close

తాజా వార్తలు

Published : 28/02/2021 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. పీఎస్‌ఎల్‌వీ సీ51 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఫలించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-51 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు  ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు.  ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక-సి51 (పీఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకె ళ్లింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ 17 నిమిషాల పాటు పయనించి బ్రెజిల్‌కు చెందిన అమోజోనియా శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్‌ టీకా

రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు.  కొవిడ్‌ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్‌ లేదా ఆధార్‌ ద్వారా cowin.gov.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కొవిడ్‌ టీకా అందిస్తున్నట్టు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్‌ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రంలో కొవిడ్‌  టీకా తీసుకోవచ్చని వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘వైకాపా పాలనను బేరీజు వేసుకొని ఓటేయండి’

వైకాపా పాలనలో ఆ పార్టీ నేతల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజల ఆస్తులు పెరగలేదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో 20 నెలలుగా అభివృద్ధి లేదన్నది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేటాయింపులకు తగ్గ ఖర్చులు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయింపులకు ఖర్చులకు పొంతన లేదని ధ్వజమెత్తారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గెలిచే అభ్యర్థుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్‌

4. చైనా నుంచి యాంగూన్‌కు రహస్యంగా విమానాలు!

ఒకవైపు తూర్పు లద్దాఖ్‌లో 9 నెలల పాటు సాగిన సైనిక ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణ ఊరట కలిగిస్తున్నప్పటికీ.. పొరుగునున్న మయన్మార్‌లో గుట్టుచప్పుడు కాకుండా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ సైన్యం.. అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి డ్రాగన్‌ కదలికలు పెరుగుతున్నాయి. ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ (ఏఈపీ) విధానానికి భారత్‌ చాలా ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాల కోసం మయన్మార్‌ను కీలక వారధిగా ఉపయోగించుకుంటోంది. అలాంటి ప్రాంతంలో డ్రాగన్‌ పాగా వేయడం భారత్‌కు ఆందోళనకర పరిణామం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’

ఎన్ని పాటలు వచ్చిన జానపద గీతాలకు ఉండే క్రేజే వేరు. అలాంటి జానపదానికి సాయిపల్లవి వంటి ఎనర్జిటిక్‌ హీరోయిన్‌‌ స్టెప్స్‌ తోడైతే  కనువిందే. అలాంటి పాటే  ‘సారంగదరియా..’అంటూ వచ్చేసింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  కాగా, ‘సారంగదరియా’అంటూ సాగుతున్న పాట లిరికల్‌ వీడియోను తాజాగా మరో నటి సమంత విడుదల చేశారు. సుద్దాల ఆశోక్‌తేజ అందించి సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌ తోడవడంతో మరోసారి వినాలనిపించేంత అద్బుతంగా పాట ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ కరోనా టీకా ఒకే డోసుతో పనిచేస్తుంది!

కరోనా వైరస్‌ నివారణ దిశగా.. అమెరికాలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ సంస్థ రూపొందించిన కొవిడ్‌ టీకాకు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, ఔషధ నిర్వహణ (ఎఫ్‌డీఏ) విభాగం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో ఇప్పటికే కరోనా కారణంగా 5.10లక్షల మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో టీకా పంపిణీ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దేశంలో పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు!

7. లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ మండలం అన్నారం వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సైనికుల కోసం సోలార్‌ టెంట్‌.. ఎలా పనిచేస్తుంది?

సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. గడ్డకట్టే చలిలోనూ విధులు నిర్వర్థిస్తుంటారు. భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం గల్వాన్‌ లోయ సహా అనేక ప్రాంతాల్లో శీతాకాలంలో మైనస్‌ 40 డిగ్రీల వరకు ఉష్రోగ్రతలు పడిపోతాయి. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ సోలార్‌ టెంట్లను తయారుచేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎన్నికల్లో పోటీ చేస్తే..టీకొట్టు తొలగించారు 

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు పట్టణాల్లో కొన్నిచోట్ల రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నాయి. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలకు, అల్లర్లకు దారి తీస్తున్నాయి. తాజాగా.. తిరుపతిలోని పీజీఆర్‌ ధియేటర్‌ పక్కన ఉన్న టీ దుకాణంపై నగర పాలక సంస్థ సిబ్బంది దాడులు నిర్వహించారు. దుకాణం అక్రమ నిర్మాణమన్న అధికారులు.. దాన్ని కూల్చివేస్తామని దుకాణంలోని సామగ్రిని రోడ్డుపై పడేశారు. జేసీబీతో దుకాణం కూల్చివేసేందుకు యత్నించారు. ధియేటర్‌ నిర్వాహకుల ఫిర్యాదు మేరకే ఖాళీ చేయిస్తున్నామని అధికారులు చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పిచ్‌ను నిందించడం సరికాదు

అహ్మదాబాద్‌లో జరిగిన డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఘోర పరాభవానికి స్పిన్‌కు అనుకూలించే వికెటే కారణమని అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ స్పందించాడు. పిచ్‌ను నిందించడం సరికాదని, అలా చేయడం తప్పని జొనాథన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరింత మంచిగా బ్యాటింగ్‌ చేసి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

యువీ ట్వీట్‌లో తప్పేమీ కనపడలేదు Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని