
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
రైతులు ఎక్కడా ఆనందంగా లేరని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవోలను చంద్రబాబు భోగిమంటల్లో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ... పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అమెరికాలో గొరిల్లాలకు కరోనా
అమెరికాలోని శాన్‌డియాగో నగరంలో ఉన్న సఫారీ పార్కులో గొరిల్లాలకు కరోనా సోకింది. జూలో ఒకే చోట కలిసి ఉంటున్న ఎనిమిది గొరిల్లాలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, మరికొన్ని కూడా దగ్గుతున్నాయని పార్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లీసా పీటర్సన్ చెప్పారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో డిసెంబరు 6 నుంచి లాక్డౌన్ విధించడంతో ఈ పార్కు సైతం మూసే ఉంది. సందర్శకుల్ని అనుమతించడం లేదు. జూలో గొరిల్లాలకు దగ్గరగా పనిచేసే సిబ్బందిలో ఒకరు ఇటీవల కొవిడ్-19 బారినపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు!
3. బుకింగ్ చేసుకున్న రోజే వంటగ్యాస్
వినియోగదారులు బుకింగ్ చేసుకున్న రోజే వంటగ్యాస్ డెలివరీ చేసే విధంగా తత్కాల్ సేవ ప్రారంభించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సన్నాహాలు చేస్తుంది. ‘ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాను తత్కాల్ ఎల్పీజీ సేవల ప్రారంభానికి గుర్తించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద బుక్ చేసుకున్న 30-45 నిమిషాల్లోనే వినియోగదారుడికి గ్యాస్ డెలివరీ అందించనున్నాం’ అని ఐఓసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. త్యజించు - జయించు
మనిషి ఎదిగే క్రమంలో జీవితానికి సరిపడా అలవాట్లు నేర్చుకుంటాడు. పుట్టుకతోనే స్వాభావికంగా ఏడవడం, బోర్లాపడటం, పాకడం, నవ్వడం, పరుగెత్తడం వంటి భౌతికపరమైన అలవాట్లు వస్తాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి మాటలు, చేతలు, నడక, నడతలతో మానసిక ఎదుగుదల ఆరంభమవుతుంది. క్రమంగా మంచి, చెడుల వ్యత్యాసం తెలుస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఒక్కసారిగా విమానం ఊగిపోయింది!
చిక్కని చీకట్లో... మిణుకుమిణుకు నక్షత్రాలు ఎప్పుడూ చూసేవే.. కానీ భూగోళపు ఒక కొనపై ఉండి అనంతాకాశాన్ని వీక్షించడం అనే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మళ్లీమళ్లీ సాధ్యం కానిది.. ఈ అందమైన జ్ఞాపకాన్ని మూటగట్టుకోవడానికి పెద్ద సాహసమే చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు పైలట్ తన్మయి పాపగారి. ఉత్తరధ్రువం మీదుగా బోయింగ్ విమానాన్ని నడిపి 16 వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆమె తన అనుభవాలని వసుంధరతో పంచుకున్నారు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ధరల దరువు
సంక్రాంతి అంటే పిండి వంటల పండగే. ముఖ్యంగా అరిసెలకు పెద్దపీట వేస్తారు. ఈసారి సరకుల ధరలు భయపెడుతుండటంతో వాటి వాసన వంటగది దాటడంలేదు. వేరుసెనగ నూనె లీటరు రూ.150 పైగా ఉంది. పొద్దుతిరుగుడు(సన్‌ఫ్లవర్) నూనె లీటరు రూ.135కి చేరినా.. ఇంకా పైకే చూస్తోంది. పామోలిన్ మునుపెన్నడూ లేనివిధంగా లీటరుకు రూ.115 పలుకుతోంది. అరిసెల తయారీలో వాడే బెల్లం.. కిలో రూ.54 అయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. 11 కంపెనీలు.. రూ.60 లక్షల కోట్లు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన తొలి 500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి 11 ప్రైవేటు కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. ఇంత విలువైన కంపెనీలతో అంతర్జాతీయంగా భారత్ పదో స్థానంలో నిలిచిందని ‘హురున్ గ్లోబల్ 500’ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం.. భారత్‌కు చెందిన 11 కంపెనీల విలువ 14 శాతం పెరిగి 805 బిలియన్ డాలర్ల (సుమారు రూ.60 లక్షల కోట్ల)కు చేరుకుంది. ఇది భారత జీడీపీలో మూడోవంతు కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఐటీ అధికారులుగా నటించింది వారే..
హైదరాబాద్‌లో రూ.2 వేల కోట్ల విలువైన భూముల హక్కుల కోసం ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గోవాలో నలుగురిని, గుంటూరు, విజయవాడల్లో మరో నలుగురిని పట్టుకున్నారని తెలిసింది. వీరిని బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. గోవాలో అదుపులోకి తీసుకున్న నలుగురిలో కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. స్మార్ట్ మాస్క్‌లు..
అవసరానికి తగినట్టుగా అన్నింటినీ స్మార్ట్‌గా మార్చేయడం మనిషికి అలవాటే. ఈ కోవలోనే ఫోన్లు మొదలుకుని అన్ని స్మార్ట్ గ్యాడ్జెట్లు వచ్చేసాయి. ఇకపై ఆ జాబితాలోకి నిత్యం ముఖానికి అంటిపట్టుకుని ఉండే మాస్క్‌లు చేరనున్నాయి. కేవలం వైరస్‌లను అడ్డుకోవడం మాత్రమే కాకుండా మల్టీ టాస్కింగ్‌కి సిద్ధం అవుతున్నాయి. నోటి మాటల్ని అనువాదం చేస్తున్నాయి.. ఎయిర్ ప్యూరిఫయర్లుగా గాలిని ఫిల్టర్ చేయడం.. హెల్త్ మానిటరింగ్ సిస్టంలా ఆరోగ్యంపై నిఘా వేయడం చేస్తున్నాయి.. ఇంతకీ ఏంటా మాస్క్‌ల విశేషాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అది నా అలవాటు
మూడో టెస్టు చివరి రోజు మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను స్మిత్ కాలితో చెరిపేయడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే స్మిత్ మాత్రం తానే తప్పూ చేయలేదని, జనం స్పందన దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పాడు. ‘‘వివాదంతో దిగ్భ్రాంతి చెందా. నిరాశకు గురయ్యా. అలా బ్యాటింగ్ క్రీజులోకి వచ్చి మేం ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాం, బ్యాట్స్‌మెన్ మా బౌలర్లను ఎలా ఎదుర్కొంటున్నారు అని ఊహించుకోవడం నాకు అలవాటు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి