ఏపీ పరిషత్‌: 60.78శాతం పోలింగ్‌ నమోదు
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ పరిషత్‌: 60.78శాతం పోలింగ్‌ నమోదు

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్‌ నమోదైందని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68.27 శాతం మంది ఓటు వేయగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 51.68 శాతం ఓటింగ్‌ నమోదు అయిందన్నారు. విజయనగరం జిల్లా అంబటిపేట, నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో శుక్రవారం రీపోలింగ్‌ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరిషత్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గడానికి వేర్వేరు కారణాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఓట్ల లెక్కింపుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉయ్యందలలో రిగ్గింగ్‌పై కలెక్టర్‌ నివేదిక కోరామని.. ఆ నివేదిక వచ్చాక రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని