close

తాజా వార్తలు

Published : 15/01/2021 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. జో బైడెన్‌ కీలక ప్రతిపాదన

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కీలక ప్రతిపాదన చేశారు. పాలన చేపట్టిన వందరోజుల్లోగా వంద మిలియన్ల టీకాలు వేయడమే లక్ష్యంగా అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ పేరిట కీలక ప్రతిపాదన చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్రణాళిక ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం సహా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. మరో వైపు ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఈనెల 20న సెనెట్‌లో చర్చ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొత్త పార్లమెంట్‌ భవనం పనులు నేటి నుంచే

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 14 మంది సభ్యుల వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి మూడ్రోజుల క్రితం ఆమోదం తెలిపింది. అనుమతి మంజూరు కావడంతో ఇవాళ  కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందిన టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్‌ పనులను ప్రారంభించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ల్యాపీ వేడెక్కుతోందా? ఇలా చేయండి

వర్క్‌ ఫ్రమ్‌ హోం సీజన్‌ ఇంకా నడుస్తోంది... ఆన్‌లైన్‌ క్లాసుల ట్రెండూ‌ కొనసాగుతూనే ఉంది. దీంతో ల్యాప్‌టాప్‌లు బిజీబిజీ అయిపోయాయి. దీంతో ల్యాపీలు ఒక్కోసారి పొయ్యి మీది పెనంలా వేడెక్కిపోతున్నాయి. దీని వల్ల ల్యాపీ చెడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో ల్యాపీలు వేడెక్కడం అరికట్టడానికి కొన్ని చిట్కాలున్నాయి. వాటిని ఫాలో అయిపోండి... ల్యాపీని చక్కగా వాడేయండి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అతడి రక్తంలో పుట్టగొడుగులు పెరిగాయి

ఓ 30 ఏళ్ల యువకుడు(బాధితుడి వివరాలు వెల్లడించలేదు) మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. అతడికి బైపోలార్‌ డిజార్డర్‌ కూడా ఉంది. దీంతో వైద్యులు అతడికి కొన్ని మందులు సూచించారు. కానీ, ఆ యువకుడు వాటిని వేసుకోవడం మానేసి సొంత వైద్యంపై దృష్టి పెట్టాడు. ఇంటర్నెట్‌లో ఆన్వేషించగా.. మానసిక ఆందోళనను, ఒత్తిళ్లను దూరం చేయడంలో సిలోసెబిన్‌ పుట్టగొడుగులు ఉపయోగపడతాయని తెలుసుకున్నాడు. ఇందుకోసం పుట్టగొడుగులను మరగబెట్టి టీ తయారు చేశాడు. ఆ టీని ఇంజక్షన్‌ రూపంలో తన రక్తంలోకి ఎక్కించుకున్నాడు అంతే.. అతడి రక్తంలో పుట్టగొడుగులు పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. బ్లాక్‌ పాంథర్‌Xఅనకొండ: ఫైట్‌ అదుర్స్

కుక్కలు, పిల్లులు దెబ్బలాడుకోవడం చూసి ఉంటాం. పాము, ముంగిస పోట్లాడుకోవడం మనకు తెలుసు. అయితే చిరుత, అనకొండ పోరును ఎప్పుడైనా చూశారా..? ఇలాంటి ఫైటింగ్‌లు సినిమాల్లో చూసి ఉండొచ్చు. తాజాగా బయోడైవర్సిడ్‌ బ్రెసిలేరియా తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో వీక్షకులను అబ్బురపరుస్తోంది. దట్టమైన అడవుల్లోని సెలయేటిలో అనకొండను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్లాక్‌ పాంథర్‌ను వీడియోలో చూడొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. ‘సూపర్‌ పవర్‌’ అని కవ్విస్తే.. ప్రతిదాడి తప్పదు

భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా ‘సూపర్‌ పవర్’ భారతజాతి గర్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే దీటుగా జవాబు ఇవ్వగల సైనికులు తమకున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి రక్షణే తమ ధ్యేయమని, పొరుగు దేశాలతో వివాదాలు కోరుకోవడం లేదని వెల్లడించారు. శాంతి, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకే ప్రాధాన్యం ఇస్తామని నొక్కి  చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. పట్టర పట్టు.. జల్లికట్టు

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

8. మురుగు కాల్వలో బాలుడి మృతదేహం

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవుని పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకునేందుకు నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నిశాంత్‌(5) గురువారం మధ్యాహ్నం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. శాంసంగ్‌ కొత్త ఆవిష్కరణలు..ఏంటో తెలుసా..?

శాంసంగ్‌ కొత్త ఏడాదిలో సరికొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే శాంసంగ్ గెలాక్సీ ఏ32 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. అలానే ఫ్లాగ్‌షిప్‌ కేటగిరీలో గెలాక్సీ ఎస్‌21 వివరాలను వెల్లడించింది. వీటితో పాటు అండర్‌ డిస్‌ప్లే కెమెరాను త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మూడింటి గురించిన పూర్తి సమాచారంపై ఓ లుక్కేద్దామా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. స్టీవ్‌స్మిత్‌ ఔట్..

టీమ్‌ఇండియాతో ఆడుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 35వ ఓవర్‌ తొలి బంతికి స్మిత్‌(36; 77 బంతుల్లో 5x4) ఔటయ్యాడు. అతడు రోహిత్‌ శర్మ చేతికి చిక్కడంతో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు లబుషేన్‌(35*) కలిసి స్మిత్‌ 70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని