close

తాజా వార్తలు

Published : 22/01/2021 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. తొలిరోజే కీలక ఆదేశాలు!

అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే... కీలకమైన 15 కార్యనిర్వాహక ఆదేశాలపై జో బైడెన్‌ సంతకాలు చేశారు. వీటిలో చాలామటుకు... జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు సంబంధించి ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను రద్దు లేదా మార్పు చేస్తూ జారీ చేసినవే. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో అమెరికాను తిరిగి భాగస్వామిని చేయడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగుతూ ట్రంప్‌ ఇచ్చిన ఉత్తర్వుల నిలుపుదల, ముస్లింల వలసలపై నిషేధం రద్దు, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం నిలుపుదల వంటివి ఇందులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బైడెన్‌ జీతం నెలకు 7 వేల డాలర్లు

2. మే 20 నుంచి ‘పది’ పరీక్షలు?

దో తరగతి వార్షిక పరీక్షల్ని మే 20 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇంటర్‌మీడియట్‌ ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 19వ తేదీకి పూర్తవుతాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలను మే 20 నుంచి ప్రారంభించి 29వ తేదీతో పూర్తి చేయాలని భావిస్తున్నారు. మేలో అధిక ఎండల కారణంగా విద్యార్థులకు సమస్య అవుతుందని ప్రభుత్వం భావిస్తే జూన్‌ మొదటి వారంలో ప్రారంభించేందుకు అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అది మా భూభాగం!

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించడాన్ని చైనా అడ్డంగా సమర్థించుకుంది. అది తన భూభాగమని బుకాయించింది. సొంత నేలపై తాను అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టడం సహజమేనని పేర్కొంది. దానిపై విమర్శలు అనవసరమని తెలిపింది. ‘‘జాంగ్‌నాన్‌ (దక్షిణ టిబెట్‌)కు సంబంధించి మా వైఖరి సుస్పష్టం. సదరు అరుణాచల్‌ ప్రదేశ్‌ను మేం ఎన్నడూ గుర్తించలేదు’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యుంగ్‌ గురువారం ఇక్కడ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మోసాలపై గప్‌‘చిప్‌’

ట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో మోసాలకు పాల్పడుతున్న బంకు యజమానులపై చర్యలు నామమాత్రమవుతున్నాయి. పెట్రోల్‌ బంకుల్లో చిప్‌లు అమర్చి ఇంధనం తక్కువగా వచ్చేలా మోసాలకు పాల్పడితే కఠినచర్యలు ఉండవని తూనికలు కొలతల(తూ.కొ.)శాఖ కొత్త భాష్యం చెబుతోంది. అలాంటి మోసగాళ్లను న్యాయస్థానంలో ప్రాసిక్యూట్‌ చేసే అధికారం తమకు లేదని, జరిమానాలతో సరిపెట్టడం మినహా కేసు పెట్టలేమని చేతులెత్తేస్తోంది. మోసాలకు పాల్పడ్డ బంకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) స.హ.చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆ శాఖ అధికారులు ఇదే సమాధానం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సింగరేణిలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

కొత్తగూడెం సింగరేణి, గోదావరిఖని-న్యూస్‌టుడే: సింగరేణిలో ఈ ఏడాది తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. 651 ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల సింగరేణి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ప్రకటించారు. తొలి విడత 372 ట్రైనీ ఉద్యోగాలకు ఆ సంస్థ నోటిఫికేషన్‌ జారీచేసింది. 128 ఫిట్టర్‌, 51 ఎలక్ట్రీషియన్‌, 54 వెల్డర్‌, 22 టర్నర్‌/మెషినిస్టు, 14 మోటారు మెకానిక్‌, 19 ఫౌండ్రీమెన్‌/మౌల్డర్‌, 84 జూనియర్‌ స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి

కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ కె.బి.శివకుమార్‌ ​తెలిపారు. మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు ఓ ట్రక్కులో తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులంతా బిహార్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఊరట లభిస్తుందా?

కరోనా మహమ్మారితో ప్రజల  ఆదాయాలు తగ్గాయి.. ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోయింది. ప్రజల చేతిలో కాస్త మిగులు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకోదగ్గ చర్యల్లో కీలకమైంది ‘పన్నుల భారం తగ్గించడమే’. ఆత్మనిర్భర్‌ భారత్‌తో పలు రంగాలకు చేయూతనిచ్చిన ప్రభుత్వం, కొత్త బడ్జెట్‌లో  సామాన్యులకు ఊరట కల్పించేలా ఏం చర్యలు తీసుకుంటుంది.. ఆదాయపు పన్ను రాయితీలు పెంచుతుందా.. అనే విషయమై చర్చోపచర్చలు  సాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గీత దాటితే...ప్రీమియం ప్రియం

8. రెండు రకాలుగా పేరు తెచ్చుకోవాలి

స్వచ్ఛమైన వినోదాలకు నెలవు అల్లరి నరేష్‌ చిత్రాలు. నవ్వులు పంచడమే కాదు.. ‘గమ్యం’, ‘మహర్షి’ వంటి సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకుల గుండెల్ని బరువెక్కిస్తుంటారాయన. ఇప్పుడు ‘బంగారు బుల్లోడు’గా మరోసారి తనదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. గిరి పాలిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. పూజా జవేరి కథానాయిక. జనవరి 23న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నరేష్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.50 అప్పు... ప్రాణం తీసింది

రూ.50 అప్పు వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. మూడు జీవితాలను రోడ్డు పడేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ ఎ.రఘుపతిరావు తెలిపిన ప్రకారం... స్థానిక పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ బాజి(27) ఆటోనగర్‌ ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నారు. రాత్రిపూట శ్రీలక్ష్మీ మారుతి పాల ఉత్పత్తుల విక్రయ దుకాణంలో పనిచేస్తున్నారు. 15 రోజుల కిందట రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన యువకుడు పల్లపు కోటివీరయ్య.. సిగరెట్లు, నీళ్లసీసా తీసుకుని, రూ.50 బిల్లును ఫోన్‌పే చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇండియా అంటే ఇది: సెహ్వాగ్‌ 

ఆస్ట్రేలియాలో అద్భుత విజయం సాధించి తిరిగొచ్చిన టీమ్ఇండియా పేసర్‌ నటరాజన్‌కు సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న అతడు తర్వాత రోడ్డు మార్గంలో తమిళనాడులోని సాలెం జిల్లా చిన్నప్పంపట్టి స్వగ్రామానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడికి నీరాజనాలు పట్టారు. పూలమాలలు, డప్పువాయిధ్యాలతో స్వాగతం పలికారు. రథంపై ఊరేగిస్తూ సందడి చేశారు. నటరాజన్‌ అక్కడి వారికి అభివాదం చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. 
పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని