సాయంత్రం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
close

తాజా వార్తలు

Published : 30/06/2020 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయంత్రం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌, అన్‌లాక్‌ 2 వంటి అంశాలపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. గల్వాన్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనాతో ఉద్రిక్తతలు, ఆదేశానికి చెందిన 59 మొబైల్‌ యాప్‌లను కేంద్రం నిషేధించిన నేపథ్యంలో  మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మోదీ ఇప్పటి వరకు అయిదు సార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. మరో వైపు దేశంలో నేటితో అన్‌లాక్‌ 1.0 ముగియనుండగా.. రేపటి నుంచి అన్‌లాక్‌ 2.0 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే  కేంద్రం హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు జులై 31 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించాయి. మరి కొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రధాన్యత సంతరించుకుంది.
గల్వాన్‌లోయ ఘటన తరువాత తొలిసారి దేశ ప్రజల ముందుకు వస్తున్న ప్రధాని.. చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా స్వయం స్వావలంబన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశముంది. టిక్‌ టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. ఈ అవకాశాన్ని భారతీయ డిజిటల్‌ సంస్థలు అందిపుచ్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చే అవకాశముంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని