
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకి
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడచినందున తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో నామనేషన్లు వేయనీయకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* 27 నుంచి ఎస్ఈసీ ప్రాంతీయ సమావేశాలు
2. సీబీఐ విచారణ జరిపించాలి: ఉత్తమ్
న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘటన అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యపై కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అంనతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ తమిళి సైని కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కేరళ, బెంగాల్లో మోగనున్న ఎన్నికల నగారా
కేరళ, పశ్చిమబెంగాల్ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ఈసీ నేడు ప్రకటించే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కరోనా మరణ మృదంగం@ 25లక్షలు
కరోనా వైరస్ వెలుగుచూసి ఇప్పటికే ఏడాది పూర్తయినప్పటికీ..అది సృష్టిస్తోన్న విలయం ఇంకా కొనసాగుతోంది. టీకాలు అందరికీ చేరువకాకపోవడంతో..ఇప్పటికీ వైరస్ మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నాటికి 25 లక్షల పైచిలుకు మరణాలు సంభవించాయని ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ లెక్కగట్టింది. ఇప్పటివరకు 11,26,18,488 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని, 25,00,172 మంది మృత్యు ఒడికి చేరుకున్నారని తన నివేదికలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* రెండో రోజు..16వేలపైనే కరోనా కేసులు
5. కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కోదాడ పెద్ద చెరువులో దూకి యువతీ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న ప్రేమ జంట అదృశ్యంపై పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కోదాడ పెద్ద చెరువులో దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెరువులోంచి బయటకు తీయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో విడుదల
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ‘పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు’ పేరుతో 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. త్వరలో బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రోజురోజుకి పెరిగిపోతోన్న తరుణంలో కొనుగోలదారుల దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై పడుతోంది. ఇప్పటికే దేశంలో యూలు, వోగోలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు తయారు చేస్తున్నాయి. అయితే అద్దెకు బైక్‌లను ఇచ్చే బౌన్స్ కంపెనీ ‘బౌన్స్-ఈ ఎలక్ట్రిక్ స్కూటర్’ను ఇండియాలో త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు వివేకానంద హెల్లెకెరె ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రివ్యూ: అక్షర
కరోనా ప్రభావంతో కొన్ని నెలలపాటు సినిమా థియేటర్లకి దూరమైన ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే మునుపటిలా వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. వంద శాతం సీటింగ్ కెపాసిటీతో ప్రదర్శనలకి అనుమతులు వచ్చాక థియేటర్ల దగ్గర మళ్లీ సందడి వాతావరణం కనిపిస్తోంది. సినీ రూపకర్తలు ప్రతివారం నాలుగైదు సినిమాల్ని విడుదల చేస్తూ సినీ ప్రియులకి వినోదాల కొరత తీరేలా చేస్తున్నారు. ఈ వారం కూడా అరడజను చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి... ‘అక్షర’. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? నందిత శ్వేత నటన ఏ మేరకు ఆకట్టుకుంది? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఈ భామలు.. ఒక్క డైలాగ్‌తో కిక్కెక్కించారు
9. 117 జిలిటెన్ స్టిక్స్, 350 డిటోనేటర్లతో రైల్లోకి..
కేరళలో ఓ రైలు ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ చెన్నై-మంగళూరు ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు కోజికోడ్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా.. ఆమె వద్ద 117 జిలిటెన్ స్టిక్స్, 350 డిటోనేటర్లు కన్పించాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ మహిళను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. 2 రోజుల్లో.. ఖేల్ ఖతం దుకాణ్ బంద్!
క్రికెట్ అంటేనే టెస్టు క్రికెట్. కాలక్రమంలో వివిధ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినా అసలు సిసలు మజానిచ్చేది ఐదు రోజుల సాంప్రదాయ ఆటే. ఇప్పుడంతా పరిమిత ఓవర్ల హవా నడుస్తున్నా ఒకప్పుడు ఈ సుదీర్ఘ ఫార్మాట్ చూసేందుకే జనాలు ఆసక్తి చూపేవారు. బ్యాట్స్‌మెన్ పరుగుల ప్రవాహానికి, బౌలర్ల సహనానికి ఈ మ్యాచ్‌లే ప్రత్యక్ష వేదికలుగా నిలిచేవి. ఇలాంటి రసవత్తర పోరులో ఎన్నో మ్యాచ్‌లు ఐదు రోజులపాటు పూర్తిగా జరిగేవి. కానీ, ఏకపక్షంగా సాగే మ్యాచ్‌లు నాలుగు, మూడు లేదా రెండు రోజుల్లోనే ఫలితాలు వచ్చేవి. తాజాగా భారత్ x ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్ టెస్టు కూడా ఈ జాబితాలోకే చేరింది. రెండు రోజుల్లోనే ప్యాకప్ చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఇప్పటివరకూ ఎన్ని టెస్టులు ఇలా రెండు రోజుల్లోనే ముగిశాయో.. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి