Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 17/10/2021 21:06 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1) ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: కేసీఆర్‌

నవంబరు 15న వరంగల్‌లో పదిలక్షల మందితో విజయగర్జన సభ నిర్వహించనున్నట్టు తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆదివారం  సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై చర్చించారు. ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

2) కోణార్క్‌ తరహాలో అయోధ్య గుడి నిర్మాణం..

అయోధ్య రాముడి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత కనువిందు చేసే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కొత్త ఏర్పాట్లు చేస్తోంది. ఒడిశాలోని కోణార్క్‌, శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్య క్షేత్రాల తరహాలో గర్భగుడిలోకి సూర్య కిరణాలను ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్‌ సభ్యుడు కామేశ్వర్‌ చౌపాల్ తెలిపారు.

3) విశాఖ ఏజెన్సీలో కాల్పుల కలకలం

చింతపల్లి గ్రామీణం: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగిలో కాల్పుల కలకలం రేగింది. గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు నల్గొండకు చెందిన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాని వెళ్లారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొయ్యూరు మండలం తులబాయిగడ్డ వద్ద ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా... 20 మంది గంజాయి స్మగ్లర్లు నల్గొండ పోలీసులకు ఎదురుపడ్డారు. పోలీసుల కదలికలను గమనించిన స్మగ్లర్లు రాళ్లదాడి చేయడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో గంజాయి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.

4) అందుకే రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకొచ్చాను: ఈటల

గతంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధిని గురించి ప్రశంసించిన వారే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని భాజపా నేత ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లిలో ప్రచారం నిర్వహించిన ఈటల.. తెరాస ప్రభుత్వ పాలనపై ఘాటు విమర్శలు చేశారు.

5)  చమురుకు డబ్బుల్లేవు..!

 శ్రీలంకలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం తీవ్రమైంది. ప్రస్తుతం ఆ దేశంలో చమురు కొనుగోళ్లకు చెల్లించేందుకు కూడా నిధులు లేవు. దీంతో 500 మిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇవ్వాలని భారత్‌ను కోరింది. ప్రస్తుతం ఉన్న చమురు నిల్వలు వచ్చే జనవరి వరకు మాత్రమే సరిపోతాయని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిలా హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ ప్రతిపాదన వచ్చింది.

చైనా కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టిన పాకిస్థాన్‌!

6) కేరళలో వర్ష బీభత్సం.. 21కి చేరిన మృతుల సంఖ్య

కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందినవారి సంఖ్య 21కి చేరింది. మరణించినవారిలో 13 మంది కొట్టాయంకు చెందినవారు కాగా 8 మంది ఇడుక్కి జిల్లాకు చెందినవారు. మరికొంతమంది గల్లంతయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

7) ఇంటి నుంచే ఆధార్‌ వెరిఫికేషన్.. ఇలా చేయొచ్చు!

భారతీయుల జీవితంలో ఆధార్‌ కార్డ్ భాగమైపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధ్రువీకరణ పత్రం పొందడం నుంచి ప్రభుత్వ పథకాలు పొందడం వరకూ అన్ని చోట్లా ఆధార్‌ తప్పనిసరి అవుతోంది. అంతేకాదు ఆదాయ పన్ను చెల్లింపులు.. కొవిడ్‌ టీకా ఇలా దాదాపు అన్ని పనులకు ఆధార్‌ ఉండి తీరాల్సిందే. మరిఅలాంటి ఆధార్‌ కార్డ్‌లో కూడా నకిలీ కార్డులు పుట్టుకొస్తున్నాయి.. మోసాలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌ కలిగిన ప్రతి వ్యక్తి తమ ఆధార్‌ను వెరిఫై చేసుకోవాలని సూచిస్తుంది.

8) అతడి కోసమైనా టీమిండియా ప్రపంచ కప్‌ కొట్టాలి: రైనా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌) ముగిసింది. అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్‌ జోరు మొదలైంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో 24న పాకిస్థాన్‌తో తలపడనుంది. చాలా ఏళ్ల తర్వాత భారత్, పాక్‌ జట్లు పోటీ పడనుండటంతో క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కోసం వరల్డ్‌ కప్‌ను గెలవాలని ఆటగాళ్లకు సూచించాడు.

కోచ్‌ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం

9) అణు సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష

అణు సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణిని చైనా ఆగస్టులో పరీక్షించింది. ఈ పరీక్షతో సంబంధం ఉన్న వ్యక్తి దీనిని ప్రముఖ ఆంగ్ల వార్తపత్రిక ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వద్ద ధ్రువీకరించారు. ఈ క్షిపణి భూమి చుట్టూ లోఎర్త్‌ ఆర్బిట్‌లో ప్రయాణించింది. కాకపోతే లక్ష్యాన్ని తప్పి 32 కిలోమీటర్లు పక్కకు వెళ్లింది.

10) ముగ్గురు అమ్మాయిల తలరాతలు.. హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ చూశారా?

సునీల్‌, సుహాస్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. ఏమైందంటే?

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని