాల్ గురించి ఏ మాత్రం అవగాహన లేని నాయకుల్ని భాజపా బయటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి రప్పిస్తోంది. వారు ఇక్కడికి వచ్చి మన భాష, సంస్కృతిని అవమానిస్తున్నారు. కేంద్రంలో భాజపా ఆరేళ్ల పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని రాజకీయాల్లో చేరాలంటూ ఒత్తిడి చేయడంతో ఆయన గుండెపోటుకు గురయ్యారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు మరణిస్తున్నా.. కేంద్రం మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది’ అని కకోలీ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి
ఆక్టోపస్ అమ్ముల పొదిలో ఆధునిక అస్త్రాలు