close

తాజా వార్తలు

Updated : 04/03/2021 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. విజయవాడ తెదేపా మేయర్‌ అభ్యర్థి ఖరారు

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిని తెదేపా ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను ఖరారును చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్‌ నుంచి బరిలో ఉన్నారు. 24 ఏళ్ల కేశినేని శ్వేత అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో బీఏ (సైకాలజీ, ఎకనామిక్స్‌) చేశారు. ఘనాలో మైక్రో ఫైనాన్స్‌ కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌.. ఐర్లాండ్‌లో చైల్డ్‌ సైకాలజీ ప్రోగ్రామ్‌లో ఆమె పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తిరుపతి ఏడో డివిజన్‌ ఎన్నిక రద్దు

2. ఆలయాలకు యాదాద్రి ఆదర్శం కావాలి: కేసీఆర్‌ 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన కొనసాగుతోంది. యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రహదారి, ఆలయంలోని అద్దాల మండపాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని.. భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలని చెప్పారు. మూలవిరాట్టుకు జరిగే సేవలు దూరం నుంచి కూడా కనిపించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేరళ భాజపా సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘మెట్రోమ్యాన్’ ఈ శ్రీధరన్‌ కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు భాజపా ప్రకటించింది. కేరళ భాజపా చీఫ్ కే సురేంద్రన్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే మిగతా అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తామని ఆయన అన్నారు. శ్రీధరన్ ఇటీవల భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కమలం పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వాట్సాప్‌: ఇకపై డెస్క్‌టాప్‌‌లోనూ ఆ ఫీచర్‌

ఇంట్లో ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న వాట్సాప్‌ యాప్‌లో ఛాట్‌ చేస్తున్నారు... ఇంతలోగా అవతలి వ్యక్తి మీకు కాల్‌ చేశారు. మొబైల్‌ చూస్తే ఛార్జింగ్‌లో ఉంది. కంప్యూటర్‌లో ఉన్న వివరాలు చూసుకుంటూ.. వాట్సాప్‌ వీడియో కాల్‌లో అవతలి వ్యక్తికి వివరాలు చెప్పాలి. ఇప్పుడైతే దీని కోసం సిస్టమ్‌, మొబైల్‌ రెండూ వాడాల్సిందే. అయితే ఈ ఇబ్బందులు త్వరలో మీకు ఉండవు. ఎందుకంటే డెస్క్‌టాప్‌ వాట్సాప్‌ యాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఓ చోట పొత్తులు.. ఇంకో చోట కత్తులు!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులూ ఉండరు అనేది నానుడి. రాజకీయాల్లో ఇద్దరు బద్ద శత్రువులో.. రెండు వైరి రాజకీయ పక్షాలు ఒక్కటైనప్పుడో ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. కానీ, ఒక చోట మిత్రుడిగా.. ఇంకో చోట ప్రత్యర్థిగా.. ఓ చోట స్నేహహస్తం అందిస్తూ.. మరో చోట ప్రత్యర్థికి ఆపన్నహస్తం అందించే కొత్త ట్రెండ్‌ ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్‌

తెరపై తన ఎనర్జిటిక్‌ నటనతో ప్రేక్షకులను ఉత్సాహపరిచి, తనదైన శైలిలో పంచులు పేలుస్తూ యూత్‌కు రాజ్‌తరుణ్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఒక ప్రత్యేక జోనర్‌ ఎంచుకుని ‘పవర్‌ ప్లే’తో మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీవితాలతో ఆడుకునే కథలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాలను రాజ్‌తరుణ్‌ ఇంటర్వ్యూలో వివరించారు. మరి ఆ కథేంటో చూద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అసభ్యత పెరిగిపోతోంది..పర్యవేక్షణ అవసరం

ప్లాట్‌ఫాంలలో ప్రసారమయ్యే వీడియోలపై పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన విచారణలో భాగంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. ‘‘ ప్రస్తుతం ఇంటర్నెట్‌, ఓటీటీల్లో సినిమాలు, వీడియోలు చూడటం చాలా సాధారణమైపోయింది. కాబట్టి దీనిపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని ప్లాట్‌ఫాంలలో అసభ్యకరమైన కంటెంట్‌ ప్రసారమవుతోంది.’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘కొవాగ్జిన్‌’కు ఆమోదం తెలిపిన జింబాబ్వే..!

భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌ టీకా తమ దేశంలో అత్యవసర వినియోగం కింద పంపిణీ చేసేందుకు ఆఫ్రికా దేశం జింబాబ్వే ఆమోదం తెలిపింది. దీంతో సాధ్యమైనంత తొందరగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని జింబాబ్వేలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కొవాగ్జిన్‌ టీకా 81శాతం సమర్థత కలిగినట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించిన మరుసటి రోజే జింబాబ్వే అనుమతించింది. దీంతో ఆఫ్రికాలో కొవాగ్జిన్‌ను ఆమోదించిన తొలి దేశంగా జింబాబ్వే నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సంక్షోభంలోనూ భారత్‌లో పెట్టుబడుల హవా

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడి సంక్షోభ సమయంలోనూ భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కాలంలో ఎఫ్‌డీఐలు 40శాతం పెరిగి దేశంలో 51.47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల విలువ 36.77 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రేపు ఎస్‌బీఐ మెగా వేలం

10. స్పిన్నర్లదే రాజ్యం.. ఆడితే పరుగులు

పిచ్‌.. పిచ్‌.. పిచ్‌.. నాలుగో టెస్టు పిచ్‌పై సందిగ్ధం తొలగిపోయింది! పట్టుదలతో ఆడిన బ్యాట్స్‌మెన్‌కు.. కట్టుతప్పని బౌలర్లకు అది సహకరించింది. స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్‌ (4/68), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/47) మాయాజాలానికి సిరాజ్‌ (2/45) పేస్‌ తోడవ్వడంతో ఇంగ్లాండ్‌ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. తొలిరోజు ఆట ముగిసే సరికి టీమ్‌ఇండియా 24/1తో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సిరాజ్‌పై స్టోక్స్‌ స్లెడ్జింగ్‌: రంగంలోకి కోహ్లీ!



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని