close

తాజా వార్తలు

Published : 03/03/2021 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. నామినేషన్ల ఉప సంహరణపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ ప్రక్రియ ముగియనుండగా ... ఉప సంహరణలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  ఉపసంహరణ నోటీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ యాంత్రికంగా అనుమతించవద్దని స్పష్టం చేస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మూడో పక్షం నుంచి నామినేషన్ల ఉపసంహరణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎస్‌ఈసీ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు

2. అగ్ర స్థానం నుంచి ‘మా’యం..!

 చైనా ప్రభుత్వానికి సలహాలివ్వబోయి చిక్కుల్లో ఇరుక్కున్న అలీబాబా, యాంట్‌ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్‌ మా.. తాజాగా ఆ దేశ కుబేర స్థానాన్ని కోల్పోయారు. హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ ప్రకారం.. చైనాలోని ధనవంతుల జాబితాలో ఆయన నాలుగో స్థానానికి పడిపోయారు. మరోవైపు ఆయన వ్యాపార ప్రత్యర్థులు మాత్రం భారీగా సంపదను పోగేశారు. ఆయన కంపెనీలపై చైనా ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడమే జాక్‌ మా స్థానం దిగజారడానికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ గ్రామంలో తొలిసారి వెలిగిన విద్యుత్‌ దీపాలు!

ఒక యుద్ధం వారికి నిలువ నీడ లేకుండా చేసింది.. దీంతో కట్టుబట్టలతో టిబెట్‌ నుంచి వచ్చి భారత్‌లో శరణార్థులుగా మారారు. ఓ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆరు దశాబ్దాలు కావొస్తున్నా వారి గ్రామానికి విద్యుత్‌ సరఫరా లేదు. రాత్రి అయిందంటే కొవ్వొత్తి వెలుతురులో కాలం వెళ్లదీయాల్సిందే. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న గ్రామానికి నలుగురు ఇంజినీర్లు వెలుగులు తీసుకొచ్చారు. ఆ విద్యుత్‌ కాంతులతో గ్రామ ప్రజల ముఖాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నీరా టాండన్ నియామకంపై  బైడెన్‌ వెనక్కి

అగ్రరాజ్యంలో బడ్జెట్‌ చీఫ్‌గా భారత అమెరికన్‌ నీరా టాండన్‌ నియామకంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వెనక్కి తగ్గారు. నీరా నియామకంపై సెనెట్‌తో పాటు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్‌కు ఇది తొలి కేబినెట్‌ వైఫల్యంగా మారింది.  భారత మూలాలున్న నీరా టాండన్‌ను వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా బైడెన్‌ నిర్ణయించారు. అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్‌ నేతలతో సహా పలువురు చట్టసభ్యులను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఇవి కాస్తా వివాదాస్పదమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెండోరోజు వందలోపు మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూవారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం 7,85,220 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..14,989 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కి చేరింది. కాగా, మరణాల సంఖ్య రెండో రోజు వందలోపే నమోదైంది. నిన్న 98 మంది మృత్యు ఒడికి చేరుకోగా..ఇప్పటివరకు 1,57,346 మంది ఈ మహమ్మారికి ప్రాణాలు వదిలారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భాజపా ఎంపీ కుమారుడి కాల్పుల నాటకం..!

భాజపా నేత, లోక్‌సభ సభ్యుడు కౌశల్‌ కిశోర్‌ కుమారుడు ఆయుష్‌పై కాల్పులు జరిగాయి. లఖ్‌నవూలోని మదియావా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయుష్‌ తన బంధువుతో కలిసి బయటకు వెళ్లగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఎంపీ కుమారుడి ఛాతీ, భుజానికి గాయమైంది. అయితే ఈ కాల్పుల ఘటన నాటకమేనని తెలుస్తోంది. తన ప్రత్యర్థులను ఇరికించేందుకు ఆయుష్‌ తనపై తానే దాడి చేయించుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్టార్‌ ఫ్యామిలీలో పుట్టి.. కేఫ్‌లో పనిచేసి..!

 నటనపై ఆసక్తితో ఉన్నత విద్యను మధ్యలోనే వదిలేసి వెండితెరవైపు అడుగులేసి.. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు నటి శ్రద్ధాకపూర్‌. కెరీర్‌ ఆరంభమైన నాటి నుంచి ‘ఆషికీ-2’, ‘భాఘి’, ‘ఏక్‌ విలన్‌’ వంటి చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బుధవారం తన 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. స్టార్‌ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా జీవించాలనే ఉద్దేశంతో చదువుకునే రోజుల్లోనే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసిన ఈ చిన్నది.. తన సినీ కెరీర్‌ గురించి పలు సందర్భాల్లో ఇలా చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికాలో రోడ్డు ప్రమాదం:15 మంది మృతి

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును ఎస్‌యూవీ ఢీకొట్టిన ఘటనలో 15 మంది మృతి చెందారు. జాతీయ రహదారి గస్తీ బృందం అధికారి వాట్సన్‌ ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ‘దక్షిణ కాలిఫోర్నియాలోని హాల్ట్‌ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఎస్‌యూవీ ఢీకొన్న ఘటనలో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందారు.  ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహిళా నేతలు.. ఇచ్చిన మాట తప్పరు!

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ నేతలు పాల్గొంటూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తారు. మీకు ఇది చేస్తాం.. అది తెస్తాం అని ఎన్నో మాటలు చెబుతారు. వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా లేదా అనేది పదవులు చేపట్టిన నేతలను బట్టి ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు ఆలస్యంగానైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తే.. మరికొన్ని ప్రభుత్వాలు హామీలను గాలికొదిలేస్తాయి. కానీ, ప్రభుత్వంలో కీలక పదవుల్లో మహిళలు ఉంటే మాత్రం కచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓ సర్వేలో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పింక్‌బాల్‌ టెస్టులో తప్పు చేశాం: జోరూట్

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల కారణాన్ని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ వివరించాడు. పింక్‌బాల్‌ టెస్టులో తాము పరిస్థితుల్ని తప్పుగా అంచనా వేశామని అంగీకరించాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన రూట్‌ నాలుగో టెస్టులో యువ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ను తుది జట్టులోకి తీసుకుంటామన్నాడు. ఈ సందర్భంగా పింక్‌బాల్‌ టెస్టుపై ఇలా స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని