Top Ten News @ 5 PM

తాజా వార్తలు

Published : 22/06/2021 16:55 IST

Top Ten News @ 5 PM

1. బంగారు వాసాలమర్రి కావాలి: కేసీఆర్‌

ఏడాది గడిచే సరికి గ్రామం బంగారు వాసాలమర్రి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో సీఎం ప్రసంగించారు.

2. Ts News: ఫీజుల వసూళ్లపై హైకోర్టులో విచారణ

తెలంగాణలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్స్‌ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసింది. అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ న్యాయస్థానానికి తెలిపింది. జీవో 46ను ఉల్లంఘించిన పాఠశాలలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నామని వెల్లడించింది. 

3. Ap News: అత్యాచార ఘటన కలచివేసింది : జగన్‌

అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరిగే పరిస్థితులు కల్పించేందుకు మరింత కష్టపడి పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్‌ వద్ద జరిగిన అత్యాచారం ఘటనపై సీఎం స్పందించారు. ఈ ఘటన తనను కలచి వేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Ap News: ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష

4. Raghurama: మండలి రద్దు ప్రక్రియ చేపట్టాలి

కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రహ్లాద్‌ జోషికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియను వెంటనే చేపట్టాలని లేఖలో కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల దృష్ట్యా లేఖ రాస్తున్నట్లు చెప్పారు. 2020 జనవరి 27న అసెంబ్లీలో మండలి రద్దుకు తీర్మానం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

5. Rahul: మోదీ కన్నీళ్లు.. వారిని కాపాడలేకపోయాయి

కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కొవిడ్‌ నిర్వహణపై నేడు ఆయన పార్టీ తరఫున శ్వేతపత్రం విడుదల చేశారు. తాము ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, మూడో దశపై సన్నద్ధతలో సాయం చేయాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కన్నీళ్లు.. ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయాయని దుయ్యబట్టారు. ఆక్సిజన్‌ కొరతను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు. 

6. Ap News: కొత్తగా 4,169 కొవిడ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 74,453 పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,57,352 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 53 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,416కి చేరింది. 24 గంటల వ్యవధిలో 8,376 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,91,056కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,880 యాక్టివ్‌ కేసులున్నాయి. 

Covaxin: మూడోదశ ట్రయల్స్‌లో 77.8 శాతం సామర్థ్యం!

7. Jet Airways: త్వరలో ఎగరనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ను బిడ్డింగ్‌లో దక్కించుకున్న కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కొన్ని షరతులతో ఆమోదం తెలిపింది. ఈ విమానయాన సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా విమానాశ్రయాల్లో స్లాట్ల కేటాయింపునకు పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ)కు ఎన్‌సీఎల్‌టీ 90 రోజుల గడువు ఇచ్చింది.

8. నవనీత్‌ కౌర్‌కు సుప్రీం కోర్టులో ఊరట! 

అమ్రావతి లోక్‌సభ ఎంపీ, సినీ నటి నవనీత్‌ కౌర్‌ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ నెల 8న బాంబే హైకోర్టు నవనీత్‌ కౌర్‌ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయడంతో పాటు నకిలీ పత్రాలు సమర్పించినందుకు గాను ఆమెకు రూ.2లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. 

9. Deve Gowda: దేవెగౌడకు భారీ జరిమానా

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ.2కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011 జూన్‌ 28న ‘గౌడర గర్జన’ పేరుతో ఓ కన్నడ ఛానల్‌లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌(ఎన్‌ఐసీఈ) ప్రాజెక్టుపై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

10. Stock market: ఆరంభ లాభాలు ఆవిరి

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చివరకు డీలా పడ్డాయి. ఓ దశలో 483 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 53,057 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో భారీ లాభాల  వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు డీలాపడ్డాయి.

WTC Final: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని