close

తాజా వార్తలు

Updated : 02/03/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. అరాచక పాలనకు చరమగీతం పాడాలి: జయదేవ్‌

వైకాపా అరాచక పాలనకు మున్సిపల్‌ ఎన్నికల నుంచి చరమగీతం పాడాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంతో పాటు తెనాలి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల తరఫున మంగళవారం జయదేవ్‌ ప్రచారం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలను ప్రజలంతా చూశారని, వాటిని అడ్డుకోవాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పుంగనూరులో ముందుకురాని తెదేపా నేతలు

2. రాజన్న సంక్షేమ పాలన రావాలి: షర్మిల

తెలంగాణలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టుల్లో 90 శాతం పూర్తయినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్‌ తలపెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదని.. పాలమూరులో వలసలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేటీఆర్‌ సీఎం కావడం అసాధ్యం: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

తెరాస సర్కార్‌ ఏడేళ్ల పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అని భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు.ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇవ్వడం ఖాయమని చురకలంటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విచారణ తర్వాతే వివాదాల పరిష్కారం: హైకోర్టు

రెవెన్యూ ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి విచారణ లేకుండానే రెవెన్యూ ట్రైబ్యునళ్లు వివాదాలను తేలుస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. వివాదాలకు సంబంధించి ఇరువైపుల వాదనలకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. ఇప్పటివరకు విచారణ లేకుండా రికార్డుల ఆధారంగా పరిష్కరించిన కేసులు, పెండింగ్‌ కేసుల వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏబీ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

5. 19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు..

దేశంలో కరోనా కాస్త తెరిపినిచ్చింది. రోజువారీ కరోనా కేసులు, మరణాల్లో గణనీయమైన తగ్గుదల నమోదు చేస్తోంది. క్రితం రోజులో పోలిస్తే మంగళవారం 20 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. వీటిల్లో పశ్చిమబెంగాల్‌, గుజరాత్, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, లక్షద్వీప్‌, లద్దాఖ్‌, సిక్కిం, త్రిపుర, మణిపుర్‌, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, డయ్యుడామన్‌ దాద్రానగర్‌ హవేలీ, అరుణాచల్‌ ప్రదేశ్‌లు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP: కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలివే

* TS:కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలివే

6. బెంగాల్‌లో కాంగ్రెస్‌ VS కాంగ్రెస్‌

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో  పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, ప్రచారాలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ క్రమంలోనే ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌తో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ నిర్ణయం పార్టీలో మరోసారి విభేదాలకు తెరలేపింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జి-23 నేతల్లో ఒకరైన ఆనంద్‌శర్మ బెంగాల్‌లో పార్టీ పొత్తును బహిరంగంగా తప్పుబట్టారు. దీంతో పార్టీ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ.. ఆనంద్‌ తీరుపై వరుస ట్వీట్లలో మండిపడ్డారు. అసలేం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’ 

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా కథనే నమ్ముకుని వచ్చే చిన్న చిత్రాలకు క్రైమ్‌థ్రిల్లర్లే మంచి ఫార్ములా. మార్చి 5న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్న ‘A’ చిత్రం కూడా ఆదే కోవకు చెందిందే. నితిన్‌ ప్రసన్న, ప్రీతి అశ్రానీ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల ‘హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021‌’ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. గత సంవత్సర కాలంలో ఆయన సంపద 24 శాతం ఎగబాకి 83 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.6.09 లక్షల కోట్లకు చేరింది. ఇక ఈ జాబితాలో రూ.2.34 లక్షల కోట్ల సంపదతో గౌతమ్‌ అదానీ అండ్‌ ఫ్యామిలీ 48వ ర్యాంకు, రూ.1.94 లక్షల కోట్లతో శివ్‌ నాడార్‌ అండ్‌ ఫ్యామిలీ 58వ ర్యాంకు, రూ.1.40 లక్షల కోట్లతో లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌ 104వ ర్యాంకు, రూ. 1.35 లక్షల కోట్ల సంపదతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి సైరస్‌ పూనావాలా 113వ ర్యాంకులో కొనసాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సుప్రీంకోర్టుకు కంగనా రనౌత్‌

సోషల్‌మీడియా వేదికగా పలు విమర్శలు చేసినందుకుగానూ మహారాష్ట్రలో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముంబయిలో నమోదైన కేసులను హిమాచల్‌ప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ముంబయిలో కేసుల విచారణకు హాజరుకావడం తన ప్రాణానికి ముప్పు అని, శివసేన నేతల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని కంగన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అశ్విన్‌ బెస్ట్‌.. అందుకే వాళ్లతో ఆడాలనుకుంటాడు

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అత్యుత్తమ ఆటగాడని, అందుకే మేటి జట్లతో ఆడాలనుకుంటాడని హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌లో ఆకాశ్‌ చోప్రాతో మాట్లాడిన సందర్భంగా వీవీఎస్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. యాష్‌ చాలా తెలివైన ఆటగాడని మెచ్చుకున్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆటగాళ్లు కేవలం తమ నైపుణ్యాలనే కాకుండా.. ఆట కోసం సన్నద్ధమవ్వడం, ప్రణాళికలు రూపొందించడం, వాటిని పక్కాగా అమలు చేయడం కూడా ముఖ్యమని వీవీఎస్‌ చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని