close

తాజా వార్తలు

Published : 14/04/2021 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆగం కావొద్దు ఆలోచించి ఓటేయండి: కేసీఆర్‌

నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి చేసింది శూన్యమని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. 30 ఏళ్ల అనుభవమున్న జానారెడ్డి.. నియోజకవర్గంలోని హాలియాకు డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా పరిధిలోని అనుములలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మోడెర్నా టీకా: 6 నెలలైనా అదే సామర్థ్యం!

కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత కూడా అద్భుత పనితీరు కనబరుస్తుందని మోడెర్నా సంస్థ ప్రకటించింది. వైరస్‌ను ఎదుర్కోవడంలో టీకా 90 శాతం సామర్థ్యం చూపిందని మరోసారి స్పష్టం చేసింది. ఇక వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో వ్యాక్సిన్‌ 95 శాతం ప్రభావశీలత కలిగివుందని వెల్లడించింది. వ్యాక్సిన్‌ ప్రయోగ వివరాలు, టీకా సరఫరాపై తాజా సమాచారాన్ని మోడెర్నా విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వైకాపా ఎమ్మెల్యేకు కరోనా..ఐసీయూలో చికిత్స

3. ‘నిన్న రాళ్ల వర్షం.. ఇవాళ కరెంటు బంద్’

ప్రజలు తిరుగుబాటు చేస్తే ఉన్మాదుల చిరునామా గల్లంతవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సత్యవేడులో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్థితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. సభా ప్రాంతంలో కరెంటు కట్‌ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాళ్ల దాడి చేశారని.. ఇవాళ కరెంటు నిలిపేశారని ధ్వజమెత్తారు. తాను వెళ్లిన చోట కరెంటు కట్‌ చేయాలని ఆదేశాలిచ్చారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భోజన ప్రియుల కోసం.. ఓ విమానం!

నచ్చిన ఆహారాన్ని తెప్పించుకోవడం.. తినేసి, బిల్లు కట్టి రావడం.. అన్ని రెస్టారెంట్ల పద్ధతి ఇదే. వీటన్నింటిని దాటుకొని వినియోగదారులను ఆకట్టుకునే ఆలోచనతో ముందుకు వచ్చింది క్వీన్ ఎయిర్‌వేస్ రెస్టారెంట్. ఒడిశాలోని కటక్-భువనేశ్వర్ జాతీయ రహదారి పక్కన హన్స్‌పాల్ స్క్వేర్ సమీపంలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాక సెల్ఫీ స్పాట్‌గానూ మారిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అప్రమత్తంగా లేకపోతే మనదీ ‘మహా’ పరిస్థితే!

కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని.. అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణకు మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పడకల కొరత ఏర్పడుతుందన్నారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మహారాష్ట్రను కలవరపెడుతోన్న ‘డబుల్‌ మ్యుటేషన్‌’!

6. కుంభమేళా నేటితో ముగింపు..?

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఘనంగా సాగుతున్న కుంభమేళాను నేటితో ముగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఈ కుంభమేళా నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తడం, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మతపెద్దలతో చర్చించి తర్వాత నేటితో ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భాజపాకు 70 సీట్లు కూడా దక్కవు: దీదీ

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కనీసం 70సీట్లలోనూ గెలువలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జలపయ్‌గుడి జిల్లాల్లో పర్యటించిన దీదీ, తృణమూల్‌ కాంగ్రెస్ మరోసారి ‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కానివ్వబోమని స్పష్టం చేశారు. దేశంలో భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పేదలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వకీల్‌సాబ్‌.. పవన్‌ని హత్తుకున్న తారక్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల ‘వకీల్‌సాబ్‌’ చిత్రాన్ని వీక్షించినట్లు నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. ఆ సినిమా చూసిన అనంతరం పవన్‌ని తారక్ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారని ఆయన అన్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘వకీల్‌సాబ్‌’ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు. సినిమాలో తాను పోషించిన నందాజీ పాత్ర, దానికి లభిస్తున్న ప్రశంసల గురించి ఆయన తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సామ్‌ జీవిత పాఠాలు.. తల పట్టుకున్న చాందిని

9. జనతా కర్ఫ్యూ: కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుండటంతో అక్కడి సర్కారు 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రరాజధాని ముంబయి మహానగరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనులు చేస్తున్న వాళ్లు సొంతూళ్ల బాటపట్టారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. SRH x RCB- లైవ్‌ బ్లాగ్‌


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని