
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారు: చంద్రబాబు
వైకాపా పాలనతో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడు చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రీశుడి ఆలయం పనులను సీఎం పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. శశి‘కలకలం’ వెనుక!
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం అంత సులభం కాదు. ఎన్నికల సమయంలో అయితే రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు అంతుచిక్కవు. ఎవరు ఎవరికి మిత్రులవుతారో, ఎందుకు శత్రువులవుతారో కూడా ఊహించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ అనూహ్యంగా ప్రకటించిన నిర్ణయం కలకలం రేపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. వృద్ధుల చికిత్సకు ప్రాధాన్యమివ్వండి
వృద్ధులు కరోనా కారణంగా ఇబ్బంది పడకుండా వారికి ఆస్పత్రుల్లో ప్రాధాన్యమిచ్చి చికిత్సను అందించాలని సుప్రీంకోర్టు గురువారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. వృద్ధులు ఏ సమస్యతో వచ్చినా వారికి వెంటనే చికిత్స ప్రారంభించాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. ఆగస్టు 4, 2020న ఇచ్చిన తీర్పులో మార్పులు చేస్తూ జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్.ఎస్.రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ తీర్పును వెలువరించింది. గతంలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. చైనా, పాక్ ముప్పు: సైన్యం సిద్ధంగా ఉండాల్సిందే!
ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత సైన్యం ఎదుర్కొంటుందని త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతో పాటు చైనా, పాకిస్థాన్‌ల నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రామ్‌చరణ్-పూజా కలిసి మళ్లీ స్టెప్ వేస్తే!
‘జిగేల్ రాణి’గా ‘రంగస్థలం’లో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది పూజాహెగ్డే. చరణ్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్లు విపరీతంగా అలరించాయి. మరోసారి వీరిద్దరూ కలిసి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ కథానాయికగా నటిస్తుండగా, రామ్‌చరణ్ కామ్రేడ్ సిద్ధ పాత్రలో కనిపించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. స్టాక్:వరుస లాభాలకు బ్రేక్
వరుస లాభాలతో జోరుమీదున్న దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు బ్రేక్‌పడింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడం కొంతమేర కలిసొచ్చింది. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కీలకమైన 15,100 మైలురాయిని మరోసారి కోల్పోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.83గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆమె ‘నిజమైన బెంగాల్ టైగర్’: శివసేన
పశ్చిమబెంగాల్లో రాబోయే ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు శివసేన పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా ఆమెను ‘రియల్ బెంగాల్ టైగర్’గా శివసేన అభివర్ణించింది. ఈ మేరకు శివసేన నేత సంజయ్‌రౌత్ గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జీవించేందుకు ఉత్తమ నగరం.. బెంగళూరు
దేశంలో నివాసయోగ్య నగరాల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. మొత్తం 111 నగరాలతో ఈ జాబితా రూపొందించగా.. బెంగళూరు తొలి ర్యాంక్ దక్కించుకుంది. ఆ తర్వాత పుణె, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీముంబయి, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబయి టాప్ 10లో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అక్షర్, యాష్ మాయ:ఇంగ్లాండ్ 205 ఆలౌట్
భారత్×ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ భారత బౌలర్లు విజృంభించారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో బెన్‌స్టోక్స్(55) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. అంతకుముందు ఓపెనర్లు జాక్ క్రాలే(9), డొమినిక్ సిబ్లే(2) సహా.. బెయిర్‌స్టో (28), రూట్ (5), పోప్ (29), లారెన్స్ (46), ఫోక్స్ (1), బేస్ (3), లీచ్ (7), అండర్సన్ (10 నాటౌట్) విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 3, సిరాజ్ 2, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఓవర్లోనే గిల్ (0) వికెట్ కోల్పోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి