close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 5 PM

1. భయపెట్టి లాక్కోవటం మంచి పద్ధతా?: అచ్చెన్న

ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఆదుర్దాగా మండలి రద్దు బిల్లును సభలో పెట్టారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాసనసభ సమావేశాలు అంటే ఒక విధానంపై అజెండా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం దానిని పక్కనపెట్టారని విమర్శించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందునే పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

మండలి రద్దు:  లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


2. హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్‌

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్‌ తరఫున ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీఎంగా రాష్ట్ర పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని పిటిషన్‌లో జగన్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


3. ‘పేరుకు దిల్లీ పార్టీలు చేసేవి సిల్లీ పనులు’

మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరొకసారి బలంగా విశ్వసించించారంటూ ఆయన ధన్యవాదాలు చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్‌, ఛైర్మన్‌ ఎన్నికలు ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. పేరుకి దిల్లీ పార్టీలు.. చేసేవన్నీ సిల్లీ పనులు అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


4. LIVE : ఏపీ శాసనసభ సమావేశాలు 


5. కరీంనగర్‌లో కారుదే జోరు

కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 5 గంటల సమయానికి అధికార తెరాస 34 డివిజన్లలో జయకేతనం ఎగరవేసింది.  భాజపా 11 చోట్ల.. ఇతరులు ఎనిమిది చోట్ల, ఎంఐఎం ఐదు చోట్ల గెలుపొందాయి. మొత్తం 60 స్థానాల్లో ఇప్పటికే రెండు ఎకగ్రీవమైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలు ఈ నెల 22న జరిగితే.. కరీంనగర్‌లో రెండు రోజుల ఆలస్యంగా పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. 


6. చంద్రబాబు డ్రైవర్‌..యనమల స్టీరింగ్‌: రోజా

పెద్దల సభ సలహాలు ఇచ్చే వేదికగా ఉండాలి కానీ, సంఘర్షణలకు వేదికగా ఉండకూడదని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం మండలి రద్దుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘శాసనమండలి అంటే పెద్దల సభ. సీఎం జగన్‌ ఆ సభకు పంపిన వారందరూ రాజకీయంగా సీనియర్లు, అనుభవం ఉన్నారు. కానీ, చంద్రబాబు తన ఇంటిలోని వ్యక్తులను పంపారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్‌ అయితే, యనమల స్టీరింగ్‌ అన్న విషయం అందరూ గుర్తించాలని రోజా అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


7. అప్పుడే ఆ దారి తెరుచుకుంటుంది: కేజ్రీవాల్‌

భారతీయ జనతా పార్టీపై ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళనలను రాజకీయానికి ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఎన్నికలయ్యేంత వరకు ఆ రహదారిని వారు తెరవబోరన్నారు. ఒకసారి ఎన్నికలు పూర్తయ్యాక ఆ రోడ్లు తెరుచుకుంటాయని వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతల విషయంలో కేంద్రం అబద్ధాలు చెబుతోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


8. అట్టహాసంగా గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం


9. అఫ్గాన్‌లో కూలిన విమానం

అఫ్గాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఘజ్ని ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. ‘అరియానా అఫ్గాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం ఘజ్ని ప్రావిన్స్‌లోని సడో ఖేల్‌ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


10. భారీగా నష్టపోయిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ఆరంభం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అదే ధోరణిలో కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 458 పాయింట్లు నష్టపోయి 41,155 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 12,119 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.48 వద్ద కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.