close

తాజా వార్తలు

Published : 12/01/2021 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. బయలుదేరిన టీకా!

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఒకప్పుడు చిగురుటాకులా వణికిన భారత్‌కు క్రమంగా ఉపశమనం లభిస్తోంది. మరో నాలుగు రోజుల్లో కొవిడ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతోంది. అందుకు రంగం శరవేగంగా సిద్ధమవుతోంది. అందులో భాగంగా మంగళవారం వేకువజామున కీలక పరిణామం చోటుచేసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ను రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ తొలి విడత టీకా సరఫరా ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అదిగో టీకా.. లెక్క పక్కా

2. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం

మరికొద్ది రోజుల్లో శ్వేతసౌధం వీడనున్న అధ్యక్షుడు ట్రంప్‌ను... ఈలోగానే పదవీచ్యుతుడిని చేసేందుకు డెమోక్రాటిక్‌ పార్టీ వరుస వ్యూహాలు అమలు చేస్తోంది. రిపబ్లికన్లపై ఒత్తిడి తేవడంతో పాటు, 25వ రాజ్యాంగ సవరణ అస్త్రాన్ని, అభిశంసన తీర్మానాన్ని ప్రయోగించింది. తొలుత 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఉపయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ... సోమవారం ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. స్కూళ్లు నడిచేది 65 - 70 రోజులే!

రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం (2020-21)లో కేవలం 65-70 రోజులు మాత్రమే పాఠశాలలు నడవనున్నాయి. పాఠశాలలను ఏప్రిల్‌ వరకే నడిపి, మే నెలలో పదో తరగతి పరీక్షలు జరపాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటిస్తూ విద్యాసంస్థలను నడపనున్నారు. భౌతికదూరం తప్పనిసరి కనుక, ఒక్కో గదికి గరిష్ఠంగా 20 మందికి మించి విద్యార్థులను అనుమతించరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జీవితమే సంక్రాంతి!

రోగ్యంగా ఉండటానికి ఏం చెయ్యాలి? పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు. శరీర ప్రకృతిని అనుసరిస్తే చాలు. ఆరోగ్యం తనకు తానే పరిఢవిల్లుతుంది. ప్రకృతి వైద్యం సారమిదే. కంటికి కనిపించే ప్రకృతికే కాదు, మన శరీర ప్రకృతికీ సూర్యుడే ఆధారం. నిద్ర, మెలకువలను నియంత్రించే మనలోని జీవగడియారం (సర్కాడియన్‌ రిథమ్‌) సూర్య గమనాన్ని బట్టే సాగుతుంది. ఉదయం హుషారు, మధ్యాహ్నం చురుకు, సాయంత్రం బడలిక, రాత్రి నిద్ర అన్నీ దీని మూలంగానే. అందుకే ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలోనే చేయాలి. అప్పుడు జీవితమే ఒక సంక్రాంతి అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమ్మఒడి డబ్బు వద్దంటే ల్యాప్‌టాప్‌ ఇస్తాం

‘ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష. చదివించే స్థోమత లేక పిల్లలను కూలీ పనులకు పంపించే పరిస్థితులను పాదయాత్రలో చూశా. అందుకే ఇప్పుడు బిడ్డలను బడికి పంపే తల్లిదండ్రులకు రూ.15 వేలు సాయం అందిస్తున్నా. వరుసగా రెండో ఏడాదీ ఈ పథకం అమలు చేశాం. ఈ ఏడాది 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,773 కోట్లు ఇచ్చాం. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరింది. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి చదివే, విద్యావసతి పొందే విద్యార్థులు అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ అందిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తినడానికి సిద్ధంగా మాంసాహారం

హైదరాబాద్‌కు చెందిన ద టేస్ట్‌ కంపెనీ, ‘రెడీ-టు-ఈట్‌’ ఆహార పదార్థాల వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టింది. మాంసాహారంతో సహా తినడానికి సిద్ధంగా ఉన్న అన్ని రకాల భారతీయ ఆహార పదార్థాలను ఇలా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ‘వే2ఆన్‌లైన్‌’ ఐటీ సేవల సంస్థ వ్యవస్థాపకుడైన రాజు వనపాల ఏడాది క్రితం ద టేస్ట్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. ‘ఇంటి భోజనం’ మాదిరిగా అన్ని రకాల రుచులతో ఆహార పదార్థాలు రూపొందిస్తున్నామని, ఇందు కోసం హైదరాబాద్‌లోని పటాన్‌చెరు వద్ద డీ-హైడ్రేషన్‌/ ఫ్రీజ్‌ డ్రైయింగ్‌ టెక్నాలజీ తో కర్మాగారాన్ని రూ.22 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసినట్లు రాజు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పెళ్లికి నిరాకరించిన ప్రియుడిని చంపేసిన ప్రియురాలు

 పెళ్లికి నిరాకరించాడన్న ఆక్రోశం.. వేరొకరిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో ప్రియుడిని ఓ యువతి హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం- కాపవరం గ్రామాల మధ్య చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ ఎం.సురేష్‌ కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దాహం అంటూ వచ్చి దారుణం

8. మన విజయను చూసి అమెరికా ఔరా! అంది..

వివాదాలు తలెత్తినప్పుడు... సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆమెలోని న్యాయవాది బుర్ర పాదరసంలా పనిచేస్తుంది.... మంత్రం వేసినట్టుగా సమస్యలని చక్కబెట్టేస్తుంది... అమెరికాలో రాజకీయ విశ్లేషణలు చేసే ‘పొలిటికో’ పత్రిక ఏడాది క్రితం తెలుగమ్మాయి విజయగద్దెపై రాసిన వ్యాసం సారాంశం అది.. ఆ మాటలని అక్షరాలా నిజం చేస్తూ తాజాగా ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను తొలగించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాలాంటి భార్యే కావాలట

శ్రుతిహాసన్‌ కొంచెం గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో భాగంగా ఇటీవలే  ‘క్రాక్‌’ విడుదలైంది. ఇందులో  రవితేజతో కలిసి శ్రుతి చేసిన సందడి ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె ‘ఈనాడు సినిమా’తో మాట్లాడింది. ఆ విషయాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పోరాట యోధులు

తొడ కండరాలు పట్టేసి సరిగ్గా నడవలేని స్థితిలో ఆ ఆటగాడున్నాడు.. అయితేనేం జట్టును ఓటమి నుంచి కాపాడాలనే అతని తపన ముందు ఆ గాయం చిన్నదైపోయింది! ముందు రోజు రాత్రి వెన్నునొప్పితో బాధపడి.. ఉదయం పూట బూట్లు వేసుకోవడానికి కూడా వంగలేకపోయాడు మరో ఆటగాడు.. కానీ జట్టును రక్షించాలనే ధ్యేయం ముందు ఆ నొప్పి పారిపోయింది! అప్పటికే గాయాలు.. ఆపై శరీరంపై బలంగా తాకుతున్న బంతులు.. సమయం గడుస్తున్నా కొద్దీ తీవ్రమవుతున్న ఇబ్బందులు.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఆ ఆటగాళ్లిందరూ గొప్ప పోరాట పటిమ ప్రదర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గెలుపంత డ్రాTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని