close

తాజా వార్తలు

Published : 21/01/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

1. సీరమ్‌ సంస్థలో భారీ అగ్నిప్రమాదం

ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన నూతన ప్లాంట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని మంజ్రీ ప్రాంతంలో గల ఈ ప్లాంట్‌లోని టర్మినల్‌ 1 గేట్‌ వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం 10 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంస్థ కొవిషీల్డ్‌ టీకాలను తయారుచేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ప్లాంట్‌ నిర్మాణ దశలో ఉందని, ఇక్కడ టీకాల ఉత్పత్తి జరగట్లేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రభుత్వ అండతోనే విగ్రహాల ధ్వంసం: కన్నా

రాష్ట్ర ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోందని భాజపా సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ చేపట్టిన ఆందోళనకు వెళ్లకుండా పోలీసులు కన్నాను గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు రావొద్దని నోటీసులు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో?లేదో?: భట్టి

తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సంక్షేమం, సామాజిక తెలంగాణ కోసం పాటుపడుతున్నామని చెప్పే రాష్ట్ర మంత్రులు.. ప్రజా సమస్యలను పక్కనపెట్టారని విమర్శించారు. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్‌ సీఎం అవుతారంటూ వ్యాఖ్యలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో? లేదో? తెలియడంలేదని అసహనం వ్యక్తం చేశారు.  సమస్యలు పరిష్కరిస్తారనే ప్రజలు నాయకులను ఎన్నుకున్నారని.. ప్రజా సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెరాస ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

4. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతాం: విశ్వరూప్‌

తమ ప్రభుత్వం భయపడి స్థానిక ఎన్నికల వాయిదా కోరడంలేదని ఏపీ మంత్రి విశ్వరూప్‌ అన్నారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై మంత్రి స్పందించారు. హైకోర్టు బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. రాజకీయాలు కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్య మన్నారు. ‘‘ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమే..కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అంత అనుకూలమైన వాతావరణం లేదు. కొవిడ్‌ కారణంగా ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అఖిల బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

5. అందరికీ టీకా లభిస్తుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ వ్యాప్తంగా సుమారు యాభై దేశాల్లో కరోనా టీకా పంపిణీ ఆరంభమైంది. కాగా, వాటిలో నలభై సంపన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అల్పాదాయ దేశాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీకా కావాలనుకున్న ప్రతి ఒక్కరికీ దానిని అందచేస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది. అన్ని దేశాల ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందచేసేందుకు తాము కృషి చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయ డైరెక్టర్‌ జనరల్ మేరీయాంజెలా సిమావో ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రికార్డుల నుంచి నష్టాల్లోకి..

కొనుగోళ్ల అండతో కొత్త గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ఆ రికార్డులను నిలబెట్టుకోలేకపోయాయి. చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాలను చవిచూశాయి. దీంతో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 50వేల దిగువకు పడిపోగా.. నిఫ్టీ 14,600 మార్క్‌ను కోల్పోయింది. అమెరికాలో కొలువుదీరిన బైడెన్‌ ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీని ఆవిష్కరించే అవకాశాలున్నాయన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్లలో జోష్‌ నింపాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు కూడా పెరగడంతో ఈ ఉదయం దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

*  సెన్సెక్స్.. 50వేల ప్రస్థానం

7. రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ!

కరోనా వైరస్‌ దాటికి అమెరికా వణికిపోతోంది. ప్రపంచంలోనే అధిక తీవ్రత ఉన్న అమెరికాలో, కరోనా మరణాల సంఖ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మరణించిన అమెరికన్ల సంఖ్యను దాటిపోయింది. అయినప్పటికీ కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. రానున్న రోజుల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉండనున్నట్లు అమెరికా నూతన అధ్యక్షడు జో బైడెన్‌ హెచ్చరించారు. పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిరోజు వైట్‌హౌస్‌లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహంపైనే జో బైడెన్‌ అధికారులతో చర్చించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ట్రంప్‌ లేఖ.. గొప్పగా ఉంది: బైడెన్‌ 

8. సోనూసూద్‌కు హైకోర్టులో చుక్కెదురు

నటుడు సోనూసూద్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురయ్యింది. బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. జుహూలోని ఆరంతస్తుల భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారంటూ గతేడాది అక్టోబర్‌లో బీఎంసీ అధికారులు సోనూసూద్‌కు నోటీసులు పంపించారు. దీంతో సదరు నోటీసులను సవాల్‌ చేస్తూ ఆయన ఇటీవల బాంబే హైకోర్టును సంప్రదించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి పృథ్వీరాజ్‌ చవాన్‌ పిటిషన్‌ కొట్టివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తరాల పాటు ఈ సిరీస్‌ను గుర్తుంచుకుంటారు..! 

ఈసారి టీమిండియా సుదీర్ఘ పర్యటన దిగ్విజయంగా సాగడానికి కృషిచేసిన బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటామని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. తాజాగా బీసీసీఐ అధికారులకు రాసిన ఓ లేఖలో ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని అలరించిన ఈ సిరీస్‌ గురించి భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయని చెప్పింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న కరోనా పరిస్థితుల్లో అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ధోనీతో పోల్చడం అద్భుతమే కానీ.. 

10. నిర్మాతగా మారిన ఆలీ!

హస్యనటుడు ఆలీ నిర్మాతగా మారారు. ‘అందరూ బాగుండాలి..అందులో నేనుండాలి’ అనే చిత్రాన్ని ఆయనే నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  అలాగే చిత్రపరిశ్రమలో ఆయనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో నటించనున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న చిత్ర షూటింగ్‌లో వారిద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఆలీ తొలి సారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వాట్సాప్‌లో ఈ సందేశాలు వచ్చాయా?Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని