close

తాజా వార్తలు

Published : 20/01/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. మళ్లీ అమెరికను చేయాలని..

మనవలు... మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలం గడిపే వయసులో...జో బైడెన్‌ అమెరికా పునరుద్ధరణ భారం మోయబోతున్నారు! 46వ అమెరికా అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసే 78 ఏళ్ళ బైడెన్‌-ఉపాధ్యక్షురాలుగా నల్లజాతి కలువ కమలా హారిస్‌తో కలసి అమెరికాను మళ్ళీ గాడిన పెట్టడానికి...ట్రంప్‌ హయాంలో అమెరికాపై ఇంటా బయటా పడ్డ మరకల్ని కడిగేయటానికి... నడుంబిగిస్తున్నారు. ఆ క్రమంలో ఎదురవుతున్న సవాళ్ళెన్నో! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బైడెన్‌ ప్రమాణం @ రాత్రి 10.30

2. సీఎంను తిడితే నిన్ను కొడతా

 ‘పరస్పరం చర్చకు కూర్చుందాం.. ఆ సందర్భంగా నువ్వు ముఖ్యమంత్రి జగన్‌ను తిట్టు... అప్పుడు బహిరంగంగానే నిన్ను కొట్టకుంటే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతా’ అని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాజీ మంత్రి దేవినేని ఉమాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తనయుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌, పీకేఎం క్రికెట్‌ టోర్నమెంటును మంగళవారం  కొడాలి నాని ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉచితంలో చిరు ‘జల’క్‌

హానగరంలో డిసెంబరు 15వ తేదీ నుంచే ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చింది కదా.. మీటర్లు తరువాత పెట్టుకుందాములే అన్న ధోరణిలో చాలామంది నల్లాదారులు ఉన్నారు. ఇలాంటి వారికి సర్కారు చిరు జలక్‌ ఇచ్చింది. ఏ తేదీ నాటికి మీటర్లు అమర్చుకుంటారో ఆ తేదీ నుంచే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. దేశంలో తొలిసారి దిల్లీలో ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చింది. ఇందుకు మీటర్లను తప్పనిసరి చేసింది. 18 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉండగా పూర్తిస్థాయిలో మీటర్లు అమర్చుకోవడానికి నాలుగేళ్లకు పైగా పట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అలర్జీ ముప్పుంటే కొవిషీల్డ్‌ టీకా వద్దు

‘కొవిషీల్డ్‌’ టీకా తయారీలో వినియోగించిన పదార్థాల వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఉన్నవారు, ఈ టీకా తీసుకోవద్దని.. దీన్ని తయారు చేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) స్పష్టం చేసింది. ‘కొవిషీల్డ్‌’ టీకాలో ఎల్‌-హిస్టిడైన్‌, ఎల్‌-హిస్టిడైన్‌ హైడ్రోక్లోరైడ్‌ మోనోహైడ్రట్‌, మెగ్నీషియమ్‌ క్లోరైడ్‌ హెగ్జాహైడ్రేట్‌, పాలీసోర్బేట్‌ 80, ఎథనాల్‌, సుక్రోజ్‌, సోడియమ్‌ క్లోరైడ్‌, డైసోడియమ్‌ ఎడెటేట్‌ డైహైడ్రేట్‌ (ఈడీటీఏ), నీరు ఉన్నాయి. ఇవి పడని వారు, అలర్జీ లేదా ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నవారు ‘కొవిషీల్డ్‌’ టీకా తీసుకోవద్దని కోరుతూ ఒక ‘ఫ్యాక్ట్‌ షీట్‌’ను ఎస్‌ఐఐ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 50 ఏళ్లు పైబడిన వారికి మార్చిలో టీకా!

5. 2 విడతలుగా పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండు విడతల్లో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. తొలి విడత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో విడత మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు సాగుతాయని మంగళవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు అమల్లో ఉన్నందున రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు సాగుతాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్రంపరి స్వయంకృతం!

డొనాల్డ్‌ ట్రంప్‌..... చాలామంది అమెరికా అధ్యక్షుల్లా అమెరికా ఆధిపత్యాన్ని, సామ్రాజ్యవాద విస్తరణకాంక్షను చాటలేదు... బుష్‌లా... క్లింటన్‌లా కొత్తగా యుద్ధశంఖాలు పూరించలేదు... వాటిని కొనసాగించే ప్రయత్నమూ చేయకుండా... అఫ్ఘాన్‌లాంటి చోట్ల నుంచి అమెరికా సైన్యాలను వెనక్కి రప్పించటం మొదలెట్టారు... దశాబ్దాలుగా రావణకాష్టమైన మధ్యప్రాచ్యంలో శాంతికి బీజాలు పడ్డవి ట్రంప్‌ హయాంలోనే! ఉప్పూనిప్పూలాంటి ఇజ్రాయెల్‌తో అరబ్‌ దేశాలివాళ దోస్తీ చేసుకుంటున్నాయంటే అందులో ట్రంప్‌ యంత్రాంగం పాత్ర కీలకం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి

ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. పెద్దల మాటతో తనకు దూరమైందన్న కసితో యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లెకు చెందిన జి.గాయత్రి (20) చిత్తూరులో, పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన డిల్లీబాబు (19) పెనుమూరులో డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు చదువుకునేది వేర్వేరు ప్రాంతాల్లో అయినా.. కళాశాలలకు వెళ్లేందుకు పెనుమూరు మార్గంలోనే వచ్చేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కర్నూలుకు హైకోర్టు తరలిస్తూ రీ నోటిఫికేషన్‌ ఇవ్వండి

 ‘‘ప్రాంతాలవారీగా అభివృద్ధిలో సమతౌల్యం సాధించడానికి అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ విశాఖలో కార్యనిర్వాహక, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేసింది. ఇందుకోసం ఆగస్టులో ఏపీ పాలనా వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020 చేసింది. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా...’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బెంగాల్‌లో ఘోరప్రమాదం.. 13 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాళ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఆటో, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. జల్‌పాయ్‌గుడి జిల్లా ధూప్‌గుడి వద్ద బుధవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. పొగమంచు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కల లాంటిది.. నిజమైనది

నెల రోజుల వెనక్కి వెళ్దాం! 2020 డిసెంబరు 19. భారత కాలమానంలో సమయం ఉదయం ఆరున్నర. అడిలైడ్‌లో తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలై గంటన్నరే అయింది. అప్పుడే నిద్ర లేచి.. స్కోరు చూద్దామని టీవీ పెడితే భారత అభిమానులకు తమ కళ్లను తామే నమ్మలేని దృశ్యం. భారత్‌ స్కోరు 36/10. ఎంత బాధ.. ఎంత కోపం.. ఎన్ని తిట్లు.. ఎన్ని నిట్టూర్పులు..! అంతటి ఘోర పరాభవం తర్వాత తర్వాతి మ్యాచ్‌లో ప్రత్యర్థిని దెబ్బకు దెబ్బ తీయాలని.. ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తాం మామూలుగా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని