close

తాజా వార్తలు

Published : 23/02/2021 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైంది. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ జరగనుంది. అసంపూర్తి భవనాల నిర్మాణానికి ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశముంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానంపై మంత్రి వర్గం చర్చించనున్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జగన్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా రైతుల ఆందోళన

2. నాడు పాక్‌ వద్దంది.. నేడు భారత్‌ ఓకే చెప్పింది

కశ్మీర్‌ విషయంలో భారత్‌ను రెచ్చగొడుతూ కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది దేశం పాకిస్థాన్ ఆ మధ్య మన విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆ దేశానికి మన గగనతలం మీదుగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు భారత్‌ ఏ మాత్రం అడ్డుచెప్పకుండా అనుమతులు మంజూరు చేయడం గమనార్హం.  శ్రీలంక పర్యటనకు వెళ్తున్న పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విమానం భారత్‌ మీదుగా వెళ్లేందుకు కేంద్రం అంగీకరించింది. పాక్‌ విమానం భారత గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతి కల్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ 136 మంది చనిపోయినట్లే..!

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జల ప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు, రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. గల్లంతైన వారిని ‘‘చనిపోయినట్లుగా భావిస్తున్నాం’’ అని ప్రకటించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు తాజాగా ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) 2021లో కొత్త పాలసీని విడుదల చేసింది. బీమా రక్షణతో పాటు పొదుపునకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ‘బీమా జ్యోతి’ పేరుతో తెచ్చిన ఈ పాలసీని కనీసం రూ.లక్ష నుంచి తీసుకోవచ్చు. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. పాలసీ వ్యవధి 15, 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. అయితే, ఇది లిమిటెడ్‌ ప్రీమియం పేమెంట్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. అంటే ప్రీమియం కొంత కాలం పాటే చెల్లిస్తాం. బీమా మాత్రం తర్వాత కొన్నేళ్ల వరకు వర్తిస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రీమియం చెల్లించాల్సిన అవధి మనం తీసుకున్న పాలసీ అవధి కంటే ఐదేళ్లు తక్కువగా ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హమ్మయ్యా.. కరోనా కేసులు కాస్త తగ్గాయ్‌!

దేశంలో గత కొన్నిరోజులుగా మళ్లీ పెరుగుతూ పోయిన కరోనా కేసులు.. తాజాగా కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,584 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది. అయితే అంతక్రితం రోజు(14,199)తో పోలిస్తే సోమవారం దాదాపు 25శాతం తక్కువ కేసులు నమోదుకావడం గమనార్హం. అంతేగాక, కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

యూఎస్‌ కరోనా మరణాలు: 3 యుద్ధాలతో సమానం

6. మెట్టవలసలో వైకాపా, తెదేపా రాళ్లదాడి

 పంచాయతీ ఎన్నికల పోరు పల్లెల్లో చిచ్చు రేపింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెట్టవలస పంచాయతీలో రెండు రోజుల కిందట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైకాపా వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెదేపా వర్గీయులు ఆరోపించారు. దీనిపై వారు వైకాపా వర్గీయులను నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 139 ఏళ్ల ఈ ఇంటి ‘అడ్రస్‌ మారింది’!   

ఇల్లు మారి కొత్త ఇంటికి వెళ్లినప్పుడు.. ఇంటి అడ్రస్‌ మారింది అంటాం. మరి ఇంటి అడ్రస్సే అచ్చంగా మారితే..! నిజంగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సదరు పురాతన విక్టోరియన్‌ భవంతిని 139 ఏళ్ల క్రితం నిర్మించిన నాటి నుంచి ‘807, ఫ్రాంక్లిన్‌ స్ట్రీట్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో’ అనే చోటే ఉంది. కాగా, కొన్ని కారణాల వల్ల ఈ ఆదివారం అదే ప్రాంతంలో ఆరు వీధుల అవతల ఉన్న ఫుల్‌ట్రాన్‌ స్ట్రీట్‌కు చేరుకుని తన చిరునామా మార్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కుటుంబం కోసం ఆరాటం..చిరుతతో పోరాటం

భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులితో తలపడి దాన్ని చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తెతో ద్విచక్రవాహనంపై వెళుతున్న రాజ్‌గోపాల్‌ నాయక్‌పై పులి ఒక్కసారిగా దూకింది. ఈ క్రమంలో ముగ్గురు బైకు మీద నుంచి కిందపడిపోయారు. వెంటనే చిరుతపులి వారిపై దాడి చేసింది. చిరుత బారి నుంచి భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు రాజ్‌గోపాల్‌ నాయక్‌ వీరోచిత పోరాటం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తల్లీకుమారుడు సజీవదహనం

9. ఇరువురు భామలు.. ఇరుకున కథానాయకులు

ఒకే హీరోని రెండు విభిన్న పాత్రల్లో చూస్తే ప్రేక్షకులకు ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అదే హీరో పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తే అంతకన్నా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఏ నాయికని ప్రేమిస్తాడు? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? అంటూ సినిమా మొదలైన క్షణం నుంచే ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇలా ఇద్దరు భామల మధ్య నలిగిపోయే కథానాయకుల కథలు టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో వస్తున్నా ఈ మధ్య వాటి సంఖ్య కాస్త తగ్గిందని చెప్పొచ్చు. కాదు అంటూ ఈ ఏడాది కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. అవేంటి.. ఎవరా నాయకానాయికలు? చూసేద్దాం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐపీఎల్‌లో లంక ఆటగాళ్లు లేరెందుకు..?

ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఒక్క శ్రీలంక ఆటగాడినీ తీసుకోకపోవడంపై ఆ దేశ దిగ్గజాలు కుమార సంగక్కర, మహేలా జయవర్దెనె స్పందించారు. అయితే, వీరిద్దరూ భిన్న స్వరాలు వినిపించడం గమనార్హం. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సంగక్కర ఈ విషయంపై స్పందిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో లంక జట్టుకు కచ్చితమైన షెడ్యూల్‌ లేకపోవడమే ఆ జట్టు ఆటగాళ్లను తీసుకోకపోవడానికి ప్రధాన కారణమని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని