close

తాజా వార్తలు

Published : 01/03/2021 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. 14 చోట్ల నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం

గత మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. చిత్తూరు, కడప జిల్లాల్లోని మొత్తం 14 చోట్ల కొత్తగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులకు అవకాశం కల్పించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పలుచోట్ల తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుమతించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో 6, పుంగనూరు 3, కడప జిల్లా రాయచోటిలో 2, ఎర్రగుంట్ల 3 వార్డుల్లో అవకాశం కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ప్రతిపక్షనేత ప్రజల్లోకి వెళ్తుంటే భయమెందుకు?’

రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవడాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళుతుంటే ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా గెలిచామంటున్న వైకాపా పెద్దలు.. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో భయపడేందుకు కారణమేంటని నిలదీశారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని సీఎం జగన్‌కు ఆయన సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలి: ఉత్తమ్‌

రాష్ట్రానికి తెరాస, భాజపా తీరని ద్రోహం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. భాజపా మతం పేరుతో లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. గాంధీభవన్‌లో పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల మండలి నియోజకవర్గ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు. భాజపా, తెరాస నేతలు రూ.వందలకోట్లు దోచుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలివే..

కరోనా వైరస్‌ నివారణకు దేశ వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. మార్చి 1 నుంచి 60 ఏళ్లు దాటిన వారికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ప్రైవేటు టీకా పంపిణీ కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం కాగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌కు రూ.250ల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సుప్రీంకోర్టు జడ్జీలకు రేపటి నుంచి టీకా

5. ఆ మూడు దేశాల నుంచే 213 స్ట్రెయిన్‌ కేసులు..

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.  రోజూవారీ కేసులు కొంతమేరకు తగ్గాయి. అయితే యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్‌ కరోనా స్ట్రెయిన్‌ కేసులు దేశంలో పెరిగిపోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. యూకే స్ట్రెయిన్‌ 19 కొత్త  కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు ఆ దేశం నుంచి వచ్చిన వారిలో మొత్తంగా 187 మంది వైరస్‌ బారిన పడ్దారని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అందుకే ‘వైల్డ్‌డాగ్‌’ అని పెట్టాం: నాగార్జున

నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నాగార్జున ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నారు. సయామీ ఖేర్‌, దియా మీర్జా, అతుల్‌ కుల్‌కర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న థియేటర్‌లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉద్యమాన్ని అణచివేసేందుకే ఈ నిశ్శబ్దం

శాంతియుతంగా రైతులు చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ తమను మరోసారి చర్చలకు ఆహ్వానించలేదని ఆయన మండిపడ్డారు. ‘‘ ప్రభుత్వం గత 20 రోజులుగా నిశ్శబ్దంగా ఉంది. ఏదో జరగబోతోందని అనిపిస్తోంది. మా ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనిపిస్తోంది.’’ అని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 4 గంటలు.. టీకా కోసం 10లక్షల మంది నమోదు

కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశంలో రెండో దశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఇందుకోసం కొవిన్‌ పోర్టల్‌ను ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి తీసుకురాగా.. తొలి రోజే విశేష స్పందన లభించింది. కేవలం 4 గంటల్లోనే 10లక్షల మందికి పైగా పేరు నమోదు చేసుకున్నారు. కొవిన్‌ పోర్టల్‌ను ఈ ఉదయం 9 గంటలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 10లక్షల మందికి పైగా ఈ పోర్టల్‌ ద్వారా టీకా కోసం అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అపోహలు తొలగించేందుకే ముందుగా ప్రధానికి టీకా

9. ఐదో నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్టీ వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదో నెలా వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి మొత్తం రూ.1.13 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈ వసూళ్లు 7 శాతం పెరిగాయని పేర్కొంది. జనవరి నెలతో (1.19 లక్షల కోట్లు) పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రెచ్చిపోయన శార్దూల్‌: 57 బంతుల్లో 92

ముంబయి యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రెచ్చిపోయాడు. విజయ్‌ హాజారె వన్డే టోర్నీలో హిమాచల్‌ప్రదేశ్‌పై విధ్వంసం సృష్టించాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ కేవలం 57 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఆరు బౌండరీలు, ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థిపై విజయంలో కీలకంగా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అశ్విన్‌ సమయం వచ్చేసింది.. తీసుకోండి!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని