
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. అమ్మకానికి అడుగులు
విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ వైపు భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా పరిశ్రమ ఉన్నతాధికారులు విక్రయ ప్రక్రియలో అడుగులు ముందుకేస్తున్నారు. పరిశ్రమకు (ఆర్ఐఎన్ఎల్) నగరం నడిబొడ్డులో ఉన్న మద్దిలపాలెం, అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన సీతమ్మధార ప్రాంతానికి చేరువలో ఉన్న 22.19 ఎకరాల భూమి అప్పగింతకు రంగం సిద్ధం చేశారు. ఆ ప్రాంతంలో దశాబ్దాల కిందట కర్మాగార ఉద్యోగుల కోసం చేపట్టిన 830 క్వార్టర్లు శిథిలమయ్యాయి. ఆ భూమిలో వ్యాపార, నివాస సముదాయాలను నిర్మించి విక్రయించాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
2. స్టాంపు డ్యూటీ పెంపు?
ఆస్తుల బదిలీ (దస్తావేజుల రిజిస్ట్రేషన్) కోసం వసూలు చేసే స్టాంపు సుంకాన్ని (డ్యూటీ) పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో సుమారు 25 నుంచి 30 రకాల స్టాంపు డ్యూటీలు అమల్లో ఉన్నాయి. దస్తావేజులోని ఆస్తి విలువ, రకాన్ని బట్టి 1% నుంచి 5% వరకు ప్రభుత్వం సుంకం వసూలు చేస్తోంది. ఇకపై వీటిని రెండు స్లాబుల (5%, 2%) కింద వర్గీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీపై అధ్యయనం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. బెధరగొడుతున్నారు..
రైతు బజారుకు వెళ్తే.. తక్కువ ధరకు కూరగాయలు దొరుకుతాయి.. వారానికి సరిపడా తెచ్చుకోవచ్ఛు ఇలాంటి నమ్మకాలకు రైతు బజార్లు తిలోదకాలిచ్చాయి. రైతుల్లేని రైతు బజార్లుగా పేరు పడడం ఒకటి అయితే.. బయటి దుకాణదారులే రైతుబజార్లలో కూరగాయలు అమ్ముతున్నారనేది మరో మాట. అందుకు ఉదాహరణ.. ఒకే కూరగాయ ఒక్కో రైతు బజారులో ఒక్కో ధర పలుకుతోంది. పక్కపక్క దుకాణదారులు కూడా వేర్వేరు ధరలకు అమ్మేస్తున్నారు. దుకాణాల్లో ధరల పట్టిక ఉన్నా.. అవి పేరుకే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పేలిపోయిన స్టార్‌షిప్
భవిష్యత్ అంతరిక్షయాత్రల కోసం అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ‘స్టార్‌షిప్’ రాకెట్ ప్రయోగం చివరి దశలో విఫలమైంది. నిర్దేశిత రీతిలో ల్యాండింగ్ ప్యాడ్‌పై సాఫీగానే దిగిన ఈ రాకెట్.. ఆ వెంటనే పేలిపోయింది. గతంలో నిర్వహించిన రెండు ప్రయోగాలూ ఇలాగే విఫలమయ్యాయి. టెక్సాస్ నుంచి జరిగిన తాజా ప్రయోగంలో స్టార్‌షిప్.. 10 కిలోమీటర్ల ఎత్తులోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మెక్సికో అగాథం దిశగా నిట్టనిలువుగా దిగడం మొదలుపెట్టింది. అక్కడ ఏర్పాటు చేసిన ల్యాండింగ్ ప్యాడ్‌పై చక్కగానే దిగింది. అయితే .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* అంగారకుడి విస్పష్ట చిత్రాలను పంపిన చైనా వ్యోమనౌక
5. అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
‘మొగలి రేకులు’ సీరియల్లోని ఆర్కేనాయుడి పాత్రలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంత చేసుకున్నారు నటుడు సాగర్. ప్రస్తుతం సాగర్ సీరియల్స్ మానేసి సినిమాల బాటలో పయనిస్తున్నారు. గతంలో ‘సిద్ధార్థ’ అనే సినిమాలో హీరోగా నటించినా ఆశించిన బ్రేక్ రాలేదు. దీంతో ‘షాదీ ముబారక్’ అంటూ ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌పై మార్చి 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నటుడు సాగర్ సినిమా విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. బ్రిటన్ రకంతో పెరగనున్న కొవిడ్ కేసులు
చీజి బ్రిటన్‌లో మొదటిసారిగా వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ వల్ల కొవిడ్-19 కేసులు భారీ సంఖ్యలో పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతమున్న ఇతర రకాలతో పోలిస్తే ఈ రకం చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని వివరించింది. ‘లండన్ స్కూల్ ఆఫ్ హైచ్కీజీజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. బ్రిటన్‌లో విద్యా సంస్థలను పరిమిత స్థాయిలో మూసివేయడం, టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టకుంటే ఇంగ్లండ్‌లో కరోనా బాధితులు మరణాలు గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* టీకా తీసుకున్న మరుసటి రోజే హఠాన్మరణం
7. స్థల వివాదాలు.. సామాన్యులే సమిధలు!
రాష్ట్రంలో.. ముఖ్యంగా రాజధానిలో జరుగుతున్న భూ దందాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎందరో అమాయకులు ఈ వలలో పడి విలవిల్లాడుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు ఒకరు.. కాపాడుకునేందుకు మరొకరు.. ఇద్దరి మధ్య జరిగే పోరాటాన్ని అడ్డంపెట్టుకొని కాసులు రాబట్టుకునేందుకు ఇంకొకరు. వెరసి సొంతిల్లనే సుందర స్వప్నం సామాన్యులకు పీడకలగా మారుతోంది. రాష్ట్రంలో ఏ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించినా.. భూ వివాదాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది. స్థిరాస్తిని అడ్డంపెట్టుకొని జరుగుతున్న మోసపూరిత వ్యాపారం కళ్లకు కడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చక్కెర వ్యాధి.. ఆహార ప్రణాళిక ఏంటి?
స్త్రీలలో మధుమేహం రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. చర్మ సమస్యలు, సంతానలేమితో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి దీన్ని అదుపులో పెట్టుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండాలంటే... ఆహారంలో మార్పులు, మందులు వాడటం, వ్యాయామం తప్పనిసరి. అధిక బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. అలాగే తక్కువగా ఉన్నవారు సరైన బరువుకు రావాలి. సమతులపోషకాహారంపై దృష్టి పెట్టాలి. పీచు ఉండే పదార్థాలను తింటే రక్తంలో ఒకేసారి చక్కెర స్థాయులు పెరగవు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మీ ఇంట్లో బంగారముంది
ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా తెలుసు కదా.. అందులో మీది తెనాలి.. మాది తెనాలి అంటూ బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు ఏవీఎస్‌ను బోల్తా కొట్టించి రెట్టింపు చేస్తామంటూ ఒంటిపై ఉన్న బంగారమంతా కొట్టేసే సన్నివేశం గుర్తుంది కదా.. అచ్చం ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం నలుగుర్ని అరెస్ట్ చేసి రూ.5.85 కిలోల నకిలీ బంగారం, రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను గురువారం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అదే మాయ..
ఇంగ్లాండ్‌ను మరోసారి టాస్ కరుణించింది. కానీ భారత స్పిన్నర్లు మాత్రం దయతలచలేదు. గత మ్యాచ్‌లో అంత కాకపోయినా మంచి టర్న్, బౌన్స్ లభించిన పిచ్‌పై అక్షర్, అశ్విన్ మాయ చేసిన వేళ.. తొలి రోజు టీమ్ఇండియా పైచేయి సాధించింది. బ్యాట్స్‌మెన్ మరోసారి తడబడ్డా.. ఇంగ్లాండ్ అయిదు ఇన్నింగ్స్‌ల తర్వాత ఎట్టకేలకు రెండొందలు దాటగలిగింది. కానీ ఆ స్కోరుతో కోహ్లీసేనను అడ్డుకోవడం కష్టమే..! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి