close

తాజా వార్తలు

Published : 22/01/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. వైకాపా అరాచకాలపై పోరాడుదాం: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో 142 ఆలయాలపై దాడులు జరిగే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. వేరే మతాలపై దాడి జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడతారు. కానీ, హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరా అని నిలదీశారు.  ‘‘హిందువుల పట్ల ఒకలా, ఇతర మతాల పట్ల ఒకలా స్పందించటం తప్పు. అన్ని మతాల పట్ల సమభావమే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా’’ అని పవన్‌ ప్రశ్నించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు: ఈటల

లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట, బార్కాస్‌, జంగంపేట, పానీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొల్పిన ఈ అధునాతన నిర్ధారణ పరీక్షల కేంద్రాలను శుక్రవారం మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ప్రారంభించారు. పేద ప్రజలకు చేరువగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌’ పథకం సేవలను మరింతగా విస్తరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధర

3. కేంబ్రిడ్జి అనలిటికాపై సీబీఐ కేసు

ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ కేంబ్రిడ్జి అనలిటికా, గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చి లిమిటెడ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం కేసు నమోదు చేసింది. భారత్‌కు చెందిన ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా సేకరించినందుకు గానూ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చి 2014లో ‘దిస్‌ ఈజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ (this is your digital life) అనే యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అంతుచిక్కని కారణాలతో పలువురికి అస్వస్థత

అంతుచిక్కని వ్యాధి పశ్చిమగోదావరి జిల్లాను వెంటాడుతోంది. దెందులూరు మండలం కొత్తగూడెం శివారు కొమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని కారణాలతో 24మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో పడిపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి సునంద, ఇతర అధికారులు హుటాహుటిన గ్రామానికి తరలివచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నాగశౌర్య సిక్స్‌ ప్యాక్‌ లుక్స్‌..!

బర్త్‌డే బాయ్‌ నాగశౌర్య.. ‘వరుడి’గా రెడీ అవుతున్నట్లున్నారు. తాజాగా ఆయన సిక్స్‌ప్యాక్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. గతేడాది విడుదలైన ‘అశ్వథ్థామ’ తర్వాత నాగశౌర్య వరుస ప్రాజెక్ట్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిల్లో ఫ్యామిలీ, లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’ ఒకటి. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా రీతూవర్మ సందడి చేయనున్నారు. శుక్రవారం హీరో పుట్టినరోజు సందర్భంగా.. ‘వరుడు కావలెను’ టీమ్‌ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. క్షీణించిన శశికళ ఆరోగ్యం

 శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు.  బెంగళూరులోని బౌరింగ్‌ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఆ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ లేకపోవడంతో అక్కడి నుంచి ఆమెను విక్టోరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చేసిన సీటీ స్కాన్‌ పరీక్షలో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘వర్కింగ్‌‌ ఫ్రమ్‌ జర్నీ’.. ముంబయి టు కన్యాకుమారి

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించాయి. దీంతో కొంతమంది ఇంటి నుంచి.. మరికొంతమంది ఏకంగా సిటీ వదిలి స్వగ్రామం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. ఇంకొందరైతే పరిస్థితులు చక్కబడే వరకు ఏకంగా ఉద్యోగానికి సెలవు పెట్టేశారు. కానీ, ఓ ముగ్గురు స్నేహితులు మాత్రం ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటును సాహసయాత్రగా మలుచుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈ పని చేస్తే.. మస్క్‌ రూ.730 కోట్లు ఇస్తారట!

8. భారత్‌కు ముందు ముందు మరిన్ని సవాళ్లు..

భారత్‌ ముందుముందు మరిన్ని భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చని భారత ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యానికి అనుగుణంగానే.. సవాళ్లూ అధికమవుతాయని ఆయన వివరించారు. అలాంటి పరిస్థితుల్లో విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగా రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వారానికి మూడు రోజులు సెలవులివ్వండి!

 జపాన్‌లో ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులు పనిదినాలు ఇచ్చి మూడు రోజులు వారాంతపు సెలవులు ప్రకటించాలని ఆ దేశ రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసిన మూడు రోజుల వారాంత సెలవుల విధానం విజయవంతం కావడంతో దీన్ని అమలు చేయాలంటున్నారు. దీనిపై చట్టం తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆసీస్‌ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి  

ఆస్ట్రేలియా ఇకపై మేటి జట్టు కాదని, అదెప్పుడో గతంలోని మాట అని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌స్వాన్‌ విమర్శించాడు. ఇటీవల జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లు బలమైన ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన స్వాన్‌.. ఇంగ్లాండ్‌ జట్టు ఇక మీదట యాషెస్ సిరీస్‌ గురించి కాకుండా టీమ్‌ఇండియాపై దృష్టి సారించాలని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని