close

తాజా వార్తలు

Published : 13/07/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. పద్మనాభుడి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్‌కే

కేర‌ళలోని ప్ర‌ముఖ అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి ఆలయ నిర్వ‌హ‌ణ వివాదం ఓ కొలిక్కి వ‌చ్చింది. ఈ ఆల‌య నిర్వ‌హ‌ణ బాధ్య‌త ట్రావెన్‌కోర్ రాజ‌కుటుంబానికే ఉండ‌టాన్ని భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం స‌మ‌ర్థించింది. ఆల‌య నిర్వ‌హ‌ణ‌పై రాజ‌కుటుంబానికి ఉన్న హ‌క్కుల‌ను స‌మ‌ర్థిస్తూనే.. త‌దుప‌రి నిర్వ‌హ‌ణ బాధ్య‌త కూడా వారికే అప్ప‌గిస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. భవిష్యత్‌లో మరింత జాగ్రత్త: స్వర్ణలత

ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదని జోగిని స్వర్ణలత అన్నారు. కరోనా నేపథ్యంలో భవిష్యత్‌లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తన ప్రజలందరినీ కాపాడుకుంటానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. భార‌త్‌: 23వేలు దాటిన కొవిడ్ మ‌ర‌ణాలు!

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం కొన‌సాగుతూనే ఉంది. గ‌త ఐదురోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 28,701 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రోజువారీ కేసుల్లో ఇదే గ‌రిష్ఠం. దీంతో సోమ‌వారం ఉద‌యానికి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,78,254కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇక నిన్న ఒక్క‌రోజే 500మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. వైకాపాకు దిల్లీ హైకోర్టు నోటీసులు

ఎన్నికల సంఘం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ(వైకాపా)కి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అని ప్రచారం చేసి, తమ పార్టీ పేరు దెబ్బతీస్తున్నారని అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన దిల్లీహైకోర్టు ఈ మేరకు సీఎం జగన్‌ నేతృత్వంలోని వైకాపాకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను సెప్టెంబర్‌ 17కి వాయిదా వేసింది.

5. నిజామాబాద్‌ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజీనామా

నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ  మేరకు డీఎంఈకి సమాచారమిచ్చారు. అంతేకాకుండా ఆస్పత్రి డాక్టర్ల వాట్సాప్‌ గ్రూప్‌లోనూ  రాజీనామా చేస్తున్నట్లు  వాయిస్‌ మెసేజ్‌ పెట్టారు. వైద్యసేవల విషయంలో విమర్శలు రావడంతో మనస్థాపం చెందానని ఆయన వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సచిన్‌ పైలట్‌ భాజపాలో చేరడం లేదా?

సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌.. భాజపాలో చేరతారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తల్ని ఆయన ఖండించినట్లు తెలుస్తోంది. భాజపాలో చేరేది లేదని తెలిపినట్లు సమాచారం. అలాగే నేడు భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డాతో కలవబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కూడా పైలట్‌ ఖండించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సైతం ధ్రువీకరించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థల కథనాల ద్వారా తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7.భారత్‌-అమెరికా మధ్యలో గూగుల్‌ ట్యాక్స్‌..!

 ఇటీవల భారత్‌ - అమెరికా మధ్య తరచూ వినిపిస్తున్న పేరు గూగుల్‌ ట్యాక్స్‌. ఇది దీని అసలు పేరు కాదు. అసలు పేరు ఈక్వలైజేషన్‌ ట్యాక్స్‌. 2016-17లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.  అదే ఏడాది జూన్‌ నుంచి అమల్లోకి తెచ్చారు. వాణిజ్య ప్రకటనలతో అత్యధిక ఆదాయం పొందుతూ దేశం బయట శాశ్వత కార్యాలయాలు ఉన్న డిజిటల్‌ కంపెనీలను దీని పరిధిలోకి తీసుకొచ్చారు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి దిగ్గజాలు మొత్తం ఈ చట్ట పరిధిలోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. 2021 నాటికి వ్యాక్సిన్‌ వచ్చేనా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ప్రజలంతా వ్యాక్సిన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో ఫ్రాన్స్‌కు చెందిన ఓ నిపుణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాపై 100 శాతం సమర్థంగా పనిచేసే వ్యాక్సిన్‌ కనీసం 2021 నాటికైనా వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటించడం సహా వైరస్‌ కట్టడికి పాటించాల్సిన నియమాల్ని కఠినంగా అమలు చేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. గూగుల్‌ ఏం తీసుకొస్తొందబ్బా!

గూగుల్‌ విడుదల చేయబోయే ఉత్పత్తి ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మార్కెట్లోకి కొత్త నెస్ట్‌ స్మార్ట్‌ స్పీకర్‌ను లాంచ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు స్మార్ట్‌ వాచ్‌కు సంబంధించిన అధికారిక ఫొటో, వీడియోను విడుదల చేసింది. 2016లో గూగుల్‌ నుంచి వచ్చిన హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్‌ కంటే ఈ కొత్త ప్రొడక్ట్‌ విజయవంతం కాగలదని సంస్థ భావిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నోట్‌ 10 కంటే నోట్‌ 20 చౌక..?

దక్షిణ కొరియాకు చెందిన టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ నోట్‌20 సిరీస్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. అన్నీ సజావుగా సాగితే ఆగస్టు 5వ తేదీన దీనిని విపణిలోకి తీసుకురానుంది. దీనికోసం వర్చువల్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఫోన్‌ ధర కూడా గెలాక్సీ నోట్‌10తో పోలిస్తే చౌకగా ఉండే అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని