close

తాజా వార్తలు

Updated : 04/12/2020 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

GHMC స్పెషల్‌ @ 9 PM

1. మేం ఆశించిన ఫలితం రాలేదు: కేటీఆర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మరో 20-25 స్థానాలు అదనంగా వస్తాయని భావించినట్లు చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ తెరాసే గెలుస్తుందని చెప్పాయని.. కొన్ని డివిజన్లలో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయామన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మా అభ్యర్థుల గెలుపు వారిద్దరికీ అంకితం:సంజయ్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు భాజపాకు గురుతర బాధ్యత అప్పగించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేసి..అబద్ధాలతో గెలిచిందని ఆక్షేపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎగిరిన పతంగి.. మేయర్‌ ఎన్నికలో కీలకం కానుందా?

మజ్లిస్‌.. ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతానికే పరిమితమైన పార్టీ. ఇప్పుడు దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇటీవల బిహార్‌  అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ.. అదే ఉత్సాహంతో ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో దిగింది. గత ఎన్నికల్లో తెరాసతో పొత్తుతో పోటీలో నిలిచిన ఏఐఎంఐఎం.. ఈ సారి సింగిల్‌గానే పోటీ చేసింది. గతంతో పోలిస్తే (44) ఈ సారి ఒక్క డివిజన్‌ కోల్పోయినప్పటికీ 43 చోట్ల సత్తా చాటింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. ఎక్కడ... ఎవరు గెలిచారంటే?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తుది ఫలితాలు వస్తున్నాయి. తెరాస అత్యధికంగా 56 డివిజన్లతో తొలి స్థానంలో నిలవగా, భాజపా 49 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. ఎంఐఎంకు 43 స్థానాలు వచ్చాయి. ఎక్కడ, ఎవరు గెలిచారనే పట్టికలో వివరాలు చూద్దాం.  ఏ డివిజన్‌లో ఎవరు గెలిచారంటే?

5. గ్రేటర్‌లో కళ తప్పిన ‘హస్తం’!

సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఈసారి కూడా ఘోర పరాభవం తప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెరాసకు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ నేతలు గొప్పగా చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనబడుతోంది. ఒకప్పుడు గ్రేటర్‌ పీఠాన్ని ఏలిన కాంగ్రెస్‌.. తాజాగా ఎన్నికల్లోనూ కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక చూసినా, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.  గ్రేటర్‌లో కాంగ్రెస్‌ కళ మసకబారడానికి కారణాలేంటి?   పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. కౌంటింగ్‌... ఎప్పుడు ఏమైందంటే?

హోరాహోరీగా సాగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ కూడా అలానే జరిగింది. ఆధిక్యంలో అటుఇటు మారుతూ వచ్చింది. అసలు ఈ రోజు ఉదయం నుంచి ఎప్పుడు, ఏమైందో చూద్దాం. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

7. తెలంగాణ రాజకీయాలపై ‘గ్రేటర్‌’ ప్రభావమెంత?

ప్రతిష్టాత్మకంగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో నలుగురు కార్పొరేటర్లకే పరిమితమైన భాజపా భారీగా పుంజుకుంది. తెరాసకు గతంలో పోలిస్తే డివిజన్లు బాగా తగ్గాయి. ఎంఐఎం ఎప్పట్లానే తన పట్టు నిలుపుకోగా.. కాంగ్రెస్‌ పూర్తిగా చతికిల పడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చిన ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? సమీప భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రీకౌంటింగ్‌లోనూ విజయం భాజపాదే

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటోంది. బీఎన్‌ రెడ్డి నగర్‌ డివిజన్‌లో తొలుత తెరాస అభ్యర్థి లక్ష్మీప్రస్ననపై కేవలం 10 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీనిపై తెరాస అభ్యర్థి అనుమానం వ్యక్తం చేశారు. ఆమె రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో ఎన్నికల అధికారులు అంగీకరించి రీకౌంటింగ్‌ నిర్వహించారు. అయినప్పటికీ విజయం భాజపానే వరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉప్పల్‌ ఎమ్మెల్యే సతీమణి ఓటమి

గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస తరఫున బరిలోకి దిగిన ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సతీమణి స్వప్న ఓటమి పాలయ్యారు. హబ్సిగూడ డివిజన్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె.. భాజపా అభ్యర్థి చేతన చేతిలో పరాజయం చవిచూశారు. మరోవైపు చర్లపల్లి నుంచి బరిలోకి దిగిన  మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి యాదవ్‌ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి భాజపాకు చెందిన సురేందర్‌గౌడ్‌పై ఆమె జయకేతనం ఎగురవేశారు. 

10. టీపీసీసీకి ఉత్తమ్‌ రాజీనామా

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పీసీసీకి కొత్త సారథిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరినట్లు ఉత్తమ్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని