close

తాజా వార్తలు

Published : 27/01/2021 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. తుది అంకానికి కరోనాపై పోరు!

యావత్‌ ప్రపంచం కరోనా మహమ్మారిని ఓడించేందుకు చేస్తున్న పోరు తుది దశకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో భాగంగా ప్రపంచ దేశాలు చూపిన చొరవ, అనుసరించిన ముందస్తు వ్యూహాలు, పరస్పర సహకారం వల్లే ఇది సాధ్యమయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏమిటా జెండా?

ఎర్రకోట ఘటనలో ఆందోళనకారులు ఎగరేసిన సిక్కుల జెండా సాధారణంగా గురుద్వారాల వద్ద ఉంటుంది. జెండాలో ఖాండా, కత్తి, చక్ర, రెండు కృపాణాలు ఉంటాయి. జాతీయ జెండాను తాము తొలగించలేదని ఆ సమయంలో అక్కడే ఉన్న సినీనటుడు దీప్‌ సిధు తెలిపారు. దీనికి మతం రంగు పూయడం తగదన్నారు. ‘సిక్కు మత చిహ్నమైన ‘నిశాన్‌ సాహిబ్‌’ జెండాను, రైతు జెండాను ఎర్రకోటపై ఎగురవేశాం. కిసాన్‌, మజ్దూర్‌ ఏక్తా నినాదాలిచ్చాం’ అని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏమార్చి.. వ్యూహం మార్చి..

3. ఇంటర్‌ ప్రశ్నల్లో 50 శాతం ఛాయిస్‌!

ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఈసారి ఛాయిస్‌ 50 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు పంపనుంది. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని భావిస్తున్న బోర్డు అధికారులు ఛాయిస్‌ పెంపుపై ఇటీవల సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ప్రశ్నపత్రాల్లో, ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రతి దాంట్లో మూడు సెక్షన్లు ఉండగా.. రెండింటిలో 50 శాతం ఛాయిస్‌ ఇవ్వనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అదే గ్రామంలో ఓటుండాలి

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి గ్రామాల్లో చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పోటీ చేయాలనుకుంటున్న వారికి ఏయే అర్హతలు ఉండాలి? ఎవరు అనర్హులవుతారు? తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ కరదీపిక ప్రచురించింది. అందులోని ప్రధానాంశాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సంశయమా? సంయమనమా?

రాష్ట్రంలో కొవిడ్‌ టీకాలు వేసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షించేందుకు రూపొందించిన కొవిన్‌ పోర్టల్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతోపాటు టీకా తీసుకోవాల్సిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వేచిచూసే ధోరణిలో ఉన్నారు. దేశీయంగా తయారైన రెండు కంపెనీలకు చెందిన 10 లక్షల డోసుల ఔషధాన్ని కేంద్రం రాష్ట్రానికి పంపించింది. ఇది అవసరాలకు సరిపడా ఉన్నా.. ఫ్రంట్‌లైన వారియర్స్‌ నుంచి స్పందన తక్కువగా ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌ టీకాలు సత్వరం వినియోగించాలి

6. కప్పు కొట్టడమే లక్ష్యంగా

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ హాకీ ఆటగాడిగా మారారు. ఇప్పుడాయన నుంచి రానున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం కోసం ఈ కొత్త అవతారమెత్తారు. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్‌,  అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌, దయా పన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేను కాళికను.. ఆయన నా భర్తే కాదు..

వంతికా ఆలయానికి వెళ్లొస్తా.. నేను కాళికను.. అంటూ కన్నబిడ్డల హత్య కేసులో నిందితురాలు పద్మజ కేకలేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. మదనపల్లె శివనగర్‌లో ఆదివారం జరిగిన అలేఖ్య, సాయిదివ్య హత్య కేసుల్లో నిందితులైన వారి తల్లిదండ్రులను అరెస్టు చేసేందుకు రూరల్‌ పోలీసులు మంగళవారం పురుషోత్తంనాయుడు ఇంటి వద్దకు వెళ్లారు. భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పద్మజ చేతులు తిప్పుతూ ‘నేనే శివ’ అంటూ బిగ్గరగా అరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆలి మీద కోపం.. సైకో అవతారం

8. మెట్రో బండి.. మొండికేస్తోందండి

హైదరాబాద్‌ మహా నగరానికే తలమానికమైన మెట్రో రైలు వ్యవస్థ ఇప్పుడు దైవాదీనం సర్వీసుగా మారిపోయింది. ఏ స్టేషన్లలో ఎప్పుడు ఆగిపోతుందో... ఎంత సేపటికి తిరిగి కదులుతుందో చెప్పలేని పరిస్థితి. మెట్రో రైలు పరుగు ప్రారంభించాక 2018లో 2సార్లు సాంకేతిక ఇబ్బందులతో ఆగింది. ఆ తరువాత ఏడాది నుంచి రైలు ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2019లో 6సార్లు, 2020లో 5సార్లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. కొద్ది రోజుల కిందట జూబ్లీహిల్స్‌- చెక్‌పోస్టు మధ్య మెట్రో రైలు అరగంట ఆగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం:8 మంది మృతి

 రాజస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీపును ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఖాటూశ్యామ్‌ జీ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు మధ్యప్రదేశ్‌ వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మా బంధంలో మార్పులేదు...

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  గైర్హాజరీలో ఆస్ట్రేలియాలో జట్టును అద్భుతంగా నడిపించిన రహానె.. తన నాయకత్వ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. జట్టుకు సిరీస్‌ విజయాన్ని అందించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అయితే తనకు, కోహ్లీకి మధ్య బంధంలో మార్పేమీ లేదని.. అతడు తన కెప్టెనని, తాను ఉపసారథినని రహానె స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో కోహ్లి తిరిగి నాయకత్వ పగ్గాలు అందుకోనుండగా.. రహానె మళ్లీ వైస్‌కెప్టెన్‌ పాత్రలోకి   మారనున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని