అరకు లోయలోకి దూసుకెళ్లిన బస్సు..నలుగురు మృతి
close

తాజా వార్తలు

Updated : 12/02/2021 23:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరకు లోయలోకి దూసుకెళ్లిన బస్సు..నలుగురు మృతి

19 మందికి గాయాలు

అనంతగిరి: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఐదో నంబర్‌ మలుపు వద్ద బోల్తా పడిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది పర్యాటకులు ఉండగా.. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 19 మందికి గాయాలైనట్లు అనంతగిరి ఎస్సై తెలిపారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఐదుగురు చిన్నారులు సహా 12 మందిని ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు. మరికొంత మంది క్షతగాత్రులను అనంతగిరి, కేజీహెచ్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బస్సు దాదాపు 80 అడుగుల లోతులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రమాదానికి గురైన బస్సును హైదరాబాద్‌ షేక్‌పేటకు చెందిన దినేశ్‌ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తిగా చీకటి పడటంతో సహాయకచర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. బాధితులంతా ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నుంచి అరకు వచ్చి.. అరకు నుంచి తిరిగి వెళ్తుండగా లోయలోకి బస్సు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాద వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూంని ఏర్పాటు చేశారు. వివరాలకు 08912590102, 08912590100 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని