close

తాజా వార్తలు

Published : 26/02/2021 08:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. డబ్బు కొట్టు.. జీఆర్‌ఈ పట్టు!

అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించాలి.. ఆస్తులు కూడగట్టుకోవాలి.. వీటన్నింటికీ తొలిమెట్టు జీఆర్‌ఈ. అక్కడ ఉన్నత విద్య చదవాలంటే ముందుగా గ్రాడ్యుయేట్‌ రికార్డు ఎగ్జామినేషన్‌ (జీఆర్‌ఈ)లో మంచి స్కోరు సాధించాలి. దానికి కనీసం రెండు మూడు నెలలు సిద్ధం కావాలి. కానీ.. అసలేమీ చదవకుండానే 300 మార్కులు తెప్పిస్తామని, అందుకు ఓ 40వేలు చెల్లిస్తే చాలని చెప్పే సంస్థలు పుట్టుకొచ్చాయి. అదే 330 మార్కులు కావాలంటే లక్షా పాతికవేలు కట్టాలి! తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలమంది ఇలా అక్రమమార్గంలో జీఆర్‌ఈ స్కోరు సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కత్తి దూస్తున్న సంబంధం

2. టీకా.. రూ. 500?

ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా పొందేవారికి ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటులో  వేయించుకునేవరు మాత్రం కొంత డబ్బు చెల్లించాలని స్పష్టం చేయడంతో.. ఖరీదు ఎంత ఉండొచ్చనేది చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 60 ఏళ్ల పైబడినవారు, 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సుమారు 55 లక్షలమంది ఉంటారని వైద్యవర్గాలు అంచనా వేస్తుండడంతో.. వీరిలో ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు పొందేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండొచ్చని వైద్యశాఖ అంచనా వేస్తోంది. ఒక్కో డోసు ఖరీదు సుమారు రూ. 500 లోపే ఉండొచ్చని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అమెరికా వెళ్తారా? ఇక్కడ రెక్కలు తొడుగుతారు!

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అమెరికా చదువు మరింత చేరువ కానుంది. ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సంస్థ విద్యార్థులకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేసేందుకు నిపుణులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. అమెరికన్‌ కార్నర్‌ పేరుతో ప్రస్తుతం అందిస్తున్న సేవలను విస్తృతం చేయనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని వై-యాక్సిస్‌ ఫౌండేషన్‌తో ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ఒప్పందం చేసుకుంది. ఈ సేవలను వచ్చేనెల 5 నుంచి ప్రారంభించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సిలిండర్‌ ధర పెరిగినా.. రాయితీ అంతే

గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్‌ ధర గణనీయంగా పెరిగినప్పటికీ రాయితీ మాత్రం పెరగలేదు. ప్రతివారం ధరల పెంపులో భాగంగా ఈ నెలలో ఇప్పటివరకు మూడు దఫాలుగా సిలిండర్‌పై రూ.100 వడ్డన విధించింది. ఈ నెల ప్రారంభం నుంచి రూ.40.71 రాయితీని మాత్రమే కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు అందజేస్తోంది. తాజా పెంపుదలతో ప్రస్తుతం గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌(14.2 కిలోలు) ధర రూ.846.50కు చేరింది. గడిచిన ఏడాది 702.00 సిలిండర్‌ ధర ఉన్నపుడు రూ.40.71 పైసలు రాయితీ ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!

అదో విలాసవంతమైన హోటల్‌.. సంపన్నులు బస చేసే ప్రత్యేక గది. రోజుకు అద్దె రూ.50 వేలు.. ఇతరత్రా ఖర్చులు మరో రూ.50 వేలు.. అంటే రోజుకు రూ.లక్ష.. అలాంటి చోట నలబై రోజులుండి రూ.40 లక్షలు చెల్లించారు. వాళ్లెవరో కోటీశ్వరులు కాదు.. వ్యాపారవేత్తలూ కాదు. ఐపీఎస్‌ అధికారిగా ప్రియుడు.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌గా ప్రియురాలు పరిచయం చేసుకొని బాచుపల్లి ఠాణా పరిధిలో ఓ వ్యాపారికి రూ.11.5 కోట్లు టోకరా వేసిన కేటుగాళ్లు. ఈ కేసులో విస్తుపోయే అంశాలు ఎన్నో దర్యాప్తులో వెలుగు చూడటంతో ఔరా అంటూ సైబరాబాద్‌ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3 రాజధానులకు ఆరాటపడుతున్నాం

6. అమ్మ పాలు... నిండు నూరేళ్ల్లు!

అమ్మపాలు ఆరోగ్యమని మనందరికీ తెలుసు. అవి బిడ్డ ఎదుగుదలకు పోషకాల్ని అందించడమే కాదు...వారి ఆయుష్షునీ, ఆరోగ్యాన్నీ కూడా పెంచుతాయి. ఈ విషయాలనే నొక్కి చెబుతూ తమ పరిశోధనతో మరిన్ని కొత్త విషయాలను తెలుసుకున్నారు మాంట్రియల్‌, గ్వాటెమాలకు చెందిన పరిశోధకులు. తల్లిపాలు ఎక్కువకాలం తాగే పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు, మరణాల ముప్పు తక్కువ. చనుబాలలో ప్రత్యేకంగా ఉండే హ్యూమన్‌ ఒలిగోసాకరైడ్లు(చక్కెరలు) పేగులో హానికారక బ్యాక్టీరియాను తగ్గించి మంచి వాటిని వృద్ధి చెందేలా చేస్తాయి. ఈ మంచి బ్యాక్టీరియా బిడ్డ ఆరోగ్యానికి రక్షణ గోడలా నిలబడుతుందంటోంది ఈ అధ్యయనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డిపాజిట్‌..నెలనెలా వెనక్కి...

మనం రుణం తీసుకుంటాం.. వడ్డీతో కలిపి నెలనెలా వాయిదాలు చెల్లిస్తాం.. నిర్ణీత కాలం తర్వాత ఆ అప్పు సున్నా అవుతుంది.. ఇదే రీతిలో బ్యాంకుకు మనం అప్పు ఇచ్చినప్పుడు వడ్డీ సహా మనకు కొంత అసలునూ చెల్లించే ఏర్పాటు ఉంటే.. అదే... స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాన్యుటీ డిపాజిట్‌ పథకం అవుతుంది. ఇటీవల కాలంలో కొన్ని కారణాలతో ఈ పథకం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ పథకం ఏమిటి? అది ఎలా పని చేస్తుందో చూద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రభుత్వ బాండ్లు..ఆకర్షణీయమేనా?

8. తండ్రి తరఫు వారసులకూ తన ఆస్తిని పంచొచ్చు

హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలు తమ తండ్రి వారసులకు ఆస్తిని పంచి ఇవ్వొచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని పరాయి వ్యక్తులుగా చూడలేమని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 15(1)(డి)ని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆ సెక్షన్‌ ప్రకారం.. హిందూ మహిళ తన తండ్రి తరఫు వారసులకు కూడా ఆస్తిని పంచవచ్చునని తెలిపింది. ‘కుటుంబం’ అనే పదాన్ని విస్తృత భావనలో అర్థం చేసుకోవాలని.. కేవలం దగ్గరి బంధువులు / చట్టబద్ధ వారసులే అందులోకి వస్తారని భావించడం సరికాదని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆఖరి 20నిమిషాలు.. ఎవరూ ఊహించలేరు

‘‘మూస కథలతో సినిమాలు చేస్తామంటే ఇప్పుడెవరూ చూడట్లేదు. ముఖ్యంగా కొత్తగా తెరపైకి వచ్చిన నాలాంటి హీరోలు.. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తేనే బాగుంటుంది. విజయ్‌ సేతుపతి, ఆయుష్మాన్‌ ఖురానా లాంటి వాళ్లంతా ఇదే పంథాలో నడిచొచ్చి స్టార్లుగా మారారు. అందుకే నేనూ విభిన్న కథాంశాలతోనే మంచి నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నా’’ అన్నారు ఉదయ్‌ శంకర్‌. ‘ఆటగదరా శివ’, ‘మిస్‌ మ్యాచ్‌’ లాంటి చిత్రాలతో.. తొలి అడుగుల్లోనే సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన కథానాయకుడాయన. ఇప్పుడు ‘క్షణ క్షణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అయ్య స్పిన్నోయ్‌!

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 112 ఆలౌట్‌. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 145 ఆలౌట్‌. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 0/2. చివరికి 81 పరుగులకు ఆలౌట్‌. నిండా రెండు రోజులైనా ఆట సాగలేదు. 140 ఓవర్ల ఆటలోనే 30 వికెట్లు! ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో బ్యాట్స్‌మెన్‌ ఎంత కష్టపడ్డారో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.కొత్త స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  ముమ్మాటికీ పిచే! బంతిని సరిగ్గా డిఫెండ్‌ చేసినా  హమ్మయ్యా అనుకోవాల్సిన పరిస్థితిలో బ్యాట్స్‌మెన్‌ కాసిన్ని బంతుల్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పృథ్వీ షా 227 నాటౌట్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని