close

తాజా వార్తలు

Updated : 17/01/2021 13:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. డ్రాగన్‌ ‘ప్లాన్‌’ ప్రకారమే..

సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవి (ప్లాన్‌) జలాంతర్గాముల కోసం తరచూ భారత్‌ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది. ఇందుకోసం సముద్ర సరిహద్దులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. అంతేకాదు.. నౌకలకు సంబంధించిన కీలక సమాచార వ్యవస్థలను ఆఫ్‌ చేసి ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఇండోనేషియా అధికారులు బయటపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆందోళనలో అగ్రరాజ్యం!

కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణస్వీకారానికి ముందు అమెరికాలో గంభీర వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా దేశ రాజధాని వాషింగ్టన్‌ డి.సిలో వీధులన్నీ భద్రతా బలగాలతో నిండిపోతున్నాయి. ఇంకా ఆయా రాష్ట్రాల నుంచి దళాలు వచ్చి చేరుతున్నాయి. అలాగే 50 రాష్ట్రాల రాజధాని నగరాల్లోనూ వాతావరణం వేడెక్కింది. క్యాపిటల్‌ భవనాలపై అనునిత్యం నిఘా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సిన్సినాటి మేయర్‌ రేసులో ఇండియన్‌ అమెరికన్‌

3. డీజీపీ వ్యాఖ్యలపై సీఎం‌ స్పందించాలి: భాజపా 

విగ్రహాల విధ్వంసం వెనుక భాజపా నేతలు ఉన్నారంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన డీజీపీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.ఆదివారం ఉదయం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ... దేవాయాల్లో విధ్వంసాలకు పాల్పడుతుంటే వాటిపై ఏవిధమైన చర్యలు తీసుకోకుండా .. భాజపా కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 17,170 రికవరీలు.. 15,144 కేసులు

భారత్‌లో గత 24 గంటల్లో 7,79,377 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,144 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,57,985కి చేరింది. ఇక కొత్తగా 17,170 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1,00,75,950కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.58 శాతానికి పెరిగింది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 181 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,52,274కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు

5. చీరోచిత విన్యాసాలు

చీర కడితే ఒయ్యారంగా నడవాలి. ఎప్పటికప్పుడు సవరించుకుంటూ జాగ్రత్త పడాలి. కానీ హరియాణా అమ్మాయి పరుల్‌ అరోరా ఉంది చూశారూ! చీరతోనే అమాంతం గాల్లో పల్టీలు కొడుతుంది. విన్యాసాలతో కళ్లార్పకుండా చేస్తుంది. ఈ సాహసాలతోనే తనిప్పుడు ఆన్‌లైన్‌ సంచలనంగా మారింది. పరుల్‌ ఓ జిమ్నాస్ట్‌. సాధారణంగా జిమ్నాస్ట్‌లు ట్రాక్‌లోకి దిగేముందు సౌకర్యంగా ఉండేందుకు ఒంటికి అతుక్కుపోయే ట్రాక్‌ దుస్తులు ధరిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బైడెన్‌ తొలి సంతకం వీటిపైనే..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలనతో విసిగిపోయిన ఆ దేశ ప్రజల్లో.. బైడెన్‌ ఇచ్చిన కొత్త హామీలతో ఆశలు చిగురించాయి. అందుకే ఎన్నికల్లో ఆయనకే పట్టం కట్టారు. వాటిని సాకారం చేసే దిశగా ఆయన కార్యాచరణ ప్రారంభించారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైట్‌ హౌస్‌లో కాబోయే చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రోన్‌ క్లెయిన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గోల్కొండపై భాజపా జెండా ఎగరేస్తాం: బండి

గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర భాజపా మొదటి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భాజపా కార్యకర్తలు చేసిన సేవలు చాలా గొప్పవన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ ప్రొఫెసర్‌కు రూ.13 కోట్ల ఫెలోషిప్‌

భారత సంతతి అమెరికా ప్రొఫెసర్‌ ముబారక్‌ ఉస్సేన్‌ సయ్యద్‌ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో ప్రతిష్ఠాత్మక కెరీర్‌ ఫెలోషిప్‌ అవార్డ్‌ను సాధించారు. మెదడుపై చేస్తున్న ప్రయోగానికి గాను యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ దీనిని ప్రదానం చేసింది. ఇందుకుగాను ఐదేళ్ల కాలంలో రూ.13 కోట్ల ఫెలోషిప్‌ ఆయనకు అందనుంది. కశ్మీర్‌కు చెందిన  ముబారక్‌ ఉస్సేన్‌ సయ్యద్‌, అమెరికా న్యూ మెక్సికో యూనివర్సిటీ న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మెడలో రుద్రాక్షతో ‘సిద్ధా’గా రామ్‌చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ కీలకపాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూట్‌లో చరణ్‌ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో చరణ్‌ మెడలో రుద్రాక్ష.. చెవికి పోగుతో కనిపించారు. ఈ సినిమాలో చరణ్‌ సిద్ధా అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 336 ఆలౌట్‌

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(62; 144 బంతుల్లో 7x4, 1x6), శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకాలతో రాణించారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా స్కోర్లు చేయకపోయినా వీరిద్దరూ పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే గబ్బా మైదానంలో టీమ్‌ఇండియా తరఫున ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* శార్దూల్‌, సుందర్‌ రికార్డు భాగస్వామ్యంTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని