
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 PM
1. ఏపీ సీఎస్, డీజీపీకి నిమ్మగడ్డ లేఖ
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తొలగించాలని సూచించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ.. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఎస్ఈసీని కలిసిన పంచాయతీరాజ్ అధికారులు
2. ఇంతకన్నా మంచి ప్రతిపాదన లేదు: కేంద్రం
వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమావేశంలో రైతుల వ్యవహార శైలిపై కేంద్రమంత్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు. చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్.. 18 నెలల పాటు ఈ చట్టాలను ప్రతిష్టంబింపజేసే ప్రతిపాదనను మించింది ఏదీ తమవద్ద లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. భాజపా ఆందోళనలతోనే రిజర్వేషన్లు: బండి
భాజపా ఆందోళనల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఎప్పటి నుంచో అమలు చేస్తున్నా రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రెండేళ్లుగా వేలాది మంది అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల ఫలాలు దక్కలేదని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రెండేళ్లపాటు అన్యాయానికి గురి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అగ్రవర్ణ పేదలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
4. జూన్‌లో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు !
కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది జూన్‌లో కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో నిర్ణయం తీసుకున్నారని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం వెల్లడించారు. కొద్ది నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన అనంతరం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముఖుల్ వాస్నిక్, చిదంబరం వంటి సీనియర్ నేతలు మాత్రం వెంటనే సంస్థాగత ఎన్నికలు జరపాలని పట్టుబట్టినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* మాజీ సీజేఐ గొగొయ్‌కి జెడ్+ భద్రత
5. ‘కరోడ్పత్నీస్’.. ఈ సారి వాళ్లదే హవా!
మేనేజర్ నజియా నజీమ్.. ఐపీఎస్ అధికారి మోహితా శర్మ.. టీచర్ అనుపా దాస్.. డాక్టర్ నేహా షా.. వృత్తిపరంగా వేర్వేరు రంగాలకు చెందిన మహిళలు వీరు. కానీ, వీరి మధ్య ఓ సారూప్యత ఉంది. వీరంతా ఇప్పుడు కోటీశ్వరులు. సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి ఆశలు, కలలను సాకారం చేస్తున్న ప్రముఖ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ లో ఈ నలుగురూ చరిత్ర సృష్టించారు. ‘‘మహిళలు ఎవరికీ తీసిపోరు’’ అని చాటిచెప్పుతూ తమ ప్రతిభ, అదృష్టంతో ఒకే సీజన్లో వీరంతా కోటి రూపాయలు గెలుచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అన్ని మెసెంజర్లు ఒకే దాంట్లో!
ఎవరి ఫోన్లో చూసినా ఒకటి లేదా రెండు మెసెంజర్లు తప్పనిసరి. ఇప్పుడున్న ప్రైవసీ గోప్యత నేపథ్యంలో ఏది సరైంది అనిపిస్తే దాన్ని వాడేస్తున్నారు. ఎందుకిలా ఒక్కొక్కటి వాడడం అన్నింటినీ ఒకే దాంట్లో యాక్సెస్ చేస్తే బాగుంటుంది కదా! అని అనిపిస్తే ‘బీపర్’ యాప్‌ని వాడేయొచ్చు. ఇది వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్, ట్విట్టర్, స్లాక్.. ఇలా నెట్టింట్లో ఆదరణ పొందిన ఇంచుమించు అన్ని మెసెంజర్లను సపోర్టు చేస్తుంది. సుమారు 15 రకాల మెసెంజర్లను దీంట్లో సింక్ చేసుకుని వాడుకోవచ్చు. దీంట్లోని మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇప్పటి వరకూ యాపిల్ ఫోన్ల్లో మాత్రమే యాక్సెస్ చేసిన ‘ఐమెసేజ్’లను కూడా ఆండ్రాయిడ్‌లో చూడొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. బడ్జెట్ 2021: నిర్మలమ్మ ముందున్న సవాళ్లు!
కొవిడ్ కారణంగా ఎప్పుడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. పెద్దఎత్తున ఉద్యోగాలు మాయమయ్యాయి. ప్రజలు ఆదాయాలు సైతం పడిపోయాయి. ఏదైనా కొత్త వైరస్ పేరు చెబితేనే ప్రజలు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి చర్యలు చేపడుతూనే దీర్ఘకాలంగా ఉన్న నిరుద్యోగం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిపై దృష్టిసారించాల్సి ఉంది. ఇంతకీ ఈ సారి బడ్జెట్లో ఎదురుకాబోయే కొన్ని ముఖ్యమైన సవాళ్లేంటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ముత్తూట్ ఫైనాన్స్‌లో పట్టపగలే భారీ చోరీ
ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా పట్టపగలే రెచ్చిపోయింది. తమిళనాడులోని హోసూరులో ఉదయం 9.30గంటల సమయంలోనే స్థానిక ముత్తూట్ ఫైనాన్స్‌లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడింది. శుక్రవారం ఉదయం కార్యాలయం తెరుచుకున్న కొద్దిసేపటికి ఆరుగురు దుండగులు ఈ ప్రైవేటు బంగారు రుణాల ఫైనాన్సింగ్ సంస్థ కార్యాలయంలోకి చొరబడి 25కిలోలకు పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ రూ.7.5కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పాటు లాకర్లలో ఉన్న రూ.96వేల నగదు కూడా దోచుకెళ్లినట్టు ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నటరాజ్.. నువ్వో లెజెండ్: వార్నర్
టీమిండియా యువపేసర్, నయా యార్కర్ కింగ్ నటరాజన్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నట్టూ ఓ లెజెండ్, జెంటిల్‌మ్యాన్’ అని కొనియాడాడు. మైదానంలో, వెలుపలా అతడు ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడని అన్నాడు. ఐపీఎల్లో అతడికి సారథిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. సన్‌రైజర్స్ తరఫున నటరాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఆసీస్ సిరీసులో సిరాజ్ దొరికాడు: రవిశాస్త్రి
* 36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
10. షేక్స్పియర్ ప్లే హౌస్ విశేషాలు..
నాటకరంగమే జీవితంగా భావించి రాణించిన రచయిత, నటుడు విలియం షేక్స్పియర్. క్రీ.శ.1600లో షేక్స్పియర్ గ్లోబ్ లేక ఎలిజబెత్ ప్లే హౌస్‌లో నాటకాలను ప్రదర్శించిన మహానటుడు. మూడు అంతస్తుల ఈ నాటకశాలలో ఒకేసారి మూడు వేలమంది షేక్స్పియర్ నాటకాలను చూడగలిగేవారు. వాటిలో 16 హాస్య, 12 విషాదాంత, 11 చారిత్రాత్మక నాటకాలు. వృత్తాకార నాటకశాలలో గోగునారతో అల్లిన ఆసనాలుండేవి. ధనవంతులైన ప్రేక్షకులు వాటిల్లో కూర్చొని తిలకిస్తోంటే సగటు ప్రేక్షకులు నిలబడి చూసేందుకు పెద్ద ఖాళీస్థలం ఉండేది. లండన్ థేమ్స్నదికి ఉత్తర దిక్కునున్న ఈ నాటకశాల పైకప్పుకు రెల్లుగడ్డిని ఉపయోగించడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి