ఒలింపియన్లకు చైనా టీకా
close

తాజా వార్తలు

Published : 12/03/2021 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒలింపియన్లకు చైనా టీకా

జెనివా: ఒలింపియన్లకు టీకాలు అందించే విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, చైనా జట్టుకట్టాయి. టోక్యో, బీజింగ్‌లలో జరిగే ఒలింపిక్స్‌ (సమ్మర్, వింటర్‌)కు సిద్ధమవుతున్న క్రీడాకారులు, జట్లకు టీకాలు అందించాలని నిర్ణయించాయి. చైనా ఒలింపిక్‌ అధికారులతో ఐఓసీ వర్చువల్‌ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఈ ప్రతిపాదనకు మా ధన్యవాదాలు. ఒలింపిక్‌ స్ఫూర్తికి నిజమైన ప్రతీక ఇది’’ అని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు లేదా చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల ద్వారా టీకాలు సరఫరా చేస్తామని బాక్‌ చెప్పారు. సినోవాక్, సినోఫార్మ్‌ టీకాల్ని 45కు పైగా దేశాల్లో 50 కోట్ల మందికి సరఫరా చేసేందుకు చైనా సమాయత్తమవుతోంది. ఈ ఏడాది జులై- ఆగస్టులో టోక్యోలో ఒలింపిక్స్‌ జరుగనున్నాయి. 2022 వింటర్‌ ఒలింపిక్స్‌కు బీజింగ్‌ ఆతిథ్యమివ్వనుంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని