కీళ్లవాతం డ్రగ్‌తో కొవిడ్ నుంచి త్వరగా విముక్తి!

తాజా వార్తలు

Published : 05/08/2020 19:16 IST

కీళ్లవాతం డ్రగ్‌తో కొవిడ్ నుంచి త్వరగా విముక్తి!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: కీళ్లవాతానికి వాడే టొసిలిజుమాబ్‌ డ్రగ్‌ కొవిడ్‌-19 నుంచి త్వరగా కోలుకొనేందుకు ఉపయోగపడుతోందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా విశ్వవిద్యాలయం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఫలితంగా ప్రాణవాయువుపై ఆధారపడే, ఆస్పత్రిలో చికిత్సా కాలం గణనీయంగా తగ్గుతోందని పేర్కొన్నారు. 87 మందిపై చేసిన అధ్యయనం ఫలితాలను ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించారు.

‘మాకు తెలిసి కొవిడ్‌-19కు సంబంధించి ఒక ప్రత్యేక డ్రగ్‌పై స్వీడన్‌ నుంచి వచ్చిన తొలి అధ్యయనం ఇదే’ అని ఆస్పత్రికి చెందిన నొవాక్‌ తెలిపారు. టొసిలిజుమాబ్‌ తీసుకున్న 28 మంది బాధితుల్లో అధిక వాపు (హైపర్‌ ఇన్‌ఫ్లమేషన్‌), సైటోకైన్‌  తీవ్రత బాగా తగ్గిందని పేర్కొన్నారు. ఐఎల్‌-6 రెసిప్టార్‌ను అడ్డుకోవడంతో ఇది సాధ్యమవుతోందని వెల్లడించారు. ఇతర రోగులతో పోలిస్తే డ్రగ్‌ తీసుకున్నవారిలో తేడా స్పష్టంగా కనిపించిందని అన్నారు. కరోనా వైరస్‌ రోగుల్లో వాపు, సైటోకైన్‌ తుపానుతో ప్రాణనష్టం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

ఇతరులతో రోగులతో పోలిస్తే టొసిలిజుమాబ్‌ తీసుకున్న రోగులు ప్రాణవాయువు, ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉండాల్సిన కాలం బాగా తగ్గుతోందని అధ్యయనం పేర్కొంది. ‘వెంటిలేటర్‌పై ఆధారపడాల్సిన సమయం 10, ఇంటెన్సిస్‌ కేర్‌ సమయం 8, మొత్తంగా ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం 10 రోజులు తగ్గుతోంది. ఇన్‌ఫ్లమేషన్‌ అధికంగా ఉన్న రోగులు త్వరగా కోలుకొనేందుకు ఈ డ్రగ్‌ సాయపడుతుంది. భారీ స్థాయిలో పరిశోధన చేస్తే ఇంకా కచ్చితంగా ఫలితాలు తెలుస్తాయి’ అని పరిశోధకులు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని