close

తాజా వార్తలు

Updated : 19/04/2021 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Top 10 News @ 9AM

1. కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు

ప్రస్తుతం వైరస్‌లో వచ్చిన మార్పుల కారణంగా అది బలవంతంగా గడియ తీసి.. తలుపులు తెరుచుకొని ఇంట్లోకి చొరబడినట్లుగా మానవ కణజాలంలోకి ప్రవేశిస్తోందని ప్రముఖ ప్రజారోగ్య నిపుణుడు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది కళ్లలోంచీ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నందున అందరూ పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోళ్లు ధరించడం మంచిదని సూచించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. వారానికి 15 లక్షల డోసులు

కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రక్రియ నిరాటంకంగా సాగాలంటే.. వారానికి కనీసం 15 లక్షల డోసులను కచ్చితంగా అందుబాటులో ఉండాలని వైద్యఆరోగ్యశాఖ భావిస్తోంది. ఇలాగైతేనే మొదటిడోసు వారికి, రెండోడోసు వారికి నిరంతరాయంగా టీకాలను అందించడానికి వీలుంటుంది. మూణ్నాలుగు రోజులకొకసారి 2-3 లక్షల టీకాలను పంపిస్తే.. పంపిణీలో ఆందోళన నెలకొంటుందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు టీకాల సరఫరాపై తెలంగాణ వైద్యశాఖ తాజాగా ప్రతిపాదనలను పంపించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఏటీఎంలో చోరీలకు కొత్త వ్యూహం
ఏటీఎంలలో కొత్త రకం చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. ‘ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’ ద్వారా భద్రతను మెరుగుపరచాలని కోరారు. ఇటీవలి కాలంలో ‘మ్యాన్‌ ఇన్‌ ద మిడిల్‌’ (ఎంఐటీఎం) దాడులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను హెచ్చరించింది. ఇందులో భాగంగా సైబర్‌ నేరగాళ్లు.. ‘ఏటీఎం స్విచ్‌’ నుంచి ‘ఏటీఎం హోస్ట్‌’కు వెళ్లే సందేశాలను మార్చివేస్తున్నారని, తద్వారా అక్రమంగా నగదును విత్‌డ్రా చేస్తున్నారని తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి 
ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజధాని కైరోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్‌ అనే ఓ చిన్న పట్టణం వద్ద రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 98 మంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈజిప్ట్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు  సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 50కి పైగా అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. 2 వారాలు.. 107 మరణాలు
రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఏరోజుకారోజు ఆందోళనకర రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటివరకూ ఎన్నడూలేని రీతిలో కొత్త కేసులు, మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. గత రెండు వారాల్లో వైరస్‌ బారినపడి 107 మంది మరణించడం మహమ్మారి తీవ్రతను తెలియజేస్తోంది. వైద్యఆరోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం.. ఈనెల 17న(శనివారం) అత్యధికంగా 5,093 కొత్త కేసులు నమోదవగా, 15 మంది మహమ్మారి బారినపడి ఒక్కరోజే కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల్లో మరణాల శాతం(0.51) తక్కువగానే నమోదైనా.. ఈ సంఖ్య క్రమేపీ పైపైకి ఎగబాకుతోంది. శనివారం నాటి మరణాలతో కలిపితే రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,824కు పెరిగింది మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రూ.లక్ష కడితేనే లోపలికి

కొవిడ్‌తోపాటే రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీలో ‘రెండోదశ ఉద్ధృతి’ మొదలైంది. కొన్ని ఆసుపత్రులు డబ్బు కడితేనే చికిత్స అందిస్తున్నాయి. కనీసం రూ.లక్ష ముందుగా చెల్లించకపోతే.. చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నాయి. దీంతో రోగులు అప్పుల పాలు కావాల్సి వస్తోంది. మరికొన్ని ఆసుపత్రుల్లో నగదు మాత్రమే కట్టాలని పట్టుబడుతున్నారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లిస్తే.. ఆ డబ్బుకు పన్ను చెల్లించాల్సి రావడంతో.. ఈ ‘నగదు’ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఇటు రోగుల ముక్కు పిండి వసూలు చేస్తున్నా అవి మాత్రం పన్ను ఎగ్గొడతాయన్నమాట. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.భారత్‌తోనే చైనాకు కట్టడి
ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బలంగా ఉన్న భారత్‌ భావసారూప్యత కలిగిన దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా చైనాను నిలువరిస్తుంది’ అన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలోని ఇండో-పసిఫిక్‌ విధానపు కీలక వ్యాఖ్య సమకాలీన ప్రపంచంలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో హిందూ మహాసముద్రం కీలక భూమిక పోషిస్తోంది. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాకు ఇదే కీలక మార్గం. చతుర్భుజ కూటమిలోని అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలకు ఇండో-పసిఫిక్‌ వ్యూహాత్మకంగా ముఖ్యమైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. 63 వేల పడకలున్నాయ్‌
కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులను మినహాయిస్తే.. రాష్ట్రంలో ఎక్కడా కొవిడ్‌ బాధితులకు పడకల కొరత లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 63 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని, బెడ్లు దొరకవేమోనని ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి అవసరమైతే వందల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.  ‘‘ఈ వ్యాధి సోకిన వారందరికీ స్పెషలిస్టు వైద్యసేవల అవసరం రాదు. ఎంబీబీఎస్‌లు చికిత్స అందించవచ్చు. నిజంగా అవసరమైన వారికే వైద్యులు ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందించాలి’’ అని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. రెప్పపాటులో కమ్మేస్తోంది!

గ్రేటర్‌ పరిధిలో కొవిడ్‌ పరీక్ష కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండో దశలో కేసులు విపరీతంగా పెరుగుతుండడం, పరీక్ష కేంద్రాలకు అనుమానితులు భారీగా వస్తుండడం కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు, టీకా వేయించుకునేందుకు సిద్ధమైన వ్యక్తులు పరీక్షలకు వస్తుండటంతో పరిస్థితి కష్టమవుతోందని పాతబస్తీకి చెందిన పీహెచ్‌సీ వైద్యాధికారి ఒకరు తెలిపారు. ఎండ తీవ్రతకు భయపడి ఉదయాన్నే కేంద్రాల వద్దకు చేరుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మూడో దశ ముప్పు.. ముందే గుర్తించొచ్చు

కొవిడ్‌ రెండో దశ (వేవ్‌) కోరలు చాస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రెండో దశను ముందే కచ్చితంగా అంచనా వేయగలిగి ఉంటే మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదనే భావన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. రెండో దశే మాత్రమే కాదు.. విదేశాల్లో ఎదురైన అనుభవాలతో మన దేశంలోనూ మూడో దశ రావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడో దశ ముప్పును ముందే గుర్తించే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని