close

తాజా వార్తలు

Published : 28/02/2021 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఇస్రోపై ప్రముఖుల ప్రశంసల వెల్లువ

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-51 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* శ్రీలంక స్వాతంత్ర్య వేడుకల్లో భారత మెరుపులు

2. ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు అవకాశమివ్వండి: కేటీఆర్‌ 

వచ్చే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంను ఒక వేదికగా చేర్చాలని తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులను కోరారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌-19 నియంత్రణలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కన్నా హైదరాబాద్‌ ముందుందని చెప్పారు. అందుకు ఇక్కడ నమోదవుతున్న అత్యల్ప కేసుల సంఖ్యే నిదర్శనమన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉప్పల్‌లో నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఆ నిధుల్ని ఏం చేశారో ప్రజలు నిలదీయాలి: షా

పుదుచ్చేరిలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కరైకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పుదుచ్చేరిలో 75శాతం నిరుద్యోగ యువత ఉంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత 40శాతానికి తగ్గుతుంది. కొద్ది రోజుల కిందట ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంలో మత్స్య శాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలంతా భాజపాలో చేరుతున్నారు. అక్కడ పురోగతి లేదు కాబట్టే వారు భాజపాలో చేరుతున్నారు’ అని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. బిట్టు శ్రీను..ఆయుధాలెక్కడ.?

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బిట్టు శ్రీనుతో పాటు మరొకరని పోలీసులు ఇవాళ పార్వతీ బ్యారేజ్‌ వద్దకు తీసుకెళ్లారు. న్యాయవాదుల హత్యకు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు యత్నిస్తున్నారు. ఘటన అనంతరం ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘సలార్‌’ విడుదల తేదీ ఖరారు

కేవలం ఫస్ట్‌లుక్‌తోనే దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోని సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘సలార్‌’. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ‘సలార్‌’ను పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తర్వాతి ప్రకటన ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా.. అందరి ఎదురుచూపులకు తెరదించింది చిత్రబృందం. ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పార్లమెంటులో పంచ్‌లు లేనట్టే!

పార్లమెంటు తదుపరి సమావేశాలపై శాసనసభ ఎన్నికలు ప్రభావం చూపనున్నాయి. కేంద్ర బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చించేందుకు మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకూ పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర పాలిత పుదుచ్చేరితో పాటు... పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఎంపీలు ఈ దఫా సమావేశాలకు వారు హాజరుకావడం అనుమానమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. వంజంగి అందాలు.. పర్యాటకుల ఆనందాలు

విశాఖ మన్యం వంజంగిలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తయిన కొండల మాటున సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి నయనానందకర దృశ్యాలను ఫొటోల్లో బంధిస్తున్నారు. అక్కడికి తరలివచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. పట్టించిన సంకెళ్లు..!

కరేబియన్‌ దేశమైన హైతీలో అతడో గ్యాంగ్‌ లీడర్‌..  భూలోక నరకం వంటి జైలు నుంచి బయటపడాలని విశ్వప్రయత్నం చేశాడు.. బయటకు వచ్చి మళ్లీ తన దందాలు మొదలు పెట్టాలనుకున్నాడు.  తన అనుచరులతో కలిసి జైలును బద్దలు కొట్టాడు.. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిపై అనుచరులతో కలిసి దాడి చేసి పరారయ్యాడు. తనని ఎవరూ గుర్తించరన్న ధైర్యంతో బైక్‌పై ప్రయాణమయ్యాడు.. కానీ, అతని కాళ్లకు బేడీలు ఉండటం భద్రతా దళాల కంటపడింది. వారు అతన్ని పట్టుకొనే క్రమంలో కాల్పులు జరిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. హైదరాబాదీ రైతుపై మోదీ ప్రశంసలు

హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డికి మరో అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ పద్ధతుల్లో వెంకటరెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. శాస్త్ర విజ్ఞానమంటే కేవలం భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన అంశం కాదన్న ప్రధాని.. ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి దానిని విస్తరించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

* 2 ఏళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు

10. రోహిత్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ టెస్టు ర్యాంక్‌..

టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో అతడు ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ ర్యాంక్‌ సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో రోహిత్‌ ఒక భారీ శతకంతో పాటు ఒక అర్ధ శతకం సాధించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* కొండంత లక్ష్యం పిండి చేసి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని