close

తాజా వార్తలు

Updated : 23/02/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. అంగారకుడిపై రోవర్‌ దిగిన వీడియో విడుదల

అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది నిర్ధారించడానికి అమెరికా పంపిన 'పర్సెవరెన్స్‌' రోవర్‌ ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో 'పర్సెవరెన్స్‌' అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్‌ అయిన క్షణాలు ఈ వీడియోలో రికార్డు అయ్యాయి. రోవర్‌ ల్యాండవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్‌ కిందకి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో హర్షించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అపార్ట్‌మెంట్‌ వాసులకు జలక్‌!

అపార్ట్‌మెంటు వాసులకు జలమండలి ఝలక్‌ ఇచ్చింది. ఉచిత మంచినీటి పథకంలో అపార్ట్‌మెంట్లకు తాజాగా కొత్త నిబంధన చేర్చాలని నిర్ణయించింది. ఇప్పటివరకు అపార్ట్‌మెంట్‌లో ఏదైనా ఒక్క ఫ్లాటు యజమాని ఆధార్‌ను జలమండలి క్యాన్‌ (వినియోగదారుడి ఖాతా సంఖ్య)తో లింకు చేస్తే సరిపోయేది. దీంతో అదే అపార్ట్‌మెంట్‌లో మిగతా ఫ్లాట్లకూ ఉచిత నీటి పథకాన్ని వర్తింపజేయాలనుకున్నారు. తాజాగా ఈ నిబంధనను మార్చనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధార్‌ మార్గదర్శకాలను అనుసరించి ప్రయోజనం పొందే ప్రతి లబ్ధిదారుడి ఆధార్‌ను అనుసంధానం చేయాల్సి ఉండటంతో కొత్తగా మార్పులు తప్పడం లేదని అధికారులంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌పై ఎక్కువ కాలం తుంపర్లు!

సాధారణ అద్దాలతో పోల్చితే స్మార్ట్‌ఫోన్‌ తెరల మీద కొవిడ్‌ వైరస్‌ ఎక్కువ కాలం జీవించడానికి అవకాశముందని ఐఐటీ (హైదరాబాద్‌) పరిశోధకులు గుర్తించారు. స్క్రీన్‌, స్క్రీన్‌గార్డులలో నీటిని పీల్చుకునే గుణం ఉండకపోవడమే దీనికి కారణమని వారు పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతున్న వేళ వీరి పరిశోధనాంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎంతసేపు ఎండిపోకుండా ఉంటాయనే అంశమై  వీరు పరిశోధించారు. తుంపర్లు ఎండిపోతే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు చాలావరకు తగ్గిపోతాయని గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సెస్సులో వాటా ఇప్పించలేం

కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్సు, సర్‌ఛార్జీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఇచ్చే అవకాశం లేదని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ స్పష్టంచేశారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుందని, దీనిపై సిఫార్సులు చేసే అధికారం ఒక్కటే ఆర్థిక సంఘాలకు ఉందని తెలిపారు. సెస్సు, సర్‌ఛార్జీల వ్యవహారం వీటి పరిధిలోకి రాదని చెప్పారు. వస్తువులు, సేవలతో పాటు ఆదాయాలపై కేంద్ర ప్రభుత్వం పన్నులతో పాటు సెస్సు, సర్‌ఛార్జీలు విధిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీకా ముచ్చట

కొవిడ్‌-19 టీకా తీసుకున్నాక తొలి రెండు, మూడు రోజుల్లో సూది గుచ్చిన చోట నొప్పి, చలి, తలనొప్పి, వికారం, నిస్సత్తువ, కొద్దిగా జ్వరం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. రెండో మోతాదు టీకా తీసుకున్నవారిలో, ఇంతకుముందే కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారిలో ఇవి ఇంకాస్త ఎక్కువగానూ కనిపిస్తుంటాయి. ఇవన్నీ టీకాకు రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తోందనటానికి సూచికలే. అలాగని దుష్ప్రభావాలు తలెత్తనంత మాత్రాన టీకా పనిచేయటం లేదని కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దక్షిణాఫ్రికా రకం కరోనాకు 15 రోజుల్లో టీకా

6. ఈ దీపాల్ని దొంగిలించలేరు!

గ్రామాల్లో పొద్దుగూకిన తర్వాత వీధిదీపాలు లేని దారుల్లో నడవాలంటే గుండెలు చిక్కబట్టుకోవాలి. కొన్నిచోట్ల గుడ్డిదీపాలే ఉంటాయి. మహిళలు, పిల్లలు అలాంటి బాటలో వెళ్లాలంటేనేే భయపడతారు. పాములబెడద ఉంటే ఇక చెప్పక్కర్లేదు. వీధిదీపాల పరిస్థితులపై అధ్యయనం చేసిన మోనిక ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఇందుకు పరిష్కారంగా ఐదుదీపాలిచ్చే కాంతిని ఒకే దీపం ఇచ్చేలా వినూత్నమైన స్ట్రీట్‌లైట్లని కనిపెట్టింది. దేశవ్యాప్తంగా వీటిని అమరుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  మరోసారి ఎగబాకిన ఇంధన ధరలు

దేశంలో ఇంధన ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 38పైసల వరకు పెంచాయి. ఇటీవల దేశంలో ఇంధన ధరలు వరుసగా 12 రోజులు పెరిగిన విషయం తెలిసిందే. ఆ వరుస పెరుగుదలకు రెండు రోజులు విరామం ఇచ్చి..అనంతరం ఈ రోజు మళ్లీ పెరగడం గమనార్హం. దిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.93గా, డీజిల్‌ ధర రూ.81.32గా నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాలుగు నెలల కిందటే పన్నాగం

శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడంటారు. వామన్‌రావు దంపతుల విషయంలో ప్రధాన నిందితులైన బిట్టు శ్రీను, కుంట శ్రీనులు అలాగే మిత్రులయ్యారు. తాను ఛైర్మన్‌గా ఉన్న ట్రస్టు ఆగిపోయేలా చేయడం.. పంచాయతీలో నెలనెలా రూ. 30 వేలు తెచ్చిపెడుతున్న చెత్త వాహనాన్ని అడ్డుకోవడం తదితర కారణాలతో బిట్టు శ్రీను శత్రుత్వం పెంచుకోగా.. కుంట శ్రీను తాను నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి గుడి నిర్మాణం అక్రమమని ఫిర్యాదు చేయడంతో వామన్‌రావు, నాగమణి దంపతులపై కక్ష పెంచుకున్నారు. అలా తమ ఉమ్మడి శత్రువైన వామన్‌రావును చంపాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భార్యను గొడ్డలితో నరికాడు.. తెల్లారేదాకా అక్కడే కూర్చున్నాడు!

9. నా నటనతో... ఆ పేరు మార్చేసుకుంటా!

అలా కన్నుగీటేసి... ఇలా కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపిన అందం... ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అంతర్జాలంలో వైరల్‌ అయిన ఆ ఒక్క వీడియోతో ఈమె జీవితమే మారిపోయింది. తొలి అడుగుల్లోనే దక్షిణాది మొదలుకొని బాలీవుడ్‌ వరకు    పలు భాషల్లో నటించింది. ఇటీవల నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘చెక్‌’లో ఓ కథానాయికగా నటించిందీమె. ‘చెక్‌’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇషాంత్‌.. ఓ పని యంత్రం

అతడి గణాంకాలు అంత గొప్పగా ఉండకపోవచ్చు! అతడి పేరిట చెప్పుకోదగ్గ రికార్డులు లేకపోవచ్చు! భారత క్రికెట్‌ చరిత్రలో ఉత్తమ ఫాస్ట్‌బౌలర్ల గురించి మాట్లాడుకున్నపుడు అతడి ప్రస్తావన రాకపోవచ్చు! కానీ ఇషాంత్‌ శర్మ భారత క్రికెట్‌కు చేసిన సేవల్ని మాత్రం తక్కువ చేయలేం. కపిల్‌ దేవ్‌ తర్వాత వంద టెస్టులు ఆడిన భారత ఫాస్ట్‌బౌలర్‌గా ఇషాంత్‌ అరుదైన ఘనత అందుకోబోతుండటం వెనుక అతడి ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని