Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 25/10/2021 08:57 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1.ఇరవయ్యేళ్ల గులాబీ

రెండు పదుల వయసు... నిండు జవ్వన ఉత్సాహం... ఊరూరా శ్రేణులతో పునాదిని బలోపేతం చేసే యత్నం... భవితకు అదే పటిష్ఠమైన వారధి అన్న విశ్వాసం... 20 ఏళ్ల ప్రస్థానపు విజయాల స్మరణతో... భావి లక్ష్యాలపై గురి పెట్టి... తెలంగాణ రాష్ట్రసమితి మరోసారి ప్లీనరీకి సిద్ధమైంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది.

2.విశాఖ విమానాశ్రయం నుంచి ఏఏఐ అంతర్జాతీయ కార్గో సేవలు రద్దు!

విశాఖ విమానాశ్రయం కేంద్రంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాలు లేని కారణంగా తమకు తీవ్ర నష్టాలొస్తున్నాయని, తమ కార్గో సేవలను ఈ విమానాశ్రయం నుంచి రద్దు చేసుకుంటున్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీటీపీసీ) లేఖ రాసింది.

3.జనసేనది ప్రజాపక్షం.. ఎవరికీ భయపడేది లేదు: పవన్‌ కల్యాణ్‌

జనసేన చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజానీకం కష్టాలను, వారు ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఛిద్రమైన రహదారులకు సంబంధించి ప్రజాస్వామ్య పద్ధతిలో శ్రమదానం ద్వారా మరమ్మతులను చేపడితే ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలంతా చూశారన్నారు.

4.‘ఏందయ్యా ఈ అరాచకం.. నేనెప్పుడూ చూళ్లే’..

పాకిస్థాన్‌ జర్నలిస్టు వ్యవహరంలో పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతలు, మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ మధ్య నడుస్తున్న మాటల యుద్ధంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంతటి అరాచకం తానెప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తంచేశారు. పార్టీ నేతలు వాడుతున్న భాషపైనా అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.

5.ఇమ్రాన్‌ గద్దె దిగాల్సిందే.. ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్‌

పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు, ర్యాలీలు చేపడుతున్నారు. వారి ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ పనితీరుపై ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

6.జపాన్‌ పాస్‌పోర్టు ఉంటే 192 దేశాలకు వెళ్లొచ్చు

పాస్‌పోర్టు సూచీలో జపాన్‌, సింగపూర్‌ ప్రథమ స్థానంలో నిలిచాయి. దక్షిణ కొరియా, జర్మనీ ద్వితీయ స్థానం పొందాయి. ‘హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌’లో భారత పాస్‌పోర్టు స్కోరు గత ఏడాది (84) కంటే ఆరు స్థానాలు తగ్గిపోయి 90కి పరిమితమైంది. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్‌పోర్టులు ఇచ్చే దేశాలను ఈ సూచీలో పేర్కొంటారు.

7.ఆర్యన్‌ విడుదలకు 25 కోట్లు ఇవ్వాలి

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్న డ్రగ్స్‌ కేసులో ఊహించని మలుపు! ఆర్యన్‌ను విడుదల చేయడానికి మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ)కు చెందిన ఓ అధికారితోపాటు మరికొందరు షారుక్‌ను రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని ప్రభాకర్‌ సాయీల్‌ అనే ప్రత్యక్ష సాక్షి ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు.

8.కేఎల్‌ రాహుల్‌ నాటౌటా? నోబాల్‌ అంటున్న నెటిజన్లు

2021 టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ ఓటమితో ప్రారంభించింది. ఆదివారం రాత్రి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడి పది వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదుర్కొంది. దీంతో ప్రపంచకప్‌ టోర్నీల్లో సంపూర్ణ ఆధిపత్యానికి తెరపడింది. అయితే, గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ (3) ఔటైన బంతి చర్చనీయాంశమైంది.

9.సినీ నటుడు రాజబాబు కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజబాబు ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

10.ఆందోళనే.. అయినా ఆదరణే

ఈ ఏడాదిలో అదీ 6 నెలల వ్యవధిలో బిట్‌కాయిన్‌  విలువ తీవ్ర ఒడుదొడుకులకు లోనైందో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తమ కార్ల కొనుగోళ్ల చెల్లింపులకు బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తామంటూ చేసిన ప్రకటనతో, బిట్‌కాయిన్‌ విలువ అమాంతం దూసుకెళ్లి ఏప్రిల్‌ మధ్యలో 64895 డాలర్ల వద్ద అప్పటికి జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని