close

తాజా వార్తలు

Updated : 30/03/2020 09:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మరణాల రేటు భారీగా పెరగనుంది: ట్రంప్‌

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సామాజిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  కారులో ఉంచే కరోనా పరీక్ష

‘అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోగ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసేందుకూ వసతులు సరిపోవడం లేదు. అందుకే వాళ్లు తమ వాహనంలో ఆసుపత్రి వర్గాలు నిర్దేశించిన ప్రదేశానికి వస్తే కారులో ఉంచే వారి నోటి నుంచి దూదితో స్రావాన్ని తీసుకుని పంపేస్తున్నారు. 2, 3 రోజుల్లో ఏ ఫలితం వచ్చిందనేది తెలియజేస్తున్నారు’ అని న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారతీయ వైద్య దంపతులు పోలవరపు అభిషేక్‌, సౌమిన్య తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏప్రిల్‌ 7 కల్లా ఊరట

కొత్త కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్‌ ఏడో తేదీ తర్వాత తెలంగాణలో కరోనా బాధితులే ఉండరని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది కోలుకున్నారని చెప్పారు. వారిని సోమవారం ఇళ్లకు పంపిస్తామన్నారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని, వారిని కూడా పరిస్థితులను బట్టి విడతల వారీగా డిశ్ఛార్జి చేస్తామన్నారు. వైద్యుల పర్యవేక్షణలో 25935 మంది ఉన్నారని, వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని చెప్పారు. కరోనాపై ఆదివారం ఆయన అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశం ఆ తర్వాత జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్షలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీ నుంచి 500 మంది!

దిల్లీలో మతపరమైన కార్యక్రమంలో పాల్గొని వచ్చినవారిలో పలువురికి కరోనా వైరస్‌ సోకింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లాలవారీగా దిల్లీ వెళ్లి వచ్చినవారి వివరాలు సేకరించగా 500మంది వరకు ఉన్నట్లు తెలిసింది. ఈ సంఖ్యను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 472గా పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో 280మంది, నెల్లూరు జిల్లాలో 70 మంది వరకు ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో 12-46 మంది ఉన్నారు. వీరిని క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చిత్రం చెప్పే విశేషాలు

6. మహమ్మారిని గెలిచారు

కరోనా వైరస్‌ బారిన పడినవారంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? ఈ మహమ్మారిని చావుకు కోరలు చాచి దూసుకువస్తున్న యమపాశంతో పోల్చాలా...? క్వారంటైన్లు, ఐసోలేషన్‌ వార్డులను నరకానికి ద్వారాలుగా భావించాలా..? కరోనాపై ప్రజల్లో నెలకొన్న ఇలాంటి అనుమానాలన్నీ కేవలం భయాందోళనలేనని చాటిచెబుతున్నారు వారు... దీని బారిన పడి కోలుకున్న మొదటి చైనా మహిళ, ఇటలీలో కొవిడ్‌-19ను జయించిన వందేళ్ల బామ్మ ఇందుకు ఉదాహరణలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ నిబంధనలు పాటించాల్సిందే

రాష్ట్రంలో 25,937 మంది స్వీయ గృహ నిర్బంధ పరిశీలన(క్వారంటైన్‌)లో ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా వీరు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్‌లో ఉంటూ, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల కోసం క్లిక్‌ చేయండి

8. కెప్టెన్సీ రేసులోకి స్మిత్‌

బాల్‌టాంపరింగ్‌ ఉదంతం కారణంగా ఏడాది నిషేధానికి గురై, కెప్టెన్సీ కూడా కోల్పోయిన ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవెన్‌ స్మిత్‌.. మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టేందుకు అర్హత సాధించాడు. అతణ్ని ఏడాది పాటు ఆటకు దూరం పెట్టిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. రెండేళ్ల పాటు కెప్టెన్సీ చేపట్టకుండా ఆంక్షలు విధించింది. ఆదివారం నాటితో ఈ గడువు ముగిసింది. దీంతో మళ్లీ అతను నాయకత్వ రేసులోకి వచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కరోనాపై పోరుకు కార్పొరేట్ల తోడు

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు, తమ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విరాళాలు ప్రకటిస్తూ కార్పొరేట్‌ సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి. ఇతర దేశాల నుంచి కూడా భారత్‌కు సాయం అందుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనాపై.. చిరు-నాగ్‌ పాట చూశారా?Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన