
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతాధికారుల బదిలీల ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్ఈసీ తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు తగవని స్పష్టం చేసింది. బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. గానగంధర్వుడికి పద్మవిభూషణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి.. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేతో కలిపి మొత్తం ఏడుగురికి రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురిని పద్మవిభూషణ్‌కు, 10 మందిని పద్మభూషణ్‌కు, 102 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. హద్దు మీరిన చైనా
సరిహద్దుల్లో డ్రాగన్ బుసలు ఆగడంలేదు. ఒకపక్క చర్చల పేరుతో శాంతి మంత్రం పఠిస్తున్నట్టు నటిస్తూ.. మరోపక్క అదును చూసి దొంగ దెబ్బకు ప్రయత్నిస్తూనే ఉంది. ఉత్తర సిక్కింలో ఇటీవల రెండుసార్లు దుస్సాహసానికి దిగి, భంగపడింది. మొదటి ఘటన.. ఈ నెల ప్రారంభంలో లాచుంగ్ ప్రాంతంలో, రెండోది ఈ నెల 20న ‘నాకు లా’ వద్ద జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. శాకాహారుల్లో కొవిడ్ వ్యాప్తి తక్కువే!
శాకాహారుల్లో కొవిడ్ పాజిటివ్ రేటు తక్కువగా ఉందా? ఆహారపు అలవాట్లు, బ్లడ్ గ్రూపులను బట్టి కూడా కొవిడ్ వ్యాప్తిలో హెచ్చుతగ్గులుంటాయా? జనసాంద్రతా వ్యాప్తికి కారణం అవుతుందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ (సీఎస్ఐఆర్) అవుననే సమాధానమిస్తోంది. కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా 17 నగరాల్లో అధ్యయనం చేయగా ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు సీఎస్ఐఆర్ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఆవిష్కరణ ఎక్కడైనా తయారీ మనదేశంలోనే
5. అర్ణబ్ రూ.40 లక్షలు ఇచ్చారు
రిపబ్లిక్ టీవీ ఛానల్‌కు అనుకూలంగా టీఆర్పీ రేటింగ్లలో అవకతవకలకు పాల్పడినందువల్ల ఆ సంస్థ ప్రధాన సంపాదకుడు అర్ణబ్ గోస్వామి తనకు 12వేల డాలర్లు ఇచ్చినట్లు ప్రసార వీక్షకుల పరిశోధన మండలి (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఒక అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. మూడేళ్లలో అర్ణబ్ నుంచి తనకు రూ.40 లక్షలు అందినట్లు పార్థో అంగీకరిస్తూ ఇచ్చిన ఒక చేతిరాత ప్రకటనను అందులో జోడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మూఢత్వమే ప్రాణాలు తీసింది!
తండ్రి.. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. తల్లి పట్టణంలోనే పేరొందిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ కరస్పాండెంట్. ప్రస్తుతం అందులో 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాతికేళ్ల క్రితమే మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డ వీరు.. విద్యావంతులుగా చుట్టుపక్కల పేరు గడించారు. కుమార్తెలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారం క్రితం వరకూ సాటి అధ్యాపకులు, స్థానికులతో కలిసిమెలసి ఉంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. చిన్న కుమార్తెలో మొదలైన మనోవ్యాకులత.. ఇంటిల్లిపాదిని మూఢత్వంలోకి నెట్టేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* 16 మంది మహిళలను చంపిన సైకో!
7. చిన్న గుండెకు చిట్టి గండం!
సమస్య పెద్దదే కావొచ్చు. కారణం మాత్రం చాలా చిన్నది. చికిత్స అంత కన్నా తేలికైంది. అతి చవకైందీనూ. అవును. థయమిన్ (విటమిన్ బి 1) లోపంతో చిన్నారుల్లో తలెత్తే గుండె జబ్బును (కార్డియాక్ బెరిబెరి) చిన్నపాటి జాగ్రత్తలతోనే పూర్తిగా నివారించుకోవచ్చు. ఒకవేళ తలెత్తినా సరిగ్గా గుర్తిస్తే మామూలు చికిత్సతోనే నయమవుతుంది. లేకపోతే తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇతరత్రా జబ్బులుగా పొరపడి అనవసర చికిత్సలు చేస్తే ప్రాణాల మీదికీ రావొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల ఇలాంటి పరిస్థితే నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ముకేశ్ సెకను సంపాదన.. సామాన్యుడి మూడేళ్ల ఆర్జన
దేశంలో కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభమైన 2020 మార్చి తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. లాక్డౌన్ ఆంక్షలతో కార్యకలాపాలు స్తంభించి, పనులు లేక ప్రజల ఆదాయాలు తీవ్రంగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో భారత్‌లోని అపర కుబేరుల్లో తొలి 100 మంది సంపద రూ.12,97,822 కోట్ల మేర పెరగడం గమనార్హం. ఈ డబ్బుతో దేశంలోని 13.8 కోట్ల మంది పేదలు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున ఇవ్వొచ్చట. అత్యంత కుబేరుడైన ముకేశ్ అంబానీ ఒక గంటలో ఆర్జించిన డబ్బు సంపాదించేందుకు, నైపుణ్యం లేని ఒక సాధారణ కార్మికుడికి 10,000 సంవత్సరాలు పడుతుందట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఆ స్ఫూర్తితోనే పాటొచ్చింది
‘‘ఒక పాట ప్రేక్షకుల్ని థియేటర్లకి తీసుకొస్తుందనే విషయాన్ని చాలా ఇష్టపడతా. సినిమాకి నా పాట ప్రధాన ఆకర్షణగా నిలిచిందంటే ఒక సంగీత దర్శకుడిగా నాకు అంతకంటే ఏం కావాలి?’’ అంటున్నారు అనూప్ రూబెన్స్. ఆయన స్వరాలు సమకూర్చిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ జంటగా నటించారు. మున్నా దర్శకుడు. ఎస్.వి.బాబు నిర్మాత. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు అనూప్ రూబెన్స్. ఆ విషయాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* కాళ్లూ చేతులూ లేకున్నా...ఆల్‌రౌండర్ అయ్యింది
10. ఆసీస్ కెప్టెన్‌ను వదలట్లేదు
‘‘గబ్బాకు రా చూసుకుందాం’’ అని టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్‌కు సవాలు విసిరి.. చివరకు ఆ టెస్టులో ఓటమితో అభాసుపాలైన ఆస్ట్రేలియా కెప్టెన్‌పై టిమ్ పైన్‌ను నెటిజన్లు ఎంతకీ వదలట్లేదు. బిగ్‌బాష్ లీగ్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా రిజర్వ్ ఆటగాడిగా ఉన్న అతను.. ఆటగాళ్ల కోసం డ్రింక్స్ మోసుకెళ్తు ఫొటోపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. ‘‘పైన్ నీళ్ల సీసాలను కూడా చేజార్చాడని విన్నా’’ అని భారత్‌తో టెస్టుల్లో వికెట్ కీపర్‌గా క్యాచ్‌లు వదిలేసిన అతని వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి పోస్టు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి