TS: ‘మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేయండి’
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: ‘మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేయండి’

హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ), తెలంగాణ జనసమితి (తెజస) కోరాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి టీపీసీసీ నేతలతో పాటు తెజస అధ్యక్షుడు కోదండరాం వేర్వేరుగా లేఖలు రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాయి. 

కొవిడ్‌ తీవ్రత, మరణాలు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని కోదండరాం కోరారు. ఈనెల 30న వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 

ప్రచార సమయం కుదింపు

త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) కుదించింది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో రాత్రి 8 గంటల్లోపు ప్రచారం ముగించాలని ఎస్‌ఈసీ సూచించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని