close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. సుప్రీంకోర్టుకు చేరిన ‘జామియా ఆందోళన’

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల ఘటన సుప్రీంకోర్టుకు చేరింది. తాజా ఆందోళనల్ని కట్టడి చేసే క్రమంలో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నిరాకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కలగజేసుకోలేమని.. తాము శాంతినే కోరకుంటున్నామని స్పష్టం చేశారు. ఇంకా ఘటనలు కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చెన్నమనేని పౌరసత్వం రద్దుపై విచారణ

వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం రద్దుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై విధించిన స్టేను మరో 8 వారాలపాటు పొడిగించింది. ఆయన జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారో లేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదావేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శాంతియుతంగా నిరసనలు చేయండి: కిషన్‌రెడ్డి

నిరసనలు శాంతియుతంగా చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయపార్టీలు రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు బస్సులను, ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి  హింసకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సైనికులకు శిరసాభివందనం: మోదీ

విజయ్‌దివస్‌ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ సైనికుల తిరుగులేని పరాక్రమాన్ని ప్రశంసించారు. జాతీయ యుద్ధ స్మృతిచిహ్నం వద్ద అమర వీరులకు ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ ‘‘భారతీయ సైనికుల ధైర్య, స్థైర్య, పరాక్రమాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 1971 యుద్ధంలో మన సాయుధ దళాలు సాధించిన విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది.’’ అని ట్వీట్‌ చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ప్రతిరోజూ పండగే’ ప్రీ రిలీజ్‌ వేడుక

6. రిజర్వ్‌ చేసుకొని రివర్స్‌ అంటున్నారు: బాబు

రివర్స్‌పాలన, తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై సచివాలయం ఫైర్‌స్టేషన్‌ నుంచి తెదేపా నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబుతో సహా నేతలందరూ వెనక్కి నడుస్తూ.. నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రివర్స్‌ పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. టెండర్లన్నీ రిజర్వ్‌ చేసుకొని రివర్స్‌ అంటున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు సమత హత్యాచార నిందితులు

గతనెల 24న కుమురం భీం జిల్లాలో హాత్యాచారానికి గురైన సమత కేసులో నిందితులకు జ్యూడీషియల్‌ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో  నిందితులు షేక్‌ బాబు, మఖ్దూం, షాబొద్దీన్‌లను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు తరలించారు. మరోవైపు నిందితుల తరఫున వాదించకూడదని బార్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు ప్రభుత్వమే ఓ న్యాయవాదిని నియమించే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జడేజా రనౌట్‌పై స్పందించిన పొలార్డ్‌

భారత్‌×వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో వివాదాస్పద జడేజా రనౌట్‌పై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. రీప్లేలో చూశాక ఫీల్డ్‌ అంపైర్‌ షాన్‌ మూడో అంపైర్‌ నిర్ణయాన్ని కోరడం ఎంత వరకు సమంజసమని వాదన వినిపిస్తోంది. మ్యాచ్‌ అనంతరం పొలార్డ్‌ మాట్లాడుతూ రనౌట్‌పై స్పందించాడు. ‘రనౌట్‌పై అంతిమంగా సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అనేదే నాకు ముఖ్యం అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాహుల్‌ వ్యాఖ్యలపై ఈసీ ఆరా..!

అత్యాచార ఘటనలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఏం జరిగిందో తెలియజేస్తూ ‘వాస్తవిక నివేదిక’ను సమర్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఝార్ఖండ్‌ ఎన్నికల అధికారులను ఆదేశించింది. గత వారం ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ‘మేకిన్‌ ఇండియా’ను అత్యాచార ఘటనలతో ముడిపెడుతూ భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భాజపా మహిళా ఎంపీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తాడికొండలో వాహనాలకు నిప్పు

గుంటూరు జిల్లా తాడికొండలో కారు, ఆటోకు ఆగంతకులు నిప్పుపెట్టారు. వేకువజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుసుకున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కారును గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా బంధువుకు చెందినదిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని పలుచోట్ల ఇళ్ల ముందు నిలిపిన వాహనాలకు ఆకతాయిలు నిప్పు పెడుతున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.