close

తాజా వార్తలు

Updated : 10/01/2021 09:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. 16 నుంచి టీకా

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత, వ్యాక్సిన్‌ సన్నద్ధతలపై ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉన్నతస్థాయిలో నిర్వహించిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. రాబోతున్న పండుగల దృష్ట్యా వచ్చే శనివారం నుంచే వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించాలని దీనిలో ఖరారు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు చేపడుతున్న కార్యక్రమం.. ప్రపంచంలోనే అతి పెద్దదని ప్రధాని పేర్కొన్నారు. ఇదొక చరిత్రాత్మక ముందడుగుగా నిలిచిపోతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తొలిరోజు 139 కేంద్రాల్లో టీకా

2. కొత్తగా 26 జిల్లాలు

లోక్‌సభ నియోజకవర్గాలే ప్రాతిపదికగా 26 జిల్లాల ఏర్పాటుకు, మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అధికారుల కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పుచేర్పులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతమున్న వాటిలో మూడింటి రద్దుకు ప్రతిపాదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎవరా శీను ఏమిటా సీను?

హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువ చేసే భూవివాదంలో ముగ్గురు వ్యాపారులను కిడ్నాప్‌ చేసిన కేసులో గుంటూరుకు చెందిన మాదాల శ్రీను అలియాస్‌(30) గుంటూరు శ్రీను పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ పేరు గుంటూరులో చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ పోలీసులు చెబుతున్న ఆ గుంటూరు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? ఇప్పటికే ఆ భూవివాదం కేసులో అరెస్టు అయిన ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఆ యువకుడు ఎలా దగ్గరయ్యారనేవి ఆసక్తి కాబోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* భార్గవరామ్‌ ఎక్కడ?

4. 130 కి.మీ. వేగంతో రైళ్ల పరుగు

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో రైళ్లు ఇక మరింత వేగంగా పరుగులు పెట్టనున్నాయి. జోన్‌ పరిధిలో స్వర్ణ చతుర్భుజి-స్వర్ణవికర్ణ మార్గాల్లో 1,280 కి.మీ. మేర గంటకు 132 కి.మీ. గరిష్ఠ వేగంతో ఇటీవల ప్రయోగాత్మక పరీక్ష(ట్రయల్‌ రన్‌) జరిపింది. అది విజయవంతం కావడంతో ఈ మార్గాల్లో గంటకు 130 కి.మీ. గరిష్ఠ వేగంతో రైళ్లను నడిపేందుకు రీసెర్చ్‌ డిజైన్స్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌(ఆర్‌డీఎస్‌ఓస్‌)- లక్నో అనుమతించింది. ఈ విషయాన్ని ద.మ.రైల్వే శనివారం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. కర్షకుల కష్టాలపై గళమెత్తిన చిన్నారి

దేశరాజధాని దిల్లీ సరిహద్దుల్లో అంకుఠిత దీక్షతో కొనసాగిస్తున్న రైతుల ఉద్యమం ఆ చిన్నారిని కదిలించింది. తోటి పిల్లలు గ్రామంలో ఆట పాటల్లో నిమగ్నమవ్వగా ఏడేళ్ల సనికా పటేల్‌ మాత్రం మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా నుంచి సింఘూలోని రైతుల దీక్షా శిబిరాల వద్దకు చేరుకుంది. ‘నేను భూమి పుత్రిక’నంటూ గళమెత్తి కర్షకుల కష్టాలను హృద్యంగా అలతి అలతి పదాలతో ఆలపించింది. ఇప్పుడు సనికా పటేల్‌ పేరు దిల్లీలోని రైతుల శిబిరాల్లో మార్మోగుతోంది. తాను కూడా రైతు బిడ్డనేనని, కర్షకుల కష్టాలు తనకు తెలుసంటూ ఆ చిన్నారి చెబుతున్న మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. 18 నుంచి రెండు పూటలా బడులు?

పాఠశాలల్లో తరగతులను ఈ నెల 18 నుంచి రెండు పూటలా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొవిడ్‌-19 కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే విడివిడిగా తరగతులకు మధ్యాహ్న భోజనాన్ని అందించి పాఠశాలను ముగిస్తున్నారు. ఇక నుంచి కరోనాకు ముందు నిర్వహించినట్లే యథావిధిగా బడులను కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. తేలికపాటి కార్లొస్తున్నాయ్‌..!!

తేలికగా ఉంటే చాలా ఉపయోగాలుంటాయి. అది మనిషైనా.. కారైనా. కారు సంగతికే వస్తే.. తక్కువ బరువుండే వాహనాల నుంచి ఉద్గారాలు తక్కువగా వస్తాయి. మైలేజీ ఎక్కువ లభిస్తుంది. అంతే కాదు.. పర్యావరణానికీ అది మంచిదే. అందుకే భారత వాహన తయారీ కంపెనీలు, మన ఐఐటీలు తేలికపాటి లోహాలు, అలాయ్స్‌పై పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. అవి విజయవంతం అయితే మనం త్వరలోనే భద్రమైన, తేలికైన కార్లలో ఎక్కువ మైలేజీతో షికారుకెళ్లవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

* అదరగొట్టిన డీమార్ట్‌.. ₹447 కోట్ల లాభం

8. వేటాడుతున్న మానవ మృగాలు

కీకారణ్యాల్లో క్రూరమృగాలు, భయంకర విషసర్పాల బారిన పడితే ప్రాణాలకు పెనుగండమని తెలిసిన మనుషులు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. జనారణ్యంలోని తోటి మనుషుల విషయంలో అలా కుదరదు, సాధ్యం కాదు. శతక కర్త హెచ్చరించినట్లు, కొందరు మానవులకు నిలువెల్లా విషమే. అదను చూసి కాటేసి ప్రాణాలు తోడేయగలరు. సాటివారని, పరిచయస్తులని, వృత్తి వ్యవహారాలనుబట్టి సౌమ్యులని అమాయకంగా నమ్మితే... జీవితాన్నే పణం పెట్టాల్సి వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. 10 ఎస్సెమ్మెస్‌లు ఇస్తే.. 10 సినిమాలు మొదలవుతాయి!

మాస్‌ పాత్రలతోనూ అలరిస్తారు. క్లాస్‌ కథల్లోనూ చక్కగా ఒదిగిపోతారు. హుషారుకి మారుపేరుగా నిలుస్తూ...నిజంగానే ఇస్మార్ట్‌ హీరో అనిపించుకున్నారు రామ్‌ పోతినేని. టీనేజ్‌లోనే బాక్సాఫీసుని ప్రభావితం చేసిన కథానాయకుడాయన. ఈసారి సంక్రాంతి హీరోల్లో ఒకరు. ఆయన కథానాయకుడిగా, కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడ్‌’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రామ్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. గ్రీన్‌ తొలి అర్ధశతకం

భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ కామెరాన్‌ గ్రీన్‌(51) అర్ధశతకం సాధించాడు. బుమ్రా వేసిన 83వ ఓవర్‌ ఐదో బంతికి బౌండరీ బాదిన అతడు టెస్టుల్లో తొలి అర్ధశతకం నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్‌‌ టిమ్‌పైన్(34)‌ చక్కగా సహకరిస్తున్నాడు. వీరిద్దరూ అర్ధశతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే 83 ఓవర్లకు జట్టు స్కోర్‌ను 274/5 కి తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

* పుజారా @ 28.41Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని