Corona Pandemic: ఊరటనిచ్చే వార్తలివే!
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona Pandemic: ఊరటనిచ్చే వార్తలివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కరోనా ప్రభావంతో విలవిల్లాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా కరోనా భయానక వార్తలే. ఒకవైపు వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు పెరగడం, మరణాలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ కొన్ని వార్తలు ప్రజలకు ఊరటనిస్తున్నాయి. అలాంటి వాటిలో టాప్‌-10 పాయింట్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం.

►♦👍 దేశంలో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్‌ కేసుల సంఖ్య 35,16,997కు తగ్గిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

👍 కొవిడ్‌ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ‘2డీజీ(2-డియాక్సీ డి-గ్లూకోజ్‌)’ ఔషధం విడుదలైంది. తొలి విడతలో 10వేల సాచెట్లను అందుబాటులోకి తెచ్చారు.

👍 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. కొవిడ్‌తో అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. పిల్లల పేరిట రూ.10లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

👍 కొవిడ్‌పై పోరుకు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు భారత్‌లో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌- వి వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ లాంచ్‌ను అపోలో హాస్పిటల్స్ ఈ ఉద‌యం ఆవిష్క‌రించింది. డా. రెడ్డీస్ సిబ్బంది అశోక్‌కు స్పుత్నిక్ మొదటి డోసు వేసి వాక్సినేషన్ డ్రైవ్‌ను మొద‌లుపెట్టింది.

👍 ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మ్యాన్‌కైండ్‌ కొవిడ్‌తో బాధపడుతున్న వారికి తనవంతు సాయం ప్రకటించింది. రూ.40కోట్ల విలువైన ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందించనున్నట్లు తెలిపింది.

👍 దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ విశేష సేవలందిస్తోంది. సోమవారం ఉదయం వరకూ 10వేల టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేయడం ద్వారా రికార్డు సృష్టించినట్లు రైల్వేబోర్డు ఛైర్మన్‌ సునీత్‌ శర్మ తెలిపారు.

👍 కరోనా సెకండ్‌ వేవ్‌తో సతమతమవుతున్న భారత్‌కు సాయం చేసేందుకు విదేశాలు తమవంతు సాయం చేస్తున్నాయి. ఇండో-కెనడా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అక్కడి 82 కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌ కలిసి 444,200 కెనడియన్‌ డాలర్ల(భారత కరెన్సీలో రూ.2.66కోట్లు)విలువైన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపింది.

👍 వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(WHO) ద్వారా రాజస్థాన్‌ ప్రభుత్వానికి 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందాయి. ఇందుకు WHOకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ కృతజ్ఞతలు తెలిపారు.

👍 కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. యూరప్‌కు చెందిన శానోఫై, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది.

👍 కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లే వారి విషయంలో విధించిన ఆంక్షలను సౌదీ అరేబియా సడలించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు విదేశాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత 14 నెలలుగా సౌదీ పౌరులపై విదేశాలకు వెళ్లకుండా నిబంధన అమల్లో ఉండటం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని