close

తాజా వార్తలు

Published : 02/03/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. బీమాసురులు

అదొక భయంకరమైన ముఠా. ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు.. కరడుగట్టిన హంతకులు.. ఇందులో సభ్యులు. వారికి కొందరు బ్యాంకు సిబ్బంది కూడా జత కలిశారు. అంతా కలిసి డబ్బు కోసం కిరాతక కార్యాలకు తెరలేపారు.. ఈ ముఠా సభ్యులు ముందుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి పేరుతో లక్షల రూపాయలకు బీమా చేస్తారు. ఒకట్రెండు కిస్తీలు తామే కట్టేస్తారు. కుటుంబ సభ్యుల (నామినీ)తో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత వీళ్ల ముఠాలోని కొందరు అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని హత్య చేసి.. రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఎలా?

గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ఎలా ప్రారంభించాలనే దానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. సచివాలయాలన్నింట్లో ఒకేసారి ప్రారంభించాలా... దశల వారీగానా? రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే చోట్లనే మొదలుపెట్టాలా? మండల కేంద్రాల్లో ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? అనే అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాదిరి గ్రామ సచివాలయాల్లో భూములు, ఇళ్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలంటే రూ.800 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కట్టారు..కూలగొట్టారు!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన ఆలయం దశాబ్దాల కిందట ఎలా ఉందో... ఇప్పుడూ అచ్చం అలాగే ఉంది. కొండపై ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, మల్లేశ్వరస్వామి గుడి తప్ప చెప్పుకోదగ్గవి ఇంకేమీ లేవు. కొండపై గత పదిహేనేళ్లలో రూ.కోట్లు వెచ్చించి అనేక భవనాలు నిర్మించారు. కానీ... కట్టిన వాటిని కట్టినట్లే దాదాపు అన్నీ కూల్చేశారు. ఆలయానికి ఈవోలు మారిన ప్రతిసారీ.. అభివృద్ధి పేరిట కొత్తగా నిర్మాణాలను చేపట్టడం... పాత వాటిని కూలగొట్టడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా గత పదేళ్లలో పది మంది ఈవోలు మారారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా టీకా తీసుకోం

 కరోనా టీకాను తాము తీసుకోబోమని సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న రైతు నేతలు స్పష్టం చేశారు. అయితే, ధర్నాల్లో పాల్గొంటున్న వారెవరైనా తీసుకుంటామంటే అభ్యంతరపెట్టబోమని తెలిపారు. ఇది వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు. శిబిరాల్లో వ్యాక్సినేషన్‌ను అడ్డుకోబోమని చెప్పారు. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన వేల మంది రైతులు గత మూడు నెలలకు పైగా సింఘు, గాజీపుర్‌, టిక్రీ సరిహద్దుల్లోని శిబిరాల్లో ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కొవిడ్‌ టీకా సమాచారమే లక్ష్యం!

5. కొత్త అందాలకెళితే ఉన్న రంగుపోయింది

అందానికి మెరుగులు దిద్దుకోవాలని లేసర్‌ క్లినిక్‌కు వెళితే ఉన్న సహజ రంగునే కోల్పోయిన టీవీ తారకు సొమ్ము వాపసు ఇవ్వడమేగాక పరిహారంగా రూ.50 వేలు చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. కేసు వివరాలను పరిశీలిస్తే.. ముఖంపై చిన్నపాటి ముడతలకు చికిత్స, జుట్టుకు రంగు నిమిత్తం సికింద్రాబాద్‌కు చెందిన టీవీ తార బి.నిర్మల అలియాస్‌ మేఘన హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని లావినో కాస్మొటిక్‌ అండ్‌ లేసర్‌ క్లినిక్‌కు వెళ్లారు. 45 రోజుల చికిత్సలో భాగంగా రూ.62 వేలు చెల్లించాలని, స్పష్టమైన ఫలితాన్ని చూపిస్తామని క్లినిక్‌ ఆమెకు హామీ ఇచ్చింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆవు పేడ రక్షణకు సీసీటీవీ కెమెరాలు!

ఆవు పేడ రక్షణకు సీసీటీవీ కెమెరాలేంటా అని ఆశ్చర్యపోకండి? ఛత్తీస్‌గఢ్‌లో ఆవు పేడకు అంత డిమాండ్‌ ఉంది మరి! ఆ రాష్ట్ర ప్రభుత్వం 2020లో గౌ-దాన్‌ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. కిలో ఆవు పేడను రూ.2కి కొనుగోలు చేస్తామని పేర్కొంది. అప్పటి నుంచి ఆవు పేడకు విపరీతమైన డిమాండ్‌. పలితంగా దొంగతనాలూ పెరిగాయి. తాజాగా అంబికాపుర్‌ మున్సిపాల్టీలో స్థానిక ప్రభుత్వ గౌ-దాన్‌ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భ్రమల ఊబి

ఊహ వేరు. నిజం వేరు. కల్పన వేరు. వాస్తవం వేరు. కాకతాళీయంగా కొన్నిసార్లు ఊహలు నిజం కావొచ్చు. కల్పన వాస్తవం కావొచ్చు. అంతమాత్రాన ప్రతి ఊహా నిజమవుతుందని అనుకోవటం భ్రమే. మరి ఊహే నిజమని నమ్ముతుంటే? ఆ మాటకొస్తే ఊహకు నిజానికి మధ్య తేడాను అసలే గుర్తించలేని స్థితిలో పడిపోతే? భ్రమల జబ్బు (డెల్యూజనల్‌ డిజార్డర్‌) అలాంటి మానసిక సమస్యే. మొదట్లో ఆలోచనలకే పరిమితం కావొచ్చు గానీ తీవ్రమైతే ప్రమాదకర చర్యలకూ దారితీస్తుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కాలేయంపై కొవ్వు ప్రమాదమే

8. కాళ్లు చేతులు కట్టి..తుప్పల్లో పడేశారు

విజయనగరం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసిన సంఘటన గంటకో మలుపు తిరుగుతోంది. తన బాబాయి ఇంటికి వెళ్తానని శుక్రవారం కళాశాల నుంచి బయల్దేరిన ఆమెను ఎవరు తీసుకొచ్చి పడేశారనేది మిస్టరీగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు స్పృహ రావడంతో... విచారణలో పోలీసులకు కొన్ని వివరాలను వెల్లడించిందని సమాచారం. ‘నేను బాబాయి ఇంటికి వెళ్లకుండా నేరుగా తెర్లాంకు ఆటోలో బయలుదేరా. అప్పటికే అందులో ముగ్గురు అబ్బాయిలు ఉండగా దిగిపోదామనేసరికి వారు బలవంతంగా నన్ను మరో క్యాబ్‌లోకి ఎక్కించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఓ చేత్తో బీరుసీసా..మరో చేత్తో స్టీరింగ్‌

అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మద్యం మత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. పెనుగొండ మండలం ఎర్రమంచి సమీపంలోని కియాకార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద ఈదుర్ఘటన జరిగింది. ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొని నలుగురు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్‌ బ్రేకర్ వద్ద ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం నెమ్మదించడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వన్డే సిరీస్‌కు రోహిత్‌ దూరం?

ఐపీఎల్‌ 2021కు ఇంకా ఎంతో సమయం లేదు. ఇంకా తేదీలు ప్రకటించలేదు కానీ.. ఏప్రిల్‌ రెండో వారంలో టోర్నమెంట్‌ ఆరంభమయ్యే అవకాశముంది. భారత్‌లోనే  జరుతుందని భావిస్తున్న ఐపీఎల్‌కు ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లందరూ తాజాగా  ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఈ క్రమంలోనే 2020 ఐపీఎల్‌ (సెప్టెంబరు 19) నుంచి బయో బబుల్‌ ఉంటున్న 10 మంది ఆటగాళ్లలో సాధ్యమైనంత ఎక్కువమందికి విశ్రాంతి ఇవ్వాలని చూస్తోంది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇటీవలే జట్టును ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని