
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ జరిగింది. రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం
తెలంగాణలో బుధవారం నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తరగతులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే తరగతులను రేపటి నుంచి మార్చి ఒకటో తేదీలోగా ప్రారంభించుకోవచ్చన్నారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పేదలకు ఉపయోగపడాలనేదే కేసీఆర్ అభిమతం: కేటీఆర్
ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానమైనా సమాజానికి, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడాలనేదే సీఎం కేసీఆర్ అభిమతం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రెండో రోజు బయో ఆసియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో వర్చువల్‌గా జరిగిన చర్చావేదికలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయో ఆసియా సదస్సు నిర్వహణను సత్య నాదెళ్ల ప్రశంసించారు. చర్చా వేదికలో భాగంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. తీవ్రస్థాయిలో ఎన్440కే వైరస్ ఉత్పరివర్తనం
దేశంలో ఏడు వేలకు పైగా కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందులో పలు మ్యుటేషన్లు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఐదు వేలకు పైగా కొత్త కరోనా రకాలపై సమగ్ర పరిశీలన చేసి కరోనా ఎలా మార్పులు చెందిందో సీసీఎంబీ పరిశీలించింది. అనంతరం దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఉత్తేజాన్ని నింపేలా.. ఆశలు చిగురించేలా..
పోలీసు స్టేషన్ అంటేనే గంభీర వాతావరణం ఉంటుంది. ఠాణాను చూస్తే చాలా మంది బయపడుతుంటారు. దానిని ఓ సమస్యాత్మక ప్రదేశంగా భావిస్తుంటారు. తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఉన్న ఠాణాలు మాత్రం అందుకు భిన్నంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. రంగురంగుల బొమ్మలతో అలరిస్తుంటాయి. దీని వెనక ఓ విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి గొప్ప ఆలోచన ఉంది. గతంలో రాణిపేట జిల్లాకు ఎస్పీగా పనిచేసిన మిల్వగనన్ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. స్టార్ల సంతానం.. రూటే సెపరేటు!
విలక్షణ నటుడు మోహన్‌లాల్ కూతురు విస్మయ ఓ పుస్తకం రాసేసింది... అందులోని కవితలు ‘ఓహో సూపర్’ అంటున్నారంతా... అదేంటి? డాక్టర్ల పిల్లలు డాక్టర్లవడం.. యాక్టర్ల సంతానం యాక్టర్లవడమే కదా ట్రెండ్ అంటారా? ముఖ్యంగా సినిమాల్లో నూటికి 90 శాతం ఇంతేగా అన్నది అందరి మాట... కానీ, ఓసారి కెమెరా లెన్స్ జూమ్ చేసి చూస్తే తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవకుండా.. తళుకుబెళుకుల రంగం ఎంచుకోకుండా.. తమదైన దారిలో సాగిపోతున్న సెలబ్రెటీల పిల్లలు కొంతమంది కనిపిస్తారు... తమదైన శైలిలో గుర్తింపు పొందారు. కమాన్ రండి చూసొద్దాం ఆ అరుదైన విజేతల్ని. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మార్చి చివరినాటికి యాక్టివ్ కేసుల్లో తగ్గుదల!
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుతోందని భావిస్తోన్న సమయంలోనే మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య దాదాపు లక్షా 50వేలకు చేరింది. అయితే, మార్చి చివరినాటికి ఈ యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని కరోనా వైరస్ తీవ్రతపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ సూపర్‌మోడల్ కమిటీ అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* 21 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్
8. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి ఉదయమే తేరుకున్న మార్కెట్లకు అక్కడక్కడా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయినప్పటికీ.. కీలక రంగాల మద్దతు లభించడంతో సానుకూలంగా స్పందించాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం సూచీలకు అండగా నిలిచింది. ఉదయం సెన్సెక్స్ 50,104 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 14,782 వద్ద ఆరంభమైంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో సెన్సెక్స్ 49,666 వద్ద, నిప్టీ 14,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* హెరాన్బా ఐపీఓ..మీరు పెట్టుబడి పెట్టొచ్చా?
9. ఎంపీ దేల్కర్ది ఆత్మహత్యే: 15పేజీల నోట్ లభ్యం!
కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ స్వతంత్ర ఎంపీ మోహన్ దేల్కర్ది (58) ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన నిన్న దక్షిణ ముంబయిలోని ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడిఉండటం తీవ్ర కలకలం రేపింది. దీంతో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. పోస్టు మార్టం నివేదికలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారణ అయిందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. భళా శ్రీశాంత్..
టీమ్ఇండియా మాజీ పేసర్, కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ అదరగొట్టాడు. సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారె ట్రోఫీ గ్రూప్-సీ ఎలైట్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దాంతో ఎనిమిదేళ్ల తర్వాత లిస్ట్-ఏ క్రికెట్లో అతడీ ఘనత సాధించాడు. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్ గతేడాది సెప్టెంబర్‌తో ఆ గడువును పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే జనవరి నుంచి కేరళ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్లో కొనసాగుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* షకిబ్ ఐపీఎల్‌కు అనుమతి అడిగేసరికి..